avika
-
హీరోయిన్లను మార్చేస్తున్నాడు
హ్యాట్రిక్ సక్సెస్‌లతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో నిఖిల్‌కు శంకరాభరణం సినిమాతో షాక్ తగిలింది. ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకొని వరుస విజయాలు సాధిస్తున్న నిఖిల్.. శంకరాభరణంతో మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. ముఖ్యంగా రొటీన్ కామెడీతో బోర్ కొట్టించిన ఈ యంగ్ హీరో తదుపరి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. శంకరాభరణం సినిమా విడుదలకు ముందే టైగర్ ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు నిఖిల్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లను ఫైనల్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఆ ముగ్గురిని మర్చేయాలని నిర్ణయించుకుందట. ముందుగా ఈ సినిమాలో తాప్సీ, కేథరిన్, అవికా గోర్లు హీరోయిన్లుగా నటిస్తారని ప్రకటించారు. శంకరాభరణం రిజల్ట్ తరువాత ఆ నిర్ణయం మార్చుకున్నారు. టాలీవుడ్లో పెద్దగా సక్సెస్ లేని తాప్సీని ముందే పక్కనపెట్టిన నిఖిల్ టీం, తరువాత కేథరిన్ ప్లేస్‌లో కుమారి 21ఎఫ్ హీరోయిన్ హేబా పటేల్‌ను సెలెక్ట్ చేశారు. తాజాగా అవికాను కూడా పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. బాగా బొద్దుగా తయారైన అవికా, నిఖిల్ పక్కన సూట్ అవ్వదనే ఆలోచనతో అవికాను కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే సరికి ఇంకెన్ని మార్పులు చేస్తారో చూడాలి. -
నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న అవికా..?
-
లక్ష్మీ రావే మా ఇంటికి మూవీ స్టిల్స్
-
సంప్రదాయబద్ధంగా రావే...
‘ఉయ్యాలా జంపాలా’ఫేం అవికా, నాగశౌర్య జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. నంద్యాల రవి దర్శకుడు. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా గురించి మామిడిపల్లి గిరిధర్ మాట్లాడుతూ- ‘‘పేరుకు తగ్గట్టే సంప్రదాయబద్దంగా, పూర్తిస్థాయి వినోదంగా ఉంటుందీ సినిమా. నాగశౌర్య, అవికా పోటీపడి నటిస్తున్నారు. ఏప్రిల్ 24న ఈ చిత్రం రెండో షెడ్యూల్ మొదలైంది. ఈ నెల 13 వరకూ జరిగే ఈ షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుంది’’ అని తెలిపారు. జూన్, జూలైల్లో కూర్గ్, పాండిచ్చేరిల్లో జరిగే మూడో షెడ్యూల్లో ఈ చిత్రం పాటలను చిత్రీకరిస్తామని దర్శకుడు తెలిపారు. సీనియర్ నరేశ్, రావురమేశ్, వెన్నెల కిశోర్, ప్రగతి, అనితాచౌదరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాలిరెడ్డి, సంగీతం: కేఎం రాధాకృష్ణన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కుంపట్ల రాంబాబు. -
యంగ్ హీరోలకు బెస్ట్ చాయిస్ అవికా