హీరోయిన్లను మార్చేస్తున్నాడు | nikhil more care on next film with vi anandh | Sakshi
Sakshi News home page

హీరోయిన్లను మార్చేస్తున్నాడు

Published Tue, Dec 22 2015 6:37 PM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

హీరోయిన్లను మార్చేస్తున్నాడు

హీరోయిన్లను మార్చేస్తున్నాడు

హ్యాట్రిక్ సక్సెస్లతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో నిఖిల్కు శంకరాభరణం సినిమాతో షాక్ తగిలింది. ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకొని వరుస విజయాలు సాధిస్తున్న నిఖిల్.. శంకరాభరణంతో మాత్రం ఆ మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోయాడు. ముఖ్యంగా రొటీన్ కామెడీతో బోర్ కొట్టించిన ఈ యంగ్ హీరో తదుపరి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

శంకరాభరణం సినిమా విడుదలకు ముందే టైగర్ ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు నిఖిల్. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లను ఫైనల్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఆ ముగ్గురిని మర్చేయాలని నిర్ణయించుకుందట. ముందుగా ఈ సినిమాలో తాప్సీ, కేథరిన్, అవికా గోర్లు హీరోయిన్లుగా నటిస్తారని ప్రకటించారు. శంకరాభరణం రిజల్ట్ తరువాత ఆ నిర్ణయం మార్చుకున్నారు.

టాలీవుడ్లో పెద్దగా సక్సెస్ లేని తాప్సీని ముందే పక్కనపెట్టిన నిఖిల్ టీం, తరువాత కేథరిన్ ప్లేస్లో కుమారి 21ఎఫ్ హీరోయిన్ హేబా పటేల్ను సెలెక్ట్ చేశారు. తాజాగా అవికాను కూడా పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. బాగా బొద్దుగా తయారైన అవికా, నిఖిల్ పక్కన సూట్ అవ్వదనే ఆలోచనతో అవికాను కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే సరికి ఇంకెన్ని మార్పులు చేస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement