vi anandh
-
అలాంటి సినిమాలంటే చాలా ఇష్టం
‘‘డైరెక్టర్ ఆనంద్, నేను మంచి స్నేహితులం. ‘ఊరు పేరు భైరవకోన’ లాంటి సినిమాని ఆయన నాతో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాలంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘నా పుట్టినరోజున(ఆదివారం) ఈ మూవీ టీజర్ విడుదల కావడం స్పెషల్ మూమెంట్. తొలిసారి చండీయాగం చేసి టీజర్ రిలీజ్ చేయడం చాలా పాజిటివ్‌గా ఉంది. అనిల్ సుంకరగారు లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చేది కాదు’’ అన్నారు. ‘‘టైగర్’ సినిమా నుంచి సందీప్, నాకు స్నేహం మొదలైంది. మరోసారి కలసి సినిమా చేస్తే ఇంకా గ్రాండ్‌గా ఉండాలని ‘ఊరు పేరు భైరవకోన’ చేశాం’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఈ సినిమా సందీప్ కెరీర్లో మరచిపోలేని బహుమతి అవుతుందని మాట ఇస్తున్నా’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘మహాచండీ యాగంతో టీజర్‌లాంచ్ చేయడం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి. ఈ ఐడియా ఇచ్చిన సందీప్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు రాజేష్ దండా. హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాజ్ తోట. -
'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' ఫస్ట్ లుక్
స్వామి రారా, కార్తీకేయ లాంటి సినిమాల సక్సెస్‌లతో ఫాంలోకి వచ్చినట్టు కనిపించిన యంగ్ హీరో నిఖిల్, తరువాత శంకరాభరణం సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకునే సమయంలో భారీ డిజాస్టర్ ఎదురుకావటంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన ఎక్స్పరిమెంటల్ జానర్లోనే తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా టైగర్ చిత్రాన్ని తెరకెక్కించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు నిఖిల్. హేబా పటేల్, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు 'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. తాజాగా టైటిల్‌తో పాటు నిఖిల్ లుక్‌ను రివీల్ చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. -
వెరైటీ టైటిల్‌తో వస్తోన్న నిఖిల్
రెగ్యులర్ జానర్‌కు భిన్నంగా ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్, తన లేటెస్ట్ సినిమా శంకరాభరణంతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు, దీంతో మరోసారి ఆలోచనలో పడ్డ కుర్ర హీరో ప్రస్తుతం టైగర్ ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఓ వెరైటీ టైటిల్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో 'అమల' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వచ్చినా చిత్రయూనిట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు. ప్రస్తుతం ఓ అచ్చమైన తెలుగు టైటిల్‌ను పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే నిఖిల్ ఇమేజ్‌తో పాటు కథకు కూడా సెట్ అయ్యేలా, 'ఎక్కడి పోతావు చిన్నవాడా..?' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు చిత్రయూనిట్. ఇటీవల అచ్చమైన తెలుగు పేర్లతో వస్తున్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తుండటంతో ఈ టైటిల్ నిఖిల్ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే 'ఎక్కడికి పోతావు చిన్నవాడా..?' టైటిల్‌ను చిత్రయూనిట్ అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారు. -
హీరోయిన్లను మార్చేస్తున్నాడు
హ్యాట్రిక్ సక్సెస్‌లతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో నిఖిల్‌కు శంకరాభరణం సినిమాతో షాక్ తగిలింది. ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకొని వరుస విజయాలు సాధిస్తున్న నిఖిల్.. శంకరాభరణంతో మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. ముఖ్యంగా రొటీన్ కామెడీతో బోర్ కొట్టించిన ఈ యంగ్ హీరో తదుపరి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. శంకరాభరణం సినిమా విడుదలకు ముందే టైగర్ ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు నిఖిల్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లను ఫైనల్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఆ ముగ్గురిని మర్చేయాలని నిర్ణయించుకుందట. ముందుగా ఈ సినిమాలో తాప్సీ, కేథరిన్, అవికా గోర్లు హీరోయిన్లుగా నటిస్తారని ప్రకటించారు. శంకరాభరణం రిజల్ట్ తరువాత ఆ నిర్ణయం మార్చుకున్నారు. టాలీవుడ్లో పెద్దగా సక్సెస్ లేని తాప్సీని ముందే పక్కనపెట్టిన నిఖిల్ టీం, తరువాత కేథరిన్ ప్లేస్‌లో కుమారి 21ఎఫ్ హీరోయిన్ హేబా పటేల్‌ను సెలెక్ట్ చేశారు. తాజాగా అవికాను కూడా పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. బాగా బొద్దుగా తయారైన అవికా, నిఖిల్ పక్కన సూట్ అవ్వదనే ఆలోచనతో అవికాను కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే సరికి ఇంకెన్ని మార్పులు చేస్తారో చూడాలి.