కామారెడ్డి జిల్లా అడ్లూర్ చెరువు ఘటనలో భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్ మృతదేహం కూడా లభ్యం
బుధవారం రాత్రే చెరువులోంచి కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్ శవాలు వెలికితీత
ఒకేచోట, ఒకే సమయంలో 3 మరణాలు
పోలీసులకు సవాల్‌గా మారిన దర్యాప్తు
పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే వివరాలు తెలిసే అవకాశం
కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధుశర్మ వెల్లడి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం/భిక్కనూరు: ఒకే సమయంలో, ఒకేచోట ఒక ఎస్‌ఐ, కానిస్టేబుల్, మరో యు వకుడు చనిపోవటం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్ (32), బీబీపేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి (30), బీబీ పేటకే చెందిన నిఖిల్ (29) అనే యువకుడి మృతదేహాలు జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో లభ్య మయ్యా యి.
శృతి, నిఖిల్ మృత దేహాలు బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బయటకు తీయగా, గురువారం ఉదయం 8.30 గంటలకు సాయికుమార్ మృతదేహం కూడా అదే చెరువులో దొరికింది. దీంతో వీరు ఎలా చనిపోయారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇవి ఆత్మహత్యలా? లేక ఈ మరణాల వెనుక ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన పోలీస్ శాఖను కూడా కుదిపేస్తోంది. మృతులు ముగ్గురికి చాలాకాలం నుంచి పరిచయం ఉండటంతో రకరకాల చర్చ జరుగుతోంది.
అనుకోకుండా బయటపడిన ఘటన..
ఈ మూడు మరణాల ఘటన కూడా అనుకోకుండా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ సాయికుమార్ ఫోన్ స్విచాఫ్ వస్తోంద ని ఆయన కుటుంబ సభ్యులు బుధవారం పోలీస్ ఉన్నతాధికారులకు తెలపటంతో.. ఆయన మొబైల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద సాయికుమార్, నిఖిల్ చెప్పులు, సెల్‌ఫోన్లు.. శ్రుతి మొ బైల్ కనిపించాయి. ఎస్‌ఐ కారు కూడా చెరువు సమీపంలో ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. గజ ఈతగా ళ్లతో చెరువులో గాలించగా మరణాల మిస్టరీ బయటపడింది.
జిల్లా ఎస్పీ సింధుశర్మ, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. దాదాపు 12 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. 3 మృతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తిచేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అంతుచిక్కని కారణాలు: ఈ ముగ్గురి మరణం వెనుక గల కారణాలు ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. వీరు ఎలా చనిపోయారన్నది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే తేలుతుందని ఎస్పీ సింధుశర్మ తెలిపారు. అయితే, వీరి మరణంపై జిల్లాలో తీవ్రంగా చర్చ సాగుతోంది. ఎస్సై సాయికుమా ర్ బీబీ పేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన సమయంలో శ్రుతితో సన్నిహితంగా ఉండేవారని ప్రచారం జరుగుతోంది. నిఖిల్ ఇటు సాయికుమార్‌తో అటు శ్రుతితో క్లో జ్‌గా ఉండేవాడని సమాచారం. ముగ్గురూ ఒకేసారి చనిపోవ డంతో వారి మధ్య నడిచిన వ్యవహా రం ఏమిటన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
సాయికుమార్ స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారం మండ లం కిష్టాపూర్ గ్రామం. 2018 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన ఆయన.. 2022 ఏప్రిల్ 13న బీబీపేటలో ఎస్‌ఐ గా చేరారు. గత ఏడాది ఆగస్టు 1న భిక్కనూరు ఎస్‌ఐగా బదిలీ అయ్యారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో 2021 నుంచి పనిచేస్తోంది. బీబీపేటకు చెందిన తోట నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్ల రిపేర్లు చేసేవాడు. పోలీస్‌స్టేషన్‌లో కంప్యూటర్లు మొరాయించినపుడు అతడే వచ్చి రిపేర్ చేసి వెళ్లేవాడని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కలిసి చనిపోయేదాకా ఎందుకు వచ్చిందన్నదానిపై పోలీసులు దృష్టి పెట్టారు.
నా కొడుకు పిరికివాడు కాదు: పోస్ట్‌మార్టం నిర్వహించిన కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్దకు మృతులకు టుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకొని బోరున విలపించారు. తన కొడుకు కష్టపడి చదివి ఉద్యోగం సాధించాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఎస్‌ఐ సాయికుమార్ తండ్రి అంజయ్యకన్నీరుమున్నీరయ్యాడు. ఎవ రో ఒకరిని కాపాడే ప్ర యత్నంలో చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేశా రు. శ్రుతి తండ్రి పుండరీకం మాట్లా డుతూ.. ఈ ఘటన ఎలా జరిగిందనేది పోలీసులు తేల్చాలని కోరారు. నిఖిల్ చనిపోయిన విషయం పోలీసు లు చెబితే తెలిసిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
చదువులో టాపర్
ఎస్‌ఐ సాయికుమార్ చిన్నతనం నుంచి చదువు లో టాపర్. 2007–2008లో పదో తరగతిలో మండల టాపర్‌గా నిలిచాడు. ఇంటర్‌లోనూ మంచి మార్కులు సాధించారు. హైదారాబాద్‌లోని సీబీఐటీలో బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. 2018లో పోస్టల్ డిపార్టుమెంట్, ఏఆర్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఎస్సైగా మొదటి పోస్టింగ్ సాధించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీబీపేట, భిక్కనూరులో ఎస్సైగా చేశాడు. రెండు పర్యాయాలు ఎస్పీ సింధుశర్మ చేతులమీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. 2022లో కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. మహాలక్ష్మి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment