
‘‘వరుడు కావలెను’ చిత్రం టీజర్, ట్రైలర్ చూసి కొందరు ఇది ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. మంచి భావోద్వేగాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న ఎంటర్‌టైనర్’’ అని రీతూ వర్మ అన్నారు. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది.
చదవండి: Vijay Devarakonda: విజయ్‌కి 40 నుంచి 50 వరకు రిలేషన్‌షిప్స్ ఉండేవి: ఆనంద్
ఈ సంద ర్భంగా రీతూ వర్మ మాట్లాడుతూ..‘‘లక్ష్మీ సౌజన్యగారు ఈ సినిమా కథ చెప్పగానే బాగా నచ్చేసింది. నాకు ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. ఈ మూవీలో నేను చేసిన భూమి పాత్ర అలాంటిదే.. నేను చేసిన బెస్ట్ క్యారెక్టర్స్‌లో ఒకటిగా నిలిచిపోతుంది. సెట్స్‌లో అడుగుపెట్టాక మేల్ డైరెక్టర్, ఫీమేల్ డైరెక్టర్ అనే తేడా ఉండదు.. అందరితో సౌకర్యంగా పని చేస్తాను. మా జంట (నాగశౌర్య–రీతూ) బాగుందని చాలామంది చెబుతుంటే రిలీజ్‌కి ముందే సగం రిజల్ట్ వచ్చేసినట్టుంది.
చదవండి: ‘హరిహర వీరమల్లు’లో అకీరా?, తండ్రితో కలిసి పలు సీన్స్‌లో సందడి..
డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇప్పటివరకు నాకు డ్యాన్స్ చేసే సాంగ్స్ పడలేదు. ఈ సినిమాలో ‘దిగు దిగు...’ అనే మాస్ సాంగ్ చేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం శర్వానంద్‌తో ‘ఒకే ఒక జీవితం’ సినిమా చేస్తున్నాను. తమిళ్‌లో ఓ సినిమా, ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అన్నారు. పెళ్లెప్పుడు అని అడగ్గా.. ‘‘ఇంకా రెండు మూడేళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి నిర్ణయాన్ని మా ఇంట్లో నాకే వదిలేశారు. అయినా అప్పుడప్పుడూ పెళ్లి మాట ఎత్తకుండా ఉండరు (నవ్వుతూ)’’ అన్నారు రీతూ వర్మ.
Comments
Please login to add a commentAdd a comment