
మెగా వేడుక
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మొదటి హీరోయిన్ నీహారిక. మెగా బ్రదర్ ముద్దుల తనయ అయినా నీహా ఇప్పటికే బుల్లితెరపై తన టాలెంట్‌ని నిరూపించేసుకున్నారు. ‘ఒక మనసు’ ద్వారా వెండితెరకు పరిచయం కానున్నారు.
రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుకకు ముహూర్తం ఖరారైంది. సునీల్ కశ్యప్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల వేడుక ఈ నెల 18న ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్ ముఖ్యఅతిథులుగా విచ్చేయనున్నారు. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.