నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్‌ అర్థం ఏంటి? | Niharika Konidela Latest Instgram Post Goes Viral | Sakshi
Sakshi News home page

Niharika Konidela: నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్‌ అర్థం ఏంటి?

Published Tue, Apr 9 2024 11:03 AM | Last Updated on Tue, Apr 9 2024 2:01 PM

Niharika Konidela Latest Instgram Post Goes Viral - Sakshi

విడాకుల తర్వాత మెగాడాటర్‌ నిహారిక కొణిదెల కెరీర్‌ పరంగా ఫుల్‌ బిజీ అయిపోయింది. హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తూనే..యాంకర్‌గాను ఓ షో చేస్తుంది. అలాగే నిర్మాతగాను మారి సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తున్నారు. అలాగే ఖాలీ సమయం దొరికనప్పుడల్లా ప్రెండ్స్‌తో కలిసి టూర్‌కి వెళ్తూ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో ఆమెను ట్రోల్‌ చేస్తున్నా..పట్టించుకోకుండా తనకు నచ్చిన పనిని చేసుకుంటూ పోతుంది.

అయితే ఆమె పర్సనల్‌ లైఫ్‌పై మాత్రం సోషల్‌ మీడియాలో ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇటీవల ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో..ఆల్రెడీ ప్రేమలో పడిందని పుకార్లు వినిపించాయి. నిహారిక మాత్రం వాటిపై స్పదించకుండా..నెట్టింత హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఓ స్టోరీ మరోసారి ఆమె పెళ్లి విషయంపై చర్చకు దారి తీసింది.

అందులో ఏముందంటే.. ఓ ఏనుగుల జంట రెండు ముఖాలను దగ్గరగా పెట్టుకొని ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి. ఆ ఫోటోని నిహారిక ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. రెడ్‌ హార్ట్‌ సింబల్‌ పెట్టింది. అది చూసిన వారంత నిహారిక మరోసారి ప్రేమలో పడిందని.. అందుకే ఇలాంటి పోస్టులు పెడుతుందని చర్చించుకుంటుననారు. అయితే నిహారికలో మళ్లీ ప్రేమలో పడలేదని, ప్రస్తుతానికి ఆమె ఫోకస్‌ అంతా కెరీర్‌పైనే ఉందని మెగా ఫాన్స్‌ అంటున్నారు. తనకు ఏనుగులు అంటే ఇష్టమని.. అందుకే వాటికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసి ఉంటారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement