భార్యను బండరాయితో మోది చంపిన భర్త
మేడిపల్లి: ఇంట్లో జరిగిన గొడవ చినికి చినికి గాలివానలా మారి.. ఓ ఇల్లాలి ప్రాణం తీసింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాపసింగారంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన నిహారిక(35), శ్రీకర్‌రెడ్డి దంపతులు.
వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘట్‌కేసర్ మండలం ప్రతాపసింగారంలో నిహారికకు పుట్టింటి వారు ఓ ఇల్లు రాసివ్వగా...వీరు ఆ నివాసంలోనే ఉంటున్నారు. కాగా ఈ ఇల్లు రాసిచ్చిన విషయంలో నిహారిక, శ్రీకర్‌రెడ్డిల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారు జామున ఇంటి విషయంపై మరోసారి గొడవ జరగడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా..తోపులాటలో నిహారిక కింద పడిపోయింది.
అప్పటికే ఆవేశంలో ఉన్న శ్రీకర్‌రెడ్డి పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టడంతో నిహారిక అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఇచి్చన సమాచారంతో మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment