రష్మికా మండన్న
‘‘ఏ సినిమాకైనా స్టోరీ ఇంపార్టెంట్ అని నమ్ముతాను. ‘ఛలో’ సినిమాలో ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఉందనిపించింది. వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాను’’ అన్నారు రష్మికా మండన్న. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్‌ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ‘ఛలో’ ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కథానాయిక రష్మిక మాట్లాడుతూ– ‘‘డిగ్రీ కంప్లీట్ చేయడానికి బెంగళూరు వచ్చా. ఆ టైమ్‌లోనే కన్నడ చిత్రం ‘కిర్రిక్ పార్టీ’లో నటించే చాన్స్ వచ్చింది. అలా నా సినీ ప్రయాణం స్టారై్టంది. ‘కిర్రిక్ పారీలో నా యాక్టింగ్ చూసి ‘ఛలో’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు దర్శక–నిర్మాతలు.
ఐరా క్రియేషన్స్ ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎ్రంటీ ఇస్తున్నందుకు హ్యాపీ. షూటింగ్ స్పాట్‌లో చాలా ఎంజాయ్ చేశా. ‘ఛలో’ యాప్ట్ టైటిల్ అని సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అనుకుంటారన్న నమ్మకం ఉంది. షూటింగ్‌కి ముందు రోజే దర్శకులు వెంకీగారు డైలాగ్స్ పేపర్స్ ఇచ్చేవారు. డైరెక్టర్‌కు థ్యాంక్స్. ప్రిపేరై లొకేషన్‌కి వెళ్లెదాన్ని. సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి ఈ ప్రాసెస్ ఉపయోగపడింది. భవిష్యత్‌లో నేను చేయబోయే చిత్రాలకు సొంత డబ్బింగ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. నాగశౌర్య మోస్ట్ కంఫర్టబుల్ హీరో. షూటింగ్ టైమ్‌లో చాలా హెల్ప్ చేశారు. ఎవరినైనా ఇన్‌స్పైరింగ్‌గా తీసుకునేంత మెచ్యూర్టీ నాలో ఇంకా రాలేదు. కానీ హీరోయిన్ అనుష్కా శెట్టి వర్కింగ్ స్టైల్ అండ్ కమిట్‌మెంట్ నాకు ఇన్‌స్పైరింగ్‌లా అనిపిస్తాయి. ప్రజెంట్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నాను. కన్నడలో మరో రెండు సినిమాలు చేస్తున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment