Rashmika Mandanna To Act Opposite To Nithin In Bhishma Under The Direction of Venky Kudumula - Sakshi
Sakshi News home page

Published Tue, Oct 9 2018 12:16 PM | Last Updated on Tue, Oct 9 2018 12:42 PM

Rashmika Mandanna to Romance Nithin In Bheeshma - Sakshi

ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన టాలెంటెడ్‌ బ్యూటీ రష్మిక మందన్న. తొలి సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. గీత గోవిందం సినిమాకు ఏకంగా వంద కోట్ల వసూళ్లు రావటంతో రష్మిక కూడా లక్కీ గర్ల్‌ అన్న ముద్ర పడిపోయింది. అయితే యంగ్ హీరోలు, దర్శకులు రష్మిక కోసం క్యూ కడుతున్నారు.

తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రష్మికను ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. రష్మికను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. నితిన్‌ హీరోగా భీష్మా పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు కూడా రష్మికనే హీరోయిన్‌గా కన్ఫమ్‌ చేశాడు వెంకీ. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement