సిబిరాజ్‌కు జంటగా కిడారి నాయకి | Nikhila to play a moden girl in her next with Sibiraj | Sakshi
Sakshi News home page

సిబిరాజ్‌కు జంటగా కిడారి నాయకి

Published Wed, Mar 15 2017 3:09 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

సిబిరాజ్‌కు జంటగా కిడారి నాయకి

సిబిరాజ్‌కు జంటగా కిడారి నాయకి

కిడారి చిత్రంలో శశికుమార్‌కు జంటగా నటించి చక్కని హావభావాలతో తమిళ ప్రేక్షకులను అలరించిన నటి నిఖిలవిమల్‌. ఈ అమ్మడికిప్పుడు నటుడు సిబిరాజ్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం వరించింది. సిబిరాజ్‌ నటించిన కట్టప్పావ కానోమ్‌ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.దీంతో ఆయన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. బాస్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మాత విజయ్‌ కే.సెల్లయ్య నిర్మిస్తున్న ఈచిత్రానికి దర్శకుడు విజయ్‌Š. దురై శిష్యుడు, పలు వాణిజ్య ప్రకటనలు రూపొందించిన వినోద్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

 ఈ చిత్రంలో నటించడానికి నటి నిఖిలవిమల్‌ చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తోందట. దీని గురించి ఈ బ్యూటీ చెబుతూ ఇంతకు ముందు నటించిన చిత్రంలో తనను గ్రామీణ యువతిగా చూసిన తమిళ ప్రేక్షకులు ఈ చిత్రంలో సిటీ గర్ల్‌గా చూడబోతున్నారని చెప్పింది.యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఒకే కార్యాలయంలో పని చేసే కళాకారులుగా తాను, సిబిరాజ్‌ నటించనున్నామని తెలిపింది.

 సామాజిక సమస్య ఇతివృత్తంగా రూపందనున్న  మంచి కథా చిత్రంలో తానూ ఒక భాగం కానుండడం గర్వంగా ఉందని చెప్పింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్‌ త్వరలో  కశ్మీర్‌లో ప్రారంభం కానుందని, ఆ తరువాత పొల్లాచ్చి, చెన్నై ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకోనుందని చిత్ర వర్గాలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement