
నటుడు సిబిరాజ్, ఆండ్రియా, అతుల్య రవి హీరో హీరోయిన్లుగా నటింన చిత్రం వట్టం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతలు ఎస్ ఆర్ ప్రభు, ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు నిర్మించిన తాజా చిత్రం ఇది. కమలకన్నన్ దీనికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 29వ తేదీన నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
దర్శకుడు మాట్లాడుతూ.. సిబిరాజ్, ఆండ్రియా, అతుల్య రవి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారన్నారు. సిబిరాజ్ మాట్లాడుతూ.. ఓటీటీలో విడుదలవుతున్న తన తొలి చిత్రం ఇదేనని తెలిపారు. చిత్ర నిర్మాత ఎస్సార్ ప్రభు మాట్లాడుతూ.. జీవితంలో ప్రేమికుల మధ్య సమస్యలు తలెత్తినా, ఆ తర్వాత అవి సమసిపోతాయని అలాంటి ఇతివృత్తంతో కూడిన చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో హీరోగా ఎవరైతే బాగుంటుంది అన్న ఆలోచించినప్పుడు సిబిరాజ్ గుర్తొచ్చారని చెప్పారు. ఆండ్రియా, అతుల్య రవి పాత్రల్లో ఒదిగిపోయారని అన్నారు.
చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్
పదివారాల తర్వాతే ఓటీటీలో పెద్ద సినిమాలు
Comments
Please login to add a commentAdd a comment