Andrea Jeremiah
-
థాయ్‌లాండ్‌లో ఆండ్రియా చిల్.. బీచ్‌లో తంగలాన్ బ్యూటీ మాళవిక
మహేశ్ బాబుతో సంక్రాంతి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్..థాయ్‌లాండ్‌లో హీరోయిన్ ఆండ్రియా జెరేమా..బాలయ్యతో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా..బీచ్‌లో తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్..యాంకర్ రష్మీ గౌతమ్ సంక్రాంతి లుక్.. కాలేజీ రోజులను గుర్తు చేసుకున్న సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం హీరోయిన్ మంజరి..బ్లాక్ డ్రెస్‌లో బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) -
చెన్నై 'పుష్ప'గాడి ఈవెంట్లో ముగ్గురు స్టార్స్.. ఎవరో తెలుసా..?
పుష్పగాడి మాస్ జాతర కొనసాగుతుంది. పట్నాలో ఏర్పాటు చేసిన పుష్ప సినిమా ట్రైలర్ ఈవెంట్‌కు సుమారు 2 లక్షల మందికిపైగానే తరలివచ్చారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప2 మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చాలా గ్రాండ్‌గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 24న పుష్ప వైల్డ్‌ఫైర్ ఈవెంట్ పేరుతో చెన్నైలో మరో భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా ముగ్గురు సింగర్స్ ఉండనున్నారు.పట్నాలో జరిగిన ట్రైలర్ కార్యక్రమంలో భోజ్‌పురి స్టార్ సింగర్ అక్షర సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, చెన్నై వేదికగా ఆదివారం సాయింత్రం 5గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ముగ్గురు సింగర్స్ దుమ్మురేపనున్నారు. వారిలో ఇద్దరూ పుష్ప-1 సినిమాలో తమిళ్ వర్షన్‌కు సంబంధించి రెండు సూపర్ హిట్ సాంగ్స్ పాడినవారు కావడం విశేషం. ఆండ్రియా జర్మియా (ఊ సోల్రియా మావా), రాజలక్ష్మి (సామీ సామీ ) సాంగ్స్‌తో మెప్పించిన వారైతే.. పార్ట్2లో 'కిస్సిక్' అనే పాటను ఆలపించిన సుబ్లాషిని వేదికపైన సందడి చేయనున్నారు.ఆండ్రియా నటిగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే.. ఈ ఏడాదిలో వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రంలో ఆమె మెప్పించిన విషయం తెలిసిందే. రాజలక్ష్మి కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫాలో అయ్యే వాళ్లకు పరిచయమేనని చెప్పవచ్చు. ‘కిస్సిక్’ అనే సాంగ్ ఆదివారం రాత్రి 7:02గంటలకు విడుదల కానుంది. ఈ పాటను తెలుగు, తమిళ్, కన్నడలో ఆలపించిన సుబ్లాషిణి అక్కడ లైవ్ ఫర్ఫామ్ చేయనుంది. చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం, సాయి రామ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ కార్యక్రమం జరగనుంది. డిసెంబరు 5న పుష్పరాజ్ మీ ముందుకు రాబోతున్నాడు. -
నగ్నంగా నటించిన ఆండ్రియా.. హిట్ సినిమా సీక్వెల్ విడుదలకు చిక్కులు
కోలీవుడ్ సంచలన దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పిశాచి–2. 2014లో ఈయన దర్శకత్వంలో రూపొంది మంచి విజయాన్ని సాధించిన పిశాచి చిత్రానికి ఇది సీక్వెల్‌గా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, పలు అడ్డంకులు రావడంతో ఈ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడ్డాయి.రాక్‌ఫోర్ట్ పతాకంపై మురుగానందం నిర్మించిన పిశాచి–2 చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించింది. నటుడు విజయ్ సేతుపతి గౌరవ పాత్రలో నటించారు. అయితే, ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వద్దొంటూ ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ సంస్థ నుంచి ఒక సినిమా హక్కులను పొందిన రాక్‌ఫోర్ట్ ఇరువురి ఒప్పందం ప్రకారం రూ. 4.85 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి రాక్‌ఫోర్డ్ సంస్థ అధినేతలు డబ్బు చెల్లించిన తర్వాతే పిశాచి-2 చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం. వడ్డీతో సహా ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి రూ. 1.85 కోట్లు చెల్లించాలని కోర్టు తెలిపింది. అంత వరకు పిశాచి 2 విడుదలను నిషేధించాలని తెలిపింది. ఈ కేసు న్యాయమూర్తి జికె ఎలండ్రైయన్ ఎదుట విచారణకు వచ్చింది. నవంబర్ 18వరకు ఈ కేసును కోర్టు వాయిదా వేసింది. ఈ తేదీలోగా ప్రతిస్పందించాలని రాక్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ను కోర్టు ఆదేశించబడింది.ఈ చిత్రంలో నగ్నంగా నటించిన ఆండ్రియాఈ చిత్రంలో నటి ఆండ్రియా పూర్తి నగ్నంగా నటించిందని తెలుస్తోంది. అందుకు ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందనే ప్రచారం కూడా వైరల్ అవుతుంది. దీనిపై దర్శకుడు మిష్కిన్ స్పందిస్తూ చిత్రం కోసం నటి ఆండ్రియాను నగ్నంగా చిత్రీకరించిన విషయం నిజమేనన్నారు. అందుకు ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేయడం కూడా సహజమేనని పేర్కొన్నారు. అయితే, ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాలను చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు పేర్కొన్నారు. అవి కూడా ఆమె సన్నిహితురాలు అయిన ఫొటోగ్రాఫర్‌తోనే తీయించామని, ఆ సమయంలో మిస్కిన్ అక్కడ లేనని పంచుకున్నారు. అయితే చిత్రాన్ని పిల్లలు కూడా చూడాలన్న ఉద్దేశంతో నగ్న ఫొటోలను చిత్రంలో పొందుపరచలేదని తెలిపారు. -
నన్ను ఆ విషయం అడగొద్దు: హీరోయిన్ ఆండ్రియా
ప్రస్తుతం సినీ రంగంలో లైంగిక వేధింపుల అంశం హాట్ టాపిక్ అయిపోయింది. మలయాళ చిత్రసీమలో జరుగుతున్న ఘోరాలపై హేమా కమిటీ రిలీజ్ చేసిన రిపోర్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఇది జరిగిన దగ్గర నుంచి నటీమణులు కనిపిస్తే చాలు.. లైంగిక వేధింపులు, కేరళ ప్రభుత్వం విడుదల చేసిన హేమ కమిషన్ నివేదిక గురించే అడుగుతున్నారు. వీటికి కొందరు సమాధానాలు చెబుతుండగా.. మరికొందరు ఎందుకొచ్చిన గొడవలే అని ఊరుకుంటున్నారు.(ఇదీ చదవండి: మరో స్టార్ హీరోపై లైంగిక ఆరోపణలు.. ఏమని స్పందించాడంటే?)ఇప్పుడు నటి, సింగర్ ఆండ్రియాకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. తిరువణ్నమలైలో ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆండ్రియా.. ఇది పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం విడుదల చేసిన హేమ కమిషన్ నివేదిక గురించి మీ అభిప్రాయం ఏంటని ఓ విలేకరి అడగ్గా.. ఆ విషయం తనను అడగొద్దని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.ఏ విషయంలోనైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఆండ్రియానేనా ఇలా సమాధానం ఇచ్చింది అనే మాట్లాడుకుంటున్నారు. తెలుగులో 'మజాకా' అనే సినిమా చేసిన ఆండ్రియా.. 'యుగానికొక్కడు' లాంటి డబ్బింగ్ మూవీతో తెలుగులో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం హీరోయిన్, కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నంతలో కాస్త బిజీగా ఉంది.(ఇదీ చదవండి: దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్.. రెండు కిడ్నీలు ఫెయిల్) -
మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలో ఆండ్రియా..
హీరోయిన్, సింగర్ ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మణుసీ. ఇంతకుముందు అరం అనే విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన గోపీ నయినార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తన గ్రాస్‌రూట్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈయన ఒక పక్క దర్శకుడిగా విజయవంతమైన చిత్రాలు చేస్తూనే మరోపక్క నిర్మాత గానూ వైవిధ్య భరిత కథా చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఈయన ఉదయం ఎన్‌హెచ్ 4, పొరియాలన్, కొడి, లెన్స్ అన్నక్కు జై వంటి పలు సక్సెస్ చిత్రాలను నిర్మించారు. అలా 2022లో ఈయన బ్యానర్లో ఆండ్రియా నటించిన అమో ల్ మేలే పణితుళి ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం నటుడు సూరి కథానాయకుడిగా గరుడన అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే మణుసీ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇందులో ఆండ్రియా నటన కట్టిపడేస్తోందంటున్నారు ఫ్యాన్స్. -
అలాంటి సినిమాలు చూడను.. కానీ: హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్
దక్షిణాదిలో కథానాయకిగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆండ్రియా. కేవలం నటిగా మాత్రమే కాకుండా ఒక గాయనీ, గీత రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. డబ్బింగ్ కళాకారిణిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆండ్రియా ఇప్పుడు హీరోయిన్గా కూడా రాణిస్తున్నారు. ఒకవైపు సింగర్‌గా రాణిస్తూన్నారు. అదే విధంగా హీరోయిన్‌గానే నటిస్తానని స్టాండ్ తీసుకోలేదు. పాత్రలో సత్తా ఉంటే విలనిజాన్ని పండించడానికై నా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా నటించడానికి రెడీ అంటోంది. అలా వడచైన్నె చిత్రంలో తన భర్తను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రలో మెప్పించారు. మరోపక్క సంగీత కచేరీలతో బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆండ్రియా తాజాగా నటించిన కా చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందించారు. ఈ సందర్బంగా ఆండ్రియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను హారర్, వయలెన్స్ ఉన్న కథా చిత్రాలను చూడనని.. అలాంటి చిత్రాలు తనకు నచ్చవని చెప్పారు. అయితే అలాంటి కథా చిత్రాల్లో నటిస్తానని మాత్రం చెప్పారు. చూడడం వేరు.. నటించడం వేరు అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. కాగా మిష్కిన్ దర్శకత్వంలో కథానాయకిగా నటించిన మరో హారర్, ధ్రిల్లర్ కథా చిత్రం పిశాచి- 2 నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. -
చాన్నాళ్ల తర్వాత మళ్లీ అలా రాబోతున్న ఆండ్రియా
ఎప్పటికప్పడు కాంట్రవర్సీల్లో ఉండే నటి ఆండ్రియా. ప్రస్తుతం ఈమె వయసు 42 ఏళ్లు. అయితే తనకు పెళ్లి ఆలోచన లేదని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేసింది. నటి, గాయని, గీత రచయితగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె హీరోగా చేసిన సినిమా రిలీజై రెండేళ్లకు పైగానే అయిపోతోంది. ఇప్పుడు మరోసారి కథానాయికగా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైందట. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగాస్టార్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) 2022లో 'అణల్ మేల్ పణిత్తుళి' సినిమాతో వచ్చిన ఆండ్రియా.. ఈ సంక్రాంతికి తెలుగులో వచ్చిన వెంకటేశ్ 'సైంధవ్' అతిథి పాత్రలో కనిపించింది. మరోవైపు ఈమె నటిస్తున్న 'పిశాచి 2', 'నో ఎంట్రీ', 'కా' చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో 'పిశాచి 2' చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆండ్రియా నటించిన 'కా' విడుదల ఫిక్స్ చేసుకుందట. మార్చి 29న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఆండ్రియా ఇందులో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా నటించింది. వృత్తిలో భాగంగా దట్టమైన అడవిలోకి వెళ్లిన ఆమె.. ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంది? ఇందులో నుంచి ఎలా బయటపడింది? అనేది స్టోరీ. నాంజిల్ దర్శకత్వం వహించగా.. సుందర్.సి, బాబు సంగీతమందించారు. ఏదేమైనా మళ్లీ దాదాపు రెండేళ్ల తర్వాత ఆండ్రియా తమిళ తెరపై కనిపించనుందనమాట. (ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్) -
నాన్న ముందే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను: హీరోయిన్
సంచలన నటీమణుల్లో ఆండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. రీసెంట్గా సైంధవ్ చిత్రంలో కనిపించిన ఈ బ్యూటీ తన నటనతో మెప్పించింది. ఆమె జీవితంలో రాసలీలలు, ప్రేమలో పడడం, మోసపోవడం వంటి సంఘటనలు మీడియాలో కథలు కథలుగా వెలువడిన విషయం తెలిసిందే. తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ ఎప్పుడూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఆమె నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా.. సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. 2005లో తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ 'యుగానికి ఒక్కడు' సినిమాతో బాగా పాపులర్ అయింది ఆండ్రియా. ఆ తర్వాత తడాఖా, విజయ్‌తో మాస్టర్, కలహాసన్తో విశ్వరూపం, వెట్రిమారన్ దర్శకత్వం వహించిన వడచెన్నై వంటి చిత్రాల్లో ఆమె మెప్పించింది. నటిగానే కాకుండా గాయనిగా కూడా మెరిసిన ఆండ్రియా... వివాదాలకు కొదవలేదు. ఆమె అనిరుధ్‌తో ప్రేమ వ్యవహారం, సీనియర్ నటుడితో సన్నిహిత సంబంధం వంటి అనేక వివాదాల్లో చిక్కుకుంది. తాజగా ఒక ఇంటర్వ్యూలో చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు ఆమె చెప్పుకొచ్చింది. 'అప్పట్లో నా వయస్సు 11 సంవత్సరాలు. నేను మా తల్లిదండ్రులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నాను. ఆ సమయంలో నేను జీన్స్, టీ-షర్ట్ మాత్రమే ధరించాను. మా నాన్న కూర్చున్న సీటుకు కొంచెం దగ్గర్లోనే నేనూ కూర్చున్నాను. అప్పుడు ఎవరో లోపల చేయి వేసినట్లు అనిపించింది. నా షర్ట్‌లో ఎవరో చేయి పెట్టారన్న ఊహనే తట్టుకోలేకపోయాను. ఇక వెంటనే భయపడిపోయాను. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా భయంతో వచ్చి మా నాన్న పక్కన కూర్చున్నాను.ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడానికి కారణం ఏమిటో అర్ధంకాక అప్పుడే ఏడుపు మొదలెట్టాను.' అని ఆండ్రియా చెప్పుకొచ్చంది. తన జీవితంలో జరిగిన ఈ చేదు అనుభవాన్ని ఆండ్రియా పంచుకున్న తర్వాత, అభిమానులు ఆమెను ఓదార్చారు. ఆండ్రియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. -
Andrea Jeremiah: హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
-
పెళ్లి చేసుకోను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే చాలామందికి ప్రభాస్ గుర్తొస్తాడు. ఎందుకంటే 40 ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉన్నాడు. మరోవైపు హీరోయిన్లలోనూ త్రిష, ఆండ్రియా లాంటి వాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. ఆండ్రియా విషయానికొస్తే బోల్డ్ అండ్ బ్యూటీఫుల్. నటిగా ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. మొన్నీమధ్య వెంకటేశ్ 'సైంధవ్'లోనూ నటించింది. తాజాగా ఈమెని పెళ్లి గురించి అడగ్గా.. చేసుకోనని చెప్పింది. కారణం కూడా వెల్లడించింది. త్రిష వయసు 40 ఏళ్లు. లేటు అయినా సరే పెళ్లి చేసుకుంటానని ఈమె చెబుతోంది. నటి ఆండ్రియా మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. పెళ్లితో పనేంటి అని నిక్కచ్చిగా అంటోంది. 20-25 ఏళ్లప్పుడు తనకు పెళ్లి ఆలోచన వచ్చిందని కానీ ఎందుకో కుదర్లేదని.. ఇప్పుడు తన వయుసు 40 అని, దీంతో ఇక పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని కుండబద్దలు కొట్టేసింది. (ఇదీ చదవండి: హీరోయిన్ తాప్సీ.. సీక్రెట్‌గా ప్రియుడితో పెళ్లికి సిద్ధమైందా?) పెళ్లి చేసుకోకపోయినా సరే చాలా సంతోషంగా ఉంటానని నటి ఆండ్రియా చెప్పుకొచ్చింది. అయినా పెళ్లి చేసుకున్న వాళ్లు ఎంతమంది సంతోషంగా ఉన్నారని ఎదురు ప్రశ్న వేసింది. తాను ఈ జీవితానికి అలవాటు పడిపోయానని.. కాబట్టి ఇప్పట్లో, భవిష్యత్తులో పెళ్లి ఆలోచన లేదని ఆండ్రియా క్లారిటీ ఇచ్చేసింది. ఈమె నటించిన 'పిశాచి 2' మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. ఆండ్రియా గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ని ముద్దు పెట్టుకున్న ఫొటో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత బహుశా వీరిద్దరూ విడిపోయి ఉంటారు. అలానే బ్రేకప్ లాంటివి ఏమైనా ఈ నటి జీవితంలో ఉన్నాయేమో? బహుశా అందుకే పెళ్లంటే విరక్తి వచ్చేసి ఇలా మాట్లాడుతుందా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) -
పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్
గాయనిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కథానాయకిగా రాణిస్తున్న బ్యూటీ ఆండ్రియా జెర్మియా. శరత్‌కుమార్ హీరోగా నటించిన పచ్చైక్కిళి మత్తుచ్ఛరం చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా పరిచయం అయింది ఆండ్రియా. ఆ చిత్రం విజయవంతం కావడంతో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా కార్తీతో ఆయిరత్తిల్ ఒరువన్, కమల్ హాసన్ సరసన విశ్వరూపం వంటి పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయింది. తరమణి, వడచైన్నె వంటి చిత్రాల్లో ఛాలెంజింగ్ పాత్రలు చేసి గట్స్ ఉన్న నటినని నిరూపించుకుంది. పిశాచి 2 తుప్పరివాలన్ చిత్రంలో విలనిజాన్ని ప్రదర్శించి ఆల్‌రౌండర్ అనిపించుకుంది. నటిగా, గాయనిగా రాణిస్తున్న ఆండ్రియా చేతిలో ప్రస్తుతం పిశాచి 2, నో ఎంట్రీ, కా, మాళిగై వంటి చిత్రాలు ఉన్నాయి. పిశాచి 2 చిత్రంలో ఈమె ఒంటిమీద నూలు పోగు లేకుండా నటించిందట! అయితే ఆ సన్నివేశాన్ని తరువాత తొలగించినట్లు సమాచారం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలం అయినా, ఈ చిత్రం ఇంకా తెరపైకి రాలేదు. కాగా ఈ బ్యూటీ ఇప్పటికీ సింగిలే అన్నది తెలిసిందే. అప్పుడనుకున్నా కానీ.. ఇదే విషయం ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. విలేకరి పెళ్లి గురించి ప్రశ్నించగా ఆండ్రియా ఇలా బదులిచ్చింది.. ఒక వయసు వచ్చే సరికి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ప్రతి అమ్మాయికీ వస్తుందని తెలిపింది. అలాంటి ఆలోచన తనకూ 30 ఏళ్ల వయసులో వచ్చిందని చెప్పింది. అయితే ఇప్పుడు ఆ వయసు దాటిపోయిందని పేర్కొంది. అయినా ఇలా ఉండటం వల్ల తనకెలాంటి బాధ లేదంది. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదని స్పష్టం చేసింది. చదవండి: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ -
జనం మధ్య చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయిన హీరోయిన్
అభిమానులు లేనిదే ఏ స్టార్ లేరులే అంటారు. అయితే ఒక్కోసారి స్టార్లను ఆ అభిమానులే ఇబ్బందులకు గురి చేస్తారు. దీనిని మితిమీరిన అభిమానం తెచ్చిపెట్టే తంటా అని కూడా పేర్కొనవచ్చు. ఆండ్రియా ఇటీవల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఆంగ్లో ఇండియన్ బ్యూటీ బహుభాషా నటి మాత్రమే కాకుండా బహుముఖ ప్రతిభ కలిగిన కళాకారిణి, ఆండ్రియాలో మంచి నటి, గాయని, రచయిత వున్నారు. ఇక ఎలాంటి పాత్రలో నైనా నటించడానికి రెడీ అనే డేరింగ్ బ్యూటీ ఆమె. ప్రస్తుతం ఈమె నటించిన తమిళ చిత్రం పిశాచి–2 విడుదలకు సిద్ధమవుతోంది. నటిగా రాణిస్తున్న ఆండ్రియా ఇటీవల పొంగల్ సందర్భంగా పుదుచ్చేరిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం ప్రతి ఏడాది కారైక్కాల్‌లో కార్నివాల్ వేడుకలను నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ ఏడాది పొంగల్ సందర్భంగా గత 14న ప్రారంభమైన ఈ వేడుకలు నాలుగు రోజుల పాటు జరిగాయి. కార్యక్రమం ముగింపు రోజున నిర్వాహకులు ఆండ్రియాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఆమె వేదికపై ఊ అంటావా మామ ఊహూ అంటావా వంటి పాటలను పాడి ఆహూతులను, ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం అభిమానులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు అంటూ అండ్రియాను చుట్టుముట్టారు. దీంతో ఆమె జనం మధ్య చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సురక్షితంగా అక్కడి నుంచి పంపించేశారు. అయినప్పటికీ అభిమానులు ఆమె వెంట పరుగులు తీశారు. దీంతో ఆండ్రియా కారు వేగంగా దూసుకుపోయింది. ఇలా సెలబ్రిటీలు తమపై వీరాభిమానాన్ని పెంచుకున్న ప్రజలను చూసి గర్వపడాలో లేక ఇలాంటి సందర్భాల్లో ఇక్కడికి వచ్చి వారిని చూసి బాదపడాలో అర్థం కాని పరిస్థితి. -
రొమాన్స్ సీన్లో నేనేం సిగ్గుపడలేదు కానీ..: ఆండ్రియా
కోలీవుడ్ నటి ఆండ్రియా ఈ బోల్డ్ అండ్ బ్యూటీ మొదట్లో గాయనిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత కథానాయకిగా తెరపైకి వచ్చారు. ఆమె పాడిన పాటలు చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. ఆమె గాయని మాత్రమే కాదు.. డబ్బింగ్లో కూడా మెప్పించారు. పలు చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన ఆండ్రియా.. కందా నాల్ ముదల్ చిత్రం ద్వారా 2005 తెరపై కనిపించింది. హీరోయిన్గా కొనసాగుతూనే పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది. కార్తీ యుగానికి ఒక్కడు చిత్రంలో ఆండ్రియా ఒక పాట పాడటమే కాదు అందులో చాలా హాట్‌గా కనిపించి యూత్‌ను ఆకట్టుకుంది. విశ్వరూపం, తడాఖా, ఉత్తమ విలన్, వడ చెన్నై, మాస్టర్ వంటి చిత్రాల్లో మెప్పించింది. నటిగా తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తూ.. ప్రస్తుతం పాన్ ఇండియా కథానాయకగా రాణిస్తుంది. ధనుష్ కథానాయకుడిగా నటించిన వడ చైన్నె చిత్రంలో దర్శకుడు అమీర్‌కు భార్యగా ఆండ్రియా ఛాలెంజ్ ఉన్న పాత్రలో నటించింది. తన భర్తను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూసే ఆమె అందుకోసం తనను తాను మార్చుకునే పాత్రలో అందరినీ మెప్పించింది. దీని గురించి ఆండ్రియా ఇటీవల ఒక భేటిలో పేర్కొంటూ వడచైన్నె చిత్రంలో ఒక రొమాన్స్ సన్నివేశంలో నటించడానికి తానేం సిగ్గు పడలేదని తెలిపింది. షూటింగ్లో భాగంగా కెమెరాల ముందు చేస్తున్న రొమాన్స్‌కు కూడా దర్శకుడు అమీర్ చాలా సిగ్గు పడ్డారని ఆమె పేర్కొంది. ఆండ్రియా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా మిష్కిన్ దర్శకత్వంలో ఆండ్రియా ప్రధాన పాత్ర పోషించిన పిశాచి– 2 చిత్రం విడుదల కావాల్సి ఉంది. -
హిందీ బ్యూటీ బ్యాక్ పోజులు.. చాన్నాళ్లకు అలా కనిపించిన ఆండ్రియా!
క్యూట్ పోజుల్లో హీరోయిన్ హెబ్బా పటేల్ చాన్నాళ్లకు కనిపించిన ముద్దుగుమ్మ ఆండ్రియా మత్తెక్కించే స్టిల్స్ ఇచ్చిన అదితీ రావ్ హైదరీ కొత్త షో కోసం కత్తిలా తయారైన యాంకర్ శ్రీముఖి బ్లాక్ డ్రస్‌లో కిక్కిస్తున్న నటి తేజస్వి మదివాడ బ్యాక్ చూపించి మరీ పిచ్చెక్కిస్తున్న వాణీ కపూర్ హీరోయిన్ ప్రణీత రొమాంటిక్ పోజులు.. చూస్తే మాత్రం నవంబరు జ్ఞాపకాల్ని వీడియోగా షేర్ చేసిన శ్రుతిహాసన్ అబ్బా అనిపించేలా వయ్యారంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ బ్లాక్ డ్రస్‌లో మాయ చేసేస్తున్న క్యూట్ బ్యూటీ శ్రీలీల View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
వెంకటేశ్ 'సైంధవ్' కొత్త షెడ్యూల్.. అక్కడ షూటింగ్
వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలోని బీదర్‌లో ప్రారంభమైంది. వెంకటేశ్ పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారట శైలేష్ కొలను. తాజాగా మొదలైన బీదర్ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ సాగుతుందట. సెప్టెంబరులో ప్లాన్ చేసిన ఓ విదేశీ షెడ్యూల్‌తో ‘సైంధవ్’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని, వినాయక చవితి పండగ సందర్భంగా టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సినిమాకు సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, సంగీతం: సంతోష్ నారాయణ్. -
అందులో అర్ధ నగ్నంగానే నటించాను తప్పేంటి: టాప్ హీరోయిన్
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటి ఆండ్రియా. తమిళనాడుకు చెందిన ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో పుట్టిన ఈమెకు చిన్నతనం నుంచి సంగీతంపై మక్కువ. ఆండ్రియా పియానో వాయిద్య కళాకారిణి. ఇక ఈమె న్యాయవాది అన్న విషయం చాలా మందికి తెలియదు. అదేవిధంగా నటిగా కంటే కూడా గాయనిగా ముందు సినీ రంగ ప్రవేశం చేశారు. గాయనిగా గుర్తింపు పొందిన తర్వాత కోలీవుడ్‌లో పచ్చైక్కిళి ముత్తుచ్చారం చిత్రంతో కథానాయకిగా రంగ ప్రవేశం చేశారు. (ఇదీ దచవండి: ముంబయికి షిఫ్ట్ అయిన ఫ్యామిలీ.. సూర్య ఏమన్నారంటే!) ఆ తర్వాత మంగాత్తా, విశ్వరూపం,తడాఖా,మాస్టర్, వడచైన్నె అంటూ పలు చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించారు. మలయాళం, తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. 36 ఏళ్ల ఈ అవివాహిత భామ ఇప్పటికీ నటిగా గాయనిగా బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల పుష్ప చిత్రం తమిళ్ వెర్షన్లో 'ఊ అంటావా మామ' పాటను పాడి ఆ పాటకు ఇక్కడ కూడా క్రేజ్ తెచ్చిపెట్టింది ఈమెనే. అయితే వ్యక్తిగతంగా ఈమె పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ఇటీవల దర్శకుడు వెట్రిమారన్ నిర్మించిన అనల్ మేల్ పణితులి చిత్రంలో ఆండ్రియా అర్ధ నగ్నంగా నటించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిపై ఇటీవల ఒక భేటీలో స్పందించిన ఆండ్రియా నిజమే ఆ చిత్రంలో ఒక సన్నివేశంలో నటిస్తున్నప్పుడు తనకే చాలా బిడియంగా అనిపించిందని అన్నారు. అయితే నిజ జీవితంలో తనకు ఇంతకు మించిన సంఘటనలను జరిగాయని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈమె పిశాచి 2, మాలిగై, నో ఎంట్రీ, బాబి ఆంటోనీ చిత్రం అంటూ అరడజను చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా తెలుగులో 'సైంధవ్' చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. -
జీవితంలో ఏదీ అంతా ఈజీ కాదు: హీరోయిన్
సంచలన నటీమణుల్లో ఆండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమె రాసలీలలు, ప్రేమలో పడడం, మోసపోవడం వంటి సంఘటనలు ఇప్పటికే మీడియాలో కథలు కథలుగా వెలువడిన విషయం తెలిసిందే. ఇక వివాదాస్పద కథా పాత్రల్లో నటించడం ఆండ్రియా తరువాతే ఎవరైనా అని చెప్పాలి. తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడంలోనే ఈ భామ ముందే ఉంటారు. వీటితో పాటు మంచి నటి, గాయని అనే పేరు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: ఫాదర్స్ డే స్పెషల్: మంచి తండ్రులందరికీ శుభాకాంక్షలు) అంతేకాకుండా ఆండ్రియాలో గీత రచయిత కూడా వున్నారు. ఇకపోతే షూటింగ్‌లు, పాటల రికార్డింగ్‌లు అంటూ బిజీగా వున్న ఆండ్రియా మధ్యలో సంగీత కచేరీలు చేస్తున్నారు. ఆ మధ్య కౌలాలంపూరులో తన సంగీత విభావరి కార్యక్రమాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఆ ఉత్సాహంతో తాజాగా జులై 1న కోయంబత్తూరులో సంగీత కచేరి నిర్వహించబోతున్నారు. దీని గురించి ఆమె కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడుతూ జీవితంలో ఏది ఈజీ కాదని, ప్రతి విషయంలోనూ ఒక కష్టం ఉంటుందని పేర్కొన్నారు. తాను గతంలో 15 ఏళ్ల పాటు మ్యూజిక్ క్లాసులకు వెళ్లినట్లు చెప్పారు. అదే తనను ఇప్పుడు పాడేలా చేస్తుందని చెప్పారు. తను కోయంబత్తూరుకు చాలాసార్లు వచ్చానని.. కళాశాలలో చాలా షోలు చేశానని అయితే ఇక్కడ పబ్లిక్ మధ్య కచేరీ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. అయితే దీనిని పెద్ద విషయంగా తాను భావించడం లేదని అన్నారు. కాగా రాజకీయ రంగప్రవేశం చేసే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు ప్రస్తుతం కచేరీ గురించి మాట్లాడదాం అంటూ ఎస్కేప్ అయ్యారు. (ఇది చదవండి: తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్) -
పదేళ్ల తర్వాత టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్న ఆండ్రియా
విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. హిట్ సిరీస్‌తో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాప షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ను వదిలారు. కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా ఈ సినిమాతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్ అనే పాత్రలో కనిపించనుంది. చేతిలో రివాల్వర్‌తో స్టైలిష్ లుక్‌లో ఆండ్రియా దర్శనమిచ్చింది. కాగా గతంలో ఆమె నాగచైతన్య హీరోగా వచ్చిన తబాఖా మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. మళ్లీ పదేళ్లకు ఆండ్రియా టాలీవుడ్లో మెరవనుంది. Introducing JASMINE from SAINDHAV 🔥#SaindhavOnDec22 Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/I6L1W5cJjI — Andrea Jeremiah (@andrea_jeremiah) April 28, 2023 -
కమల్, నయన్ క్రేజీ కాంబో మూవీలో బోల్డ్ అండ్ బ్యూటీ..!
చెన్నై: నటుడు కమల్ హాసన్ సరసన నటించాలని కోరుకోని హీరోయిన్లు ఉండరనే చెప్పవచ్చు. కమల్ హాసన్‌కు జతగా నటిస్తే పాపులర్ అవ్వవచ్చునని చాలా మంది భావిస్తుంటారు కూడా. ఆయన చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని అలాంటి సన్నివేశాల వల్ల మరింత పబ్లిసిటీ పొందవచ్చు అని కొందరు భావిస్తుంటారు. కాగా కమలహాసన్‌తో లిప్ లాక్ సన్నివేశాలు నటించడం ఇష్టం లేక నయనతార ఇప్పటివరకు ఆయనకు జంటగా లభించలేదని ప్రచారం కూడా జరిగింది. తాజాగా కమల్ 234వ చిత్రంలో నటించడానికి నయన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు. సుమారు 35 ఏళ్ల తర్వాత కమలహాసన్, దర్శకుడు మణిరత్నం కాంబోలో తెరకెక్కనున్న చిత్రం ఇది. తాజాగా రూపొందించిన పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం ఈనెల 28వ తేదీన విడుదలకు ముస్తాబవుతుంది. తదుపరి ఆయన కమలహాసన్‌తో చేసే చిత్రంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. కాగా ఇందులో నయనతారతో పాటు మరో నటి కూడా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఆమెనే నటి ఆండ్రియా. బోల్డ్ అండ్ బ్యూటీ ఎలాంటి పాత్రనైనా ఛాలెంజ్‌గా తీసుకొని నటిస్తుంది. ఈ బహుభాషా నటి ఇంతకుముందు కమలహాసన్ సరసన విశ్వరూపం, విశ్వరూపం– 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన 234వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా.. విజయ్ సినిమాలో ఐటెం సాంగ్‌పై సిమ్రాన్ -
రెండుసార్లు బ్రేకప్.. అది బ్లాక్ డే అంటున్న బ్యూటీ
కోలీవుడ్ సంచలన హీరోయిన్లలో ఆండ్రియా ఒకరు అని చెప్పవచ్చు. ఏ విషయాన్నైనా చాలా బోల్డ్‌గా మాట్లాడే ఆండ్రియా నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా. నటుడు శరత్‌కుమార్ హీరోగా నటించిన పచ్చైక్కిళి ముత్తుచ్చారం చిత్రం ద్వారా నాయకిగా పరిచయం అవగా ఆ తరువాత కమల్‌హాసన్, కార్తీ, ఉదయనిధి స్టాలిన్ వంటి పలువురు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆండ్రియా తెలుగు, మలయాళం ప్రేక్షకులకు సుపరిచితమే. ఇకపోతే ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో సరసాలు సాగించిన ఈ బ్యూటీ ఆ తరువాత ఆయనకు దూరం అయ్యారు.. కారణం తన కంటే అతని వయసు తక్కువ కావడమేనని ఒక భేటీలో బహిరంగంగానే చెప్పారు. ఇకపోతే ఇటీవల వివాహితుడైన ఒక వ్యక్తితో రెండేళ్లు రిలేషన్షిప్లో ఉండి జీవితాన్ని నాశనం చేసుకున్నానని చెప్పి వార్తల్లోకెక్కారు. ఆ తరువాత శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవడంతో ఆయుర్వేద చికిత్సతో అందులోంచి బయట పడినట్లు చెప్పారు. కాగా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఆండ్రియా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇది తనకు బ్లాక్ డే అని ట్వీట్ చేశారు. నల్లదుస్తులు ధరించిన తన ఫొటోను పెట్టి తాను ప్రస్తుతం సింగిలే అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈమె చేతిలో పిశాచి 2 చిత్రం మాత్రమే ఉంది. మిష్కిన్ దర్శకత్వం వహించిన ఇందులో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించారు. ఇది త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) చదవండి: వినరో భాగ్యము విష్ణుకథ హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా? -
పెళ్లి ఆలోచన లేదు.. సంతోషంగా జీవించాలనుకుంటున్నా..
చెన్నై: కోలీవుడ్‌లో సంచలన నటిమణుల్లో ఆండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆమెపై ఇప్పటికే చాలా వదంతులు వచ్చాయి. గ్లామరస్‌గా నటించడానికి ఏ మాత్రం సంకోచించని బోల్ట్ అండ్ బ్యూటీ అండ్రియా. ఒకరిని నమ్మి సహజీవనం చేసి, చాలా మోసపోయానని ఆ మధ్య తనే స్వయంగా ఓ భేటీలో పేర్కొంది. శారీరకంగా మానసికంగానూ వేదనకు గురయ్యారని కూడా చెప్పుకొచ్చింది. అలా కొంతకాలం నటనకు దూరమైన ఈ ఆంగ్లో ఇండియన్ భామ ఆ తర్వాత మళ్లీ నటనపై దృష్టి సారిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈమె రెండు లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి మి ష్కిన్ దర్శత్వంలో నటించిన పిశాచి 2, రెండోది అనల్ మేలే పని తులి. దర్శకుడు వెట్రిమారన్ నిర్మించిన ఈ చిత్రానికి కైసర్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇది శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పిశాచి 2 చిత్రం కూడా త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఆండ్రియా ఒక భేటీలో ప్రేమ పెళ్లి అంశాలపై పేర్కొంటూ తను 20 ఏళ్ల వయసులోనే ఒక అతన్ని ఇష్టపడ్డానని తెలిపింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాననీ, అయితే ఆ ప్రేమ వర్కౌట్ కాలేదని చెప్పింది. ఆ తర్వాత ఎవరిని ప్రేమించలేదని చెప్పింది. నిజం చెప్పాలంటే పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది యువతులు సంతోషంగా లేరని చెప్పుకొచ్చింది. అలాగే పెళ్లికి దూరంగా చాలా మంది చాలా సంతోషంగా జీవిస్తున్నట్లు నటి ఆండ్రియా పేర్కొంది. తనకు ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, జీవితంలో ఆనందంగా గడపాలని తాను భావిస్తున్నట్లు చెప్పింది. చదవండి: ‘డేంజరస్’ .. ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు? -
బస్సులో ఒకడు అసభ్యంగా ప్రవర్తించాడు: నటి
గాయనిగా, హీరోయిన్గా బాగా పాపులారిటీ సంపాదించుకుంది ఆండ్రియా జెర్మియా. ప్రస్తుతం ఆమె 'అనల్ మెలె పనితుళి' అనే తమిళ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆండ్రియా మాట్లాడుతూ.. 'ఇది నా చిన్నప్పుడు జరిగింది. అప్పుడు నా వయసు దాదాపు 11 ఏళ్లు ఉంటుంది. నాన్నతో కలిసి బస్సులో వెళ్తున్నా. ఆయన నా పక్కనే కూర్చున్నారు. సడన్‌గా ఒక చేతు నా వీపుపై ఆనింది. నాన్నేమో అనుకున్నా. కానీ అంతలోనే ఆ చేయి నా టీషర్ట్ లోపలికి వెళ్లడంతో నాన్న వైపు చూశాను. ఆయన రెండు చేతులు ముందే ఉన్నాయి. ఇంతలో ఆ చేయి ఇంకా లోనికి వెళ్లడంతో వెంటనే నేను కాస్త ముందుకు జరిగి కూర్చున్నా. కానీ ఈ విషయాన్ని నాన్నకో, అమ్మకో చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేదంటే నాదగ్గర కారణం లేదు. బహుశా పుట్టి పెరిగిన సమాజంలోని కట్టుబాట్లు దృష్టిలో పెట్టుకుని చెప్పలేకపోయానేమో! కానీ అప్పుడే ఇది బయటకు చెప్పుంటే నాన్న ఏదో ఒక పని చేసి అతడికి బుద్ధొచ్చేలా చేసేవాడు. ఒకసారైతే కాలేజ్ బస్‌లో ఒకతను నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అంటూ గట్టిగా అరిచాడు. ఇలాంటివి నా జీవితంలో చాలా జరిగాయి. అన్నీ చూస్తూ వదిలేయడమే తప్ప మనమేం చేయలేం' అని చెప్పుకొచ్చింది ఆండ్రియా. చదవండి: త్వరలో వివాహ బంధంలోకి మిల్కీ బ్యూటీ ప్రైజ్‌మనీలో భారీగా కోత, కెప్టెన్సీ కంటెండర్స్ వాళ్లే! -
18 ఏళ్లు వచ్చిన తర్వాతే నాన్న పియానో కొనిచ్చారు: హీరోయిన్
ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్‌లో అయినా నటించే సత్తాగల నటి ఆండ్రియా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పిశాచి–2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదేవిధంగా ఈమె సొంతంగా ఆంగ్లంలో ఫ్లవర్స్ అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను రూపొందించారు. దీన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. తన తాత రైల్వే శాఖలో ఉద్యోగం చేసేవారని చెప్పిన ఆండ్రియా తమ కుటుంబంలో తొలి పట్టభద్రుడు తన తండ్రి అని, ఆయన న్యాయవాది అని తెలిపారు. అద్దె ఇల్లు, మోటార్ బైక్ ఇలా మధ్య తరగతి కుటుంబంతో తమ జీవితం ప్రారంభమైందని చెప్పారు. ఆ తర్వాత సొంత అపార్ట్మెంట్, కారు అంటూ నెమ్మదిగా ఎదిగామని చెప్పారు. మొదట్లో నాన్న తనుకు అడిగినవన్నీ కొనిచ్చారని చెప్పింది. అయితే పియానో కొనడం ఆడంబరంగా అనిపించిందన్నారు. తనకు సంగీతం అంటే చాలా ఇష్టం అని దాంతో పియానో నేర్చుకున్నాని చెప్పారు. తనకు 18 ఏళ్లు వచ్చిన తర్వాతే నాన్న పియానో కొనిచ్చారని చెప్పారు. అయితే అప్పటికే నటనపై దృష్టి సారించటంతో పియానో ఆశ కొంత వరకు తగ్గిందన్నారు. అయితే ఇప్పటికీ తన పియానో భద్రంగా తన షోకేష్‌లో ఉందని పేర్కొన్నారు. కాగా తాను రూపొందించిన సంగీత ఆల్బమ్‌ను విడుదల చేయడానికి కారణం సంగీతానికి సంబంధించినది మాత్రమే కాకుండా పేద పిల్లల చదువు కోసం అని తెలిపారు. తాము సోఫియా ట్రస్ట్ పేరుతో స్వచ్ఛంద సేవ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. తద్వారా అనాథ పిల్లల విద్యకు సాయం చేస్తున్నామని చెప్పారు. పేదరికం, ఆకలి లేని భారతదేశం అవతరించాలంటే విద్య ఒక్కటే మార్గమని తాను గట్టిగా విశ్వసిస్తానని ఆండ్రియా చెప్పుకొచ్చింది. -
ఆండ్రియా.. భారీ పారితోషికం కూడా
సంచలన దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పిశాచి–2. 2014లో ఈయన దర్శకత్వంలో రూపొంది మంచి విజయాన్ని సాధించిన పిశాచి చిత్రానికి ఇది సీక్వెల్. రాక్‌ఫోర్ట్ పతాకంపై మురుగానందం నిర్మించిన ఈ చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించింది. నటుడు విజయ్ సేతుపతి గౌరవ పాత్రలో నటించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హారర్, థ్రిల్లర్ కథా చిత్రం ఈ నెల 31వ తేదీ విధులకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా నటి ఆండ్రియా ఈ చిత్రంలో పూర్తి నగ్నంగా నటించిందని, అందుకు ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందనే ప్రచారం వైరల్ అవుతుంది. దీనిపై దర్శకుడు మిష్కిన్ స్పందిస్తూ చిత్రం కోసం నటి ఆండ్రియాను నగ్నంగా చిత్రీకరించిన విషయం నిజమేనన్నారు. అందుకు ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేయడం కూడా సహజమేనని పేర్కొన్నారు. అయితే ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాలను చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు, అవి కూడా ఆమె సన్నిహితురాలు అయిన ఫొటోగ్రాఫర్‌తోనే తీయించామని తెలిపారు. అక్కడ తాను కూడా లేనని చెప్పారు. అయితే చిత్రాన్ని పిల్లలు కూడా చూడాలన్న ఉద్దేశంతో నగ్న ఫొటోలను చిత్రంలో పొందుపరచలేదని తెలిపారు. చిత్రంలో ఆ ఫొటోలు జత చేస్తే సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇస్తుందని భావించి చేర్చలేదని వివరించారు. -
హాట్‌స్టార్‌లో ఆండ్రియా 'వట్టం', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నటుడు సిబిరాజ్, ఆండ్రియా, అతుల్య రవి హీరో హీరోయిన్లుగా నటింన చిత్రం వట్టం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతలు ఎస్ ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మించిన తాజా చిత్రం ఇది. కమలకన్నన్ దీనికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 29వ తేదీన నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ.. సిబిరాజ్, ఆండ్రియా, అతుల్య రవి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారన్నారు. సిబిరాజ్ మాట్లాడుతూ.. ఓటీటీలో విడుదలవుతున్న తన తొలి చిత్రం ఇదేనని తెలిపారు. చిత్ర నిర్మాత ఎస్సార్ ప్రభు మాట్లాడుతూ.. జీవితంలో ప్రేమికుల మధ్య సమస్యలు తలెత్తినా, ఆ తర్వాత అవి సమసిపోతాయని అలాంటి ఇతివృత్తంతో కూడిన చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో హీరోగా ఎవరైతే బాగుంటుంది అన్న ఆలోచించినప్పుడు సిబిరాజ్ గుర్తొచ్చారని చెప్పారు. ఆండ్రియా, అతుల్య రవి పాత్రల్లో ఒదిగిపోయారని అన్నారు. చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్ పదివారాల తర్వాతే ఓటీటీలో పెద్ద సినిమాలు -
తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పిన పిశాచి
పిశాచి తెలుగు డబ్బింగ్ చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదండీ, పిశాచి 2 సినిమా కోసం నటి ఆండ్రియా తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటిగా, గాయనిగా సత్తా చాటుతున్న బోల్డ్ బ్యూటీ ఆండ్రియా బహుభాషా నటి కూడా! ఆండ్రియాలో మంచి కవయిత్రి కూడా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం పిశాచి 2 చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాక్‌ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై టి.మురుగానందం నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న పిశాచి 2 చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రంలో ఆండ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుననారు. తమిళం, మలయాళం సరే తెలుగులోనూ తానే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందుకోసం ఆమె ట్యూటర్‌ను నియమించుకుని తెలుగు వాచకం నేర్చుకుని డబ్బింగ్ చెబుతున్నారు. అలా పిశాచి చిత్రం కోసం ఆండ్రియా చెప్పిన డైలాగ్ నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడి నుంచి ఎవరూ ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. తాను డబ్బింగ్ చెబుతున్న వీడియోను ఆండ్రియా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అందులో ఫస్ట్ టైం తెలుగులో డబ్బింగ్ చెబుతున్నాను అంటూ ఎగ్జైటింగ్‌తో కూడిన ఆనందంతో పేర్కొన్నారు. ఆండ్రియా కృష్టిని నెటిజన్లు అభినందించకుండా ఉండలేకపోతున్నారు. View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) చదవండి: ‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా! పక్కనోడి లైఫ్ నీకెందుకు?: ట్రోలర్స్‌కు నటుడి స్ట్రాంగ్ కౌంటర్ -
షాకింగ్ : న్యూడ్‌గా నటించిన హీరోయిన్ ఆండ్రియా?
ప్రముఖ దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన చిత్రం ‘పిశాచు-2’. విజయ్ సేతుపతి పూర్ణ సంతోష్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు.రాక్‌ఫోర్ట్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై టి. మురుగనాథమ్ నిర్మించారు `పిశాచి` చిత్రానికిది సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.. అరణ్మనై అరణ్మనై 2 చిత్రాల్లో నటించిన ప్రేక్షకుల్ని తనదైన నటనతో భయపెట్టిన ఆండ్రియా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో 15నిమిషాల నిడివితో ఉండే ఓ సీన్లో ఆండ్రియా న్యూడ్‌గా నటించినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కథ డిమాండ్ మేరకు 15నిమిషాల పాటు వివిస్త్రగా నటించాలని దర్శకుడు కోరగా, తొలుత ఆండ్రియా అందుకు నిరాకరించినట్లు సమాచారం. కానీ కథ కోసం ఆమె న్యూడ్‌గా నటించిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలియనుంది.గతంలోనూ ఆండ్రియా ‘వడ చెన్నై’ చిత్రంలో బోటులో చిత్రీకరించిన సన్నివేశాల్లో వివస్త్రగా నటించింది. అయితే ఆ తర్వాత ఆ సీన్స్‌ను తొలగించారు. -
గోల్డెన్ వీసా అందుకున్న హాట్ బ్యూటీ..
Heroine Andrea Jeremiah Receives UAE Golden Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గోల్డెన్ వీసా పొందింది తమిళ హాట్ బ్యూటీ ఆండ్రియా. తమిళ సినీ ఇండస్ట్రీలో బోల్డ్ పాత్రల్లో అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కార్తీ నటించిన 'యుగానికి ఒక్కడు', లోకనాయకుడు కమల్ హాసన్ యాక్ట్ చేసిన 'విశ్వరూపం' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఈ అమ్మడు. ప్రస్తుతం పిశాచి 2 సినిమాలో నటిస్తోంది ఆండ్రియా. ఈ మూవీకి మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే భారతీయ సినీ తారలకు దుబాయ్ ప్రభుత్వం ఈ వీసాను అందజేస్తోంది. తాజాగా ఈ జాబితాలో చేరింది ఆండ్రియా జెరెమియా. ఈ సంధర్భంగా యూఏఈ ప్రభుత్వానికి ఆండ్రియా ధన్యవాదాలు తెలిపింది. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్ 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలతో సత్కరిస్తోంది దుబాయ్ ప్రభుత్వం. ఈ వీసాను అందుకున్న వారికి పదేళ్ల పాటు దుబాయ్ పౌరసత్వం ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. ఇటీవలే ఈ గోల్డెన్ వీసాను సీనియర్ నటి మీనా అందుకున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ వీసాను పొందగా.. టాలీవుడ్ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్ షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్లో సంజయ్ దత్, సునీల్ శెట్టి, సింగర్స్ సోనూ నిగమ్, నెహా కక్కర్, బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఫరా ఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది. చదవండి: దుబాయ్ గోల్డెన్ వీసా అంటే ఏంటీ ?.. ఎందుకిస్తారు ? -
వణికిపోయిన మెహరీన్, అర్జంట్‌గా బ్యాంకాక్ వెళ్లాలన్న చార్మీ
► సోదరి శివానీ రాజశేఖర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన శివాత్మిక ► వ్యాక్సిన్ వేసేటప్పుడు ముడుచుకుపోయిన మెహరీన్ ► ఈ పాట అందరికీ అంకితమంటోన్న ఆండ్రియా ► లావణ్య త్రిపాఠి బ్లాక్ అండ్ వైట్ ఫొటో ► అర్జంట్‌గా తన కుక్కను బ్యాంకాక్ తీసుకెళ్లాలంటున్న చార్మీ కౌర్ ► మాస్టర్ చెఫ్ షూటింగ్లో తమన్నా భాటియా View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Noel (@mr.noelsean) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Jennifer Garner (@jennifer.garner) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) -
కుక్కతో విజయ్ ఆటలు, బిర్యానీ కావాలన్న ధన్య
♦ తన వయసు పెరగకుండా పరిష్కారం కనిపెడతానంటున్న సుమ కనకాల ♦ కుక్కతో ఆడుకుంటున్న విజయ్ దేవరకొండ ♦ గ్యాంగ్‌తో కరీష్మా కపూర్ ♦ ఫొటోలతో హీటు పెంచుతున్న ఆండ్రియా ♦ ప్యారడైస్లో మరొక రోజు అంటోన్న లావణ్య త్రిపాఠి ♦ బిర్యానీ పార్సిల్ కావాలంటున్న ధన్య బాలకృష్ణ ♦ గోవాను మిస్ అవుతున్నానంటోన్న అప్సర రాణి ♦ స్విమ్ సూట్లో ఉన్న ఫొటోను షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ♦ లైట్ల మధ్య చందమామలా వెలిగిపోతున్న ప్రియాంక చోప్రా ♦ చీరకట్టులో ఏంజెల్లా మెరిసిపోతున్న మోనాల్ గజ్జర్ ♦ వ్యాక్సిన్ వేయించుకున్న మలైకా అరోరా View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Karisma Kapoor (@therealkarismakapoor) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
కెమెరా ముందు నగ్నంగా నటించనున్న హీరోయిన్!
తమిళ చిత్రం పిశాసు(తెలుగులో పిశాచి) సినిమా ఎంత హిట్టో మనందరికీ తెలిసిందే. దీంతో గతేడాదే దీనికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు మిస్కిన్. ఏడాది ప్రారంభంలో షూటింగ్ కూడా మొదలు పెట్టారు. కానీ అంతలోనే కోవిడ్ సెకండ్ వేవ్ రావడంతో అర్ధాంతరంగా చిత్రీకరణ ఆపేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. హీరోయిన్ ఆండ్రియా ఇందులో బోల్డ్ పాత్రలో నటించనుందట. కథ డిమాండ్ చేయడంతో ఓ సన్నివేశంలో నగ్నంగా కనిపించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ఆమె పారితోషికాన్ని కూడా పెంచినట్లు సమాచారం. గతంలో అమలాపాల్ కూడా ఆడై సినిమాకు నగ్నంగా కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆండ్రియా కూడా పిశాచి 2 కోసం ఈ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాక్‌ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్, పూర్ణిమ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: భార్య సురేఖతో కలిసి రక్తదానం చేసిన చిరంజీవి -
యుగానికి ఒక్కడు హీరోయిన్‌కు కరోనా
కరోనా సెకండ్ వేవ్‌లో ఇప్పటికే పలువురు తారలకు పాజిటివ్ వచ్చింది. తాజాగా నటి ఆండ్రియా కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ‘యుగానికి ఒక్కడు, విశ్వరూపం, తడాఖా, గృహం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు పొందారు ఆండ్రియా. నటిగానే కాదు.. గాయనిగా కూడా ఆండ్రియాకి మంచి గుర్తింపు ఉంది. చదవండి: తండ్రి ఓటమిపై శృతిహాసన్ కామెంట్స్ వైరల్ -
పిశాచిగా మారతారా?
తమిళ హీరోయిన్ ఆండ్రియా త్వరలోనే పిశాచిగా మారనున్నారట. దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘పిశాచి’. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ సిద్ధం చేస్తున్నారట ఆయన. ఇందులో లీడ్ రోల్లో ఆండ్రియా నటించనున్నారని సమాచారం. ఆమెది పిశాచి పాత్ర అని కోలీవుడ్ టాక్. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. విజయ్ నటించిన ‘మాస్టర్’లో ఓ కీలక పాత్ర చేశారు ఆండ్రియా. సూర్య హీరోగా ఆరంభం కానున్న ఓ చిత్రంలో హీరోయిన్గా నటిస్తారామె. -
ఆ సీన్లు చేసుండాల్సింది కాదు!
‘‘ఏదైనా ఒక క్యారెక్టర్ బాగా చేస్తే ఆ తర్వాత అందరూ అలాంటి పాత్రలకే అడుగుతారు. చేసిన పాత్రలే చేస్తే నాకు బోర్ కొడుతుంది. చూసే ప్రేక్షకులు కూడా ఒకే రకమైన పాత్రల్లో కనిపిస్తోంది అంటారు’’ అంటున్నారు ఆండ్రియా జర్మియా. గాయనిగా, నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఆండ్రియా ‘వడ చెన్నై’ అనే తమిళ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్‌లో నటించారు. 2018లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఆ సినిమాలో ఆమె చేసిన చంద్ర తరహా పాత్రలకే అడుగుతున్నారట. ఆ విషయం గురించి ఆండ్రియా మాట్లాడుతూ – ‘‘వడ చెన్నై’ సినిమాలో నా కో–స్టార్ అమీర్‌తో కలిసి బెడ్రూమ్ సీన్స్ చేశాను. ఆ రొమాంటిక్ సీన్స్ చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. ఎందుకంటే చాలామంది దర్శకులు అలాంటి పాత్రలతో నా దగ్గరకు వస్తున్నారు. నాకిష్టం లేదు. ఒకవేళ రొమాంటిక్ సీన్స్ లేకుండా మంచి పాత్రకి అవకాశం వస్తే పారితోషికం తగ్గించుకోవడానికి కూడా నేను రెడీ’’ అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ హీరోగా రూపొందిన ‘మాస్టర్’లో నటించారు ఆండ్రియా. ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ‘కా’, ‘వట్టమ్’, ‘మాళిగై’, ‘అర్ణ్మనై’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారామె. -
దుస్తులపై విమర్శలు.. హీరోయిన్ ఆగ్రహం
నటి ఆండ్రియాకు కోపం వచ్చింది. సంచలన నటిమణుల్లో తన రూటే సెపరేట్ అనిపించుకున్న నటి ఈ బ్యూటీ. నా జీవితం నా ఇష్టం. ఎవరేమనుకుంటే నాకేంటి అనేలా ప్రవర్తించే ఆండ్రియా ఇటీవల వార్తల్లో కనిపించలేదు. అసలు సినిమాల్లోనే కనిపించలేదు. వడచెన్నై చిత్రం తరువాత ఈ భామను తెరపై చూడలేదు. అంతేకాదు తన టైమ్ బాగోలేదో, లేక తొందరపాటు నిర్ణయంతోనో గానీ జీవితంలో కొంత గడ్డుపరిస్థితిని చవిచూసింది. ఈ విషయాన్ని తనే ఇటీవల బహిరంగంగా చెప్పుకుని బాధపడింది కూడా. తాను ఒక వివాహితుడితో సహజీవనం చేసి మానసికంగానూ, శారీరకంగానూ చాలా కోల్పోయానని ఆవేదనను వ్యక్తం చేసింది. అలాంటి ఆండ్రియా ఇప్పుడు మళ్లీ వార్తల్లో తరచూ కనిపిస్తోంది. నటిగానూ బిజీ అవుతోంది. ఇకపోతే ఇటీవల ఈ అమ్మడు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో యూత్‌ను మజా చేసిందనే చెప్పాలి. అయితే అందులో ఆండ్రియా ధరించిన దుస్తులే విమర్శలకు దారి తీశాయి. అంతేకాకుండా ఆమెపై గాటుగా విమర్శిస్తున్నారు. దీంతో ఆండ్రియాకు చిర్రెత్తు కొచ్చింది. తన డాన్స్‌ను మాత్రమే ఎంజాయ్ చేయాలి గానీ, ధరించిన దుస్తుల గురించి కామెంట్స్ కొడతారా అంటూ రుసరుసలాడింది. ఏదేమైనా మరోసారి తన అసలు నైజాన్ని ఆండ్రియా నెటిజన్లకు చూపించింది. కాగా ప్రస్తుతం ఈ జాణకు అవకాశాలు వరుసకడుతున్నాయి. విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తోంది. దీనితో పాటు కా, వట్టం, మాళిగై చిత్రాల్లో నటిస్తోంది. అన్నట్లు ఇటీవల ఆయుర్వేద వైద్యంతో కొత్తందాలను సంతరించుకున్న ఆండ్రియా ఆ విషయాన్ని అందరికీ తెలియజేయడానికే శృంగారభరిత డాన్స్‌తో కూడిన వీడియోను విడుదల చేసిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. మొత్తం మీద తన ప్రయత్నం ఫలించినట్లే ఉంది. కోలీవుడ్‌లో మరో రౌండ్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తోందన్నమాట. View this post on Instagram Va va pakkam va 😋 #aboutlastnight #birthdaygirl #thejeremiahproject Thanks @amritha.ram for this BOMB 👗 ❤️ A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) on Dec 21, 2019 at 11:56pm PST -
మోసం చేసిన వ్యక్తి ఎవరన్నది పుస్తకంలో..
సినిమా: టాలెంట్‌కు కేరాఫ్ ఆండ్రియా అని చెప్పవచ్చు. ఏ తరహా పాత్రనైనా మెప్పించగల సత్తా ఉన్న నటి. వ్యక్తిగతంగానూ ఈ అమ్మడి రూటు సపరేటు. తన ఇష్టమైన రీతిలో స్వేచ్ఛాజీవి ఆండ్రియా. తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ నటిగా పేరున్న ఆండ్రియాలో మంచి గాయని ఉంది. అంతే కాదు రచయిత కూడా ఉంది. ఈ అమ్మడిని చివరిగా వడచెన్నై చిత్రంలో చూశాం. ఆ తరువాత తెరపైకి కనిపించలేదు. అలాంటి ఆండ్రియా ఆ మధ్య ఒక కార్యక్రమంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఒక వివాహితుడితో సంబంధం పెట్టుకుని శారీరకంగానూ, మానసికంగా బాధపడినట్లు పేర్కొంది. అతని నుంచి బయట పడి ఆయుర్వేద చికిత్స పొంది ఉపశమనం పొందుతున్నట్లు పేర్కొంది. తనను మోసం చేసిన వ్యక్తి ఎవరన్నది తాను రాసుకున్న పుస్తకంలో బయట పెడతానని బాంబ్ పేల్చింది. అయితే పుస్తకాన్ని విడుదల చేయలేదు. మానసికంగా క్షోభకు గురి చేసిన ఆ వ్యక్తి బెదిరించడం వల్లే ఆండ్రియా తన పుస్తకాన్ని విడుదల చేయలేదనే ప్రచారం జరిగింది. ఆ వ్యక్తికి రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయని, సినిమా రంగంలోనూ ఉన్నాడని సమాచారం. పుస్తకం విషయం తెలిసిన ఆ వ్యక్తి ఆండ్రియాను బెదిరించినట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో టాక్ వైరల్ అవుతోంది. దీంతో ఆండ్రియా పుస్తకం బయటకు వచ్చే అవకాశం లేదనే భావించాలి. మళ్లీ నటనపై దృష్టి సారించిన ఈ సంచలన నటికి అవకాశాలు బాగానే తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం కావట్టం, మాళిగై చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా విజయ్‌తో ఆయన 64వ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇందులో ఆండ్రియా హీరోయిన్ కాదట. ఒక ముఖ్య పాత్రలో మెరవనుందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యి చిత్రీకరణ జరుపుకుంటోంది. -
'వివాహిత నటుడితో సహజీవనం చేశా'
చెన్నై : హీరోయిన్ ఆండ్రియాకు సూపర్ చాన్స్ వరించడంతో ఎగిరి గంతేస్తున్నారు. ఏకంగా ఇళయ దళపతి విజయ్‌తో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసింది ఈ అమ్మడు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఈ సుందరి మల్టీ టాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. ఆండ్రియాలో మంచి గాయనీ, రచయిత ఉన్నారు. ఈ అమ్మడు చివరిసారిగా 'వడచెన్నై' అనే చిత్రంలో కనిపించింది. ఇటీవలే ఆండ్రియా ఒక సంచలన విషయాన్ని మీడియాకు విడుదల చేసి వార్తల్లో నిలిచింది. ‘వివాహితుడైన ఒక నటుడిని నమ్మి ఆయనతో సహజీవనం చేశాను. నేను అతని చేతిలో శారీరకంగానూ, మానసికంగానూ చాలా వేధింపులకు గురయ్యాను’ అని పేర్కొన్నారు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి ఆయుర్వేద చికిత్సను తీసుకొని మళ్లీ మామూలు వ్యక్తిని కాగలిగానని ఆండ్రియా తెలిపారు. అయితే ఈ మధ్యనే ఆండ్రియా ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో తనను వేధింపులకు గురి చేసిన వ్యక్తి పేరు, అతని వివరాలు పొందిపరిచినట్లు పేర్కొన్నారు. త్వరలోనే పుస్తకాన్ని బయటకు తీసుకురావాలనుకోగా, కొందరు బెదిరింపులకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో నటి ఆండ్రియాకు ఇళయ దళపతి విజయ్‌తో నటించే అవకాశం తలుపు తట్టింది. ఈ ఒత్తిడిలో నిజంగా ఇది ఆండ్రియాకు ఉపశమనం కలిగించే విషయమే. బిగిల్ సినిమాతో బ్లాక్బాస్టర్ అందుకున్నవిజయ్ 'మానగరం', 'ఖైదీ' చిత్రాల ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమయిన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. మరో విశేషమేమిటంటే ఈ చిత్రంలో నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. హీరోయిన్గా మాళవిక మోహన్‌ను ఇప్పుటికే ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా మరో ముఖ్య పాత్రకు ఆండ్రియాను తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రంతో ఆండ్రియా కోలీవుడ్‌లో మరోసారి చక్రం తిప్పుతుందేమో చూడాలి. -
మళ్లీ వస్తున్న ఆండ్రియా
చెన్నై : నటి ఆండ్రియా ఒక సంచలనం. బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ లేడీ. అంతే కాదు మల్టీపుల్ టాలెంటెండ్ నటి. ఈమెలో మంచి గాయని. ఇక గీతరచయిత కూడా. ఆ మధ్య ఆంగ్లంలో పాట రాసి, తనే ట్యూన్ కట్టి ఆల్బమ్ విడుదల చేసింది. ఇక నటిగా ఎలాంటి పాత్రనైనా ఛాలెంజ్‌గా తీసుకుని నటించే సత్తా కలిగింది. అయితే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించకుండా, చాలా సెలెక్టెడ్ పాత్రల్లోనే నటిస్తూ తన కంటూ ఒక ఇమేజ్ను సంపాదించుకున్న నటి ఆండ్రియా. ఆ మధ్య వడచెన్నైలో ఏ హీరోయిన్ చేయడానికి సాహసించని వైవిధ్యభరిత పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఆండ్రియా మళ్లీ తెరపై కనిపించలేదు. అయితే ఒక వివాహితుడిని నమ్మి శారీరకంగానూ, మానసికంగానూ బాధింపునకు గురయ్యానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొని సంచలనం కలిగించింది. అదేవిధంగా మళ్లీ మామూలు మనిషిని కావడానికి వైద్యం పొందినట్లు చెప్పింది. కాగా అలాంటి సంచలన నటి ఆండ్రియా తాజాగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ అమ్మడు యువ నటుడు సిబిరాజ్‌కు జంటగా నటిస్తోంది. ఇందులో మరో హీరోయిన్గా నటి అతుల్యరవి నటిస్తోంది. 2012లో మధుబాన కడై చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కమల్ కన్నన్ ఏడేళ్ల తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా ఈ చిత్రంతో నటి ఆండ్రియా కొత్తగా కనిపిస్తుందంటున్నారు. ఆమె పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. చూద్దాం ఈ చిత్రం ఆండ్రియా కెరీర్‌కు ఎంత వరకూ దోహదపడుతుందో. -
పెళ్లైన వ్యక్తితో ఎఫైర్.. అందుకే డిప్రెషన్: నటి
చెన్నై: ధనుష్ ‘వడ చెన్నై’ సినిమాలో అద్భుతమైన నటన కనబర్చిన నటి, గాయని ఆండ్రియా జెరెమియా గత ఏడాదికాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారిన ఆండ్రియా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో తీవ్ర కుంగుబాటు (డిప్రెషన్)కు గురయ్యానని, దాని నుంచి కోలుకొని మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానని ఆమె తెలిపారు. ఇటీవల బెంగళూరులో ఆండ్రియా తన కవితల పుస్తకం ‘బ్రోకెన్ వింగ్స్’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందులోని భావోద్వేగపరితమైన కవితను ఆమె చదివి వినిపించారు. ఈ సందర్భంగా శ్రోతలు ఆమె కవితలోని పలు బాధాత్మక పంక్తులను గురించి ప్రశ్నించారు. దీనికి ఆండ్రియా సమాధానమిస్తూ.. తాను కొంతకాలం ఓ వివాహితుడితో రిలేషన్షిప్లో ఉన్నానని, అతను తనను మానసికంగా, శారీరకంగా వేధించి..గాయపర్చాడని, అందుకే తాను డిప్రెషన్లోకి వెళ్లినట్లు చెప్పారు. ఈ డిప్రెషన్ నుంచి బయటపడటానికి సినిమాలకు దూరంగా ఉంటూ.. ఆయుర్వేద చికిత్స పొందానని ఆమె తెలిపినట్లు ‘ఇండియా గ్లిట్జ్’ వెబ్సైట్ ఓ కథనంలో పేర్కొంది. తన కవితల ద్వారా వ్యక్తిగత భావాలను వెల్లడించానని, ఇలా వెల్లడించడానికి ఎంతో ధైర్యం కావాలని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బ్రోకెన్ వింగ్స్’ కవర్ పేజీ పోస్టు చేస్తూ.. ఆండ్రియా పేర్కొన్నారు. -
దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..
సినిమా: నిజమే తాను కొంత కాలం సినిమాలకు దూరమయిన మాట నిజమే అంటోంది హీరోయిన్ ఆండ్రియా. ఇందుకు కారణం విశ్రాంతి లేకుండా నటించడంతో శారీరకంగానూ, మానసికంగానూ చాలా అలసిపోయాను అనడం కంటే బాధకు గురయ్యానని అంటోంది. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బహుభాషా నటినే కాకుండా చాలా విశాల మనస్తత్వం కలిగిన నటి. తాను చేయాలనుకున్నది ఎవరేమనుకున్నా డోంట్‌కేర్ అని చేసేస్తుంది. అలా ఆ మధ్య వివాదాస్పద సంఘటనలతో వార్తల్లోకెక్కిన ఆండ్రియా ఇటీవల ఇమేజ్ను పట్టించుకోకుండా వడచెన్నై చిత్రంలో సంచలన పాత్రను పోషించింది. అలా ఏడాదికి నాలుగైదు చిత్రాల్లో నటించే ఈ బ్యూటీ ఇటీవల తెరపై కనిపించలేదు. గత ఏడాది ఈ అమ్మడు నటించిన విశ్వరూపం 2, వడచెన్నై చిత్రాలు మాత్రమే తెరపైకి వచ్చాయి. ఆ తరువాత ఆండ్రియా మరో చిత్రంలో నటించలేదు. ఇక సామాజిక మాధ్యమాల్లో తరుచూ తన అభిప్రాయాలను, ఫొటోలను పోస్ట్ చేసే ఆండ్రియా ఇటీవల అలాంటి వాటికి దూరంగా ఉంది. దీంతో ఈ జాన చిత్రాలకు గుడ్‌బై చెప్పిందా అనే అనుమానం పలువురికి కలుగుతోంది. దీంతో ఎట్టకేలకు ఈ బ్యూటీ తాజాగా తన ట్విట్టర్లో తాను సినిమాలకు దూరంగా ఉండడానికి కారణాన్ని వెల్లడించింది. ఆమె ఏం చెప్పిందో చూద్దాం. తాను విశ్రాంతి లేకుండా నటించడం కారణంగా మానసికంగానూ, శారీరకంగానూ చాలా బాధకు గురైనట్లు చెప్పింది. అందుకే కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నానని చెప్పింది. కాఫీ తాగడానికి బానిసనైన తాను దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స పొందినట్లు తెలిపింది. అయితే అది అంత సాధ్యం కాలేదని అయినా వైద్య చికిత్సతో కష్టపడి ఆ అలవాటును మానుకున్నానని చెప్పింది. కాఫీకి బదులు ఉదయాన్నే ఒక కప్పు మూలిక తేనీరును తీసుకుంటూ, యోగాతో దిన చర్యలను ప్రారంభిస్తున్నానని తెలిపింది. అయితే ఆ వైద్యాన్ని బలహీన హృదయం కలవారు పాఠించలేరని చెప్పింది. తానే ఒక దశలో ఆ వైద్యం నుంచి బయట పడాలని భావించానని అంది. అయితే వైద్యుల సలహా మేరకు ఆయుర్వేద వైద్య చికిత్సను కొనసాగించినట్లు తెలిపింది. ³్పుడు తాను చాలా నూతనోత్సాహంతో ఉన్నట్లు చెప్పింది. -
ఆ ఇద్దరి బాటలో ఆండ్రియా
సినిమా: నటి ఆండ్రియా కూడా వారి బాటలో పయనిస్తోంది. ఈ అమ్మడు సంచలన నటినే కాదు బహుభాషా నటి కూడా. అంతే కాదు ఈమెలో మంచి గాయని ఉంది. రచయిత్రి కూడా. ఇక చాలెంజింగ్ పాత్రలకు వెనుకాడే నటి కానే కాదు. ఈ మధ్య ధనుష్ కథానాయకుడిగా నటించిన వడచెన్నైలో భర్తను చంపిన వ్యక్తితో కాపురం చేసే విలక్షణ పాత్రలో నటించే ధైర్యం చేసింది. అలా ఇమేజ్‌కు భయపడని ఆండ్రియా తాజా ద్విపాత్రాభినయానికి సిద్ధం అవుతోంది. ఇప్పుడు నయనతార, అమలాపాల్ వంటి నటీమణులు ద్విపాత్రాభినయం చేసేస్తున్నారు. తాజాగా నటి ఆండ్రియా కూడా ఆదే బాటలో పయనిస్తోంది. ఈ సంచలన నటి మాళిగై అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. ఇది ఫాంటసీతో కలిసిన హర్రన్ సన్నివేశాలతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. కన్నడ దర్శకుడు దిల్ సత్య తెరకెక్కించనున్న ఇందులో ఆండ్రియా పోలీస్ అధికారిణిగా, మహారాణిగా ద్విపాత్రాభినయం చేయబోతోంది. ఒక కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ కోసం ఒక ప్రాంతానికి వెళ్లిన పోలీస్అధికారి ఆండ్రియాకు ఆక్కడ తన గతం గురించి తెలుస్తుందని, ఆ తరువాత ఏం జరిగిందన్న పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే చిత్రంగా మాళిగై ఉంటుందని తెలిసింది. ఇందులో కన్నడ నటుడు కార్తీక్ జయరామన్, దర్శకుడు కేఎస్.రవికుమార్, మనోబాలా, అశుతోష్ రాణా, జాంగ్రి మధుమిత, ఒక తెలుగు హాస్యనటుడు ప్రధాన పాత్రను పోషించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు చెప్పారు. -
స్క్రీన్ టెస్ట్
‘ఆడొచ్చాడు.. ఆడి కొడుకొచ్చాడని చెప్పు’... ‘మిర్చి’ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. తండ్రికి తగ్గ వారసుడిగా సినిమాలో ప్రత్యర్థిపై ప్రభాస్ సవాల్ విసురుతాడు. రియల్ లైఫ్‌లో వారసులు ఇలాంటి డైలాగ్ చెప్పకపోయినా... తల్లిదండ్రులకు తగ్గ బిడ్డలు అనిపించుకోవాలని అనుకుంటారు. మామూలుగా వారసులంటే ఎక్కువ శాతం అబ్బాయిలే ఉంటారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో... ఇది నిన్నటి కథ. ఇప్పుడు అమ్మాయిల జోరు కూడా పెరిగింది. ‘లేడీ వారసుల’ హవాతో ఈ వారం స్పెషల్ క్విజ్. 1 ఇందిరా ప్రొడక్షన్స్ అధినేత మంజుల అనగానే సూపర్‌స్టార్ కృష్ణ కూతురని అందరికీ తెలుసు. మహేశ్‌బాబు అక్కగా ఆమె ఫేమస్. ఈ మధ్య ఆమె ఓ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) వరుణ్ సందేశ్ బి) సందీప్ కిషన్ సి) ప్రిన్స్ డి) అరవింద్ కృష్ణ 2 విజయ్ హీరోగా నటించిన ‘సర్కార్’ సినిమాలో హీరోయిన్ కీర్తీ సురేశ్. ఆ చిత్రంలో ప్రతి నాయకురాలి పాత్రలో మెప్పించిన నటి ఎవరో తెలుసా? (ఆమె తమిళ హీరో శరత్ కుమార్ కూతురు) ఎ) సమంత బి) వరలక్ష్మి సి) తమన్నా డి) సాయి పల్లవి 3 యన్టీఆర్ హీరోగా నటించిన ‘దమ్ము’ చిత్రంలో ఓ హీరోయిన్గా నటించారు త్రిష. మరో హీరోయిన్గా నటించింది ప్రముఖ నటి రాధ కూతురు. ఆమె పేరేంటి? ఎ) లక్ష్మీ మీనన్ బి) తులసి సి) కార్తీక డి) శరణ్యా మోహన్ 4 తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఇద్దరు కుమార్తెలు. ఒకరు సౌందర్య, మరొకరు ఐశ్వర్యా ధనుష్. ఇద్దరూ దర్శకులే. వీరిలో కార్తీ హీరోగా నటించిన ఓ సినిమాకి ఐశ్వర్య తన గొంతును అరువిచ్చారు. ఆమె ఏ హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్పారో తెలుసా? ఎ) రిమ్మీసేన్ బి) రియాసేన్ సి) రీమాసేన్ డి) రైమాసేన్ 5 సంగీత దర్శకుడు యస్.యస్. తమన్‌తో కలిసి ‘రేసుగుర్రం’ చిత్రంలోని ‘డౌన్ డౌన్ డుప్ప డుప్ప...’ సాంగ్‌ను పాడిన సింగర్ ఎవరో తెలుసా? (ఆమె ప్రముఖ హీరో కూతురు) ఎ) అమలా పాల్ బి) శ్రుతీహాసన్ సి) ఆండ్రియా డి) ఐశ్వర్యా అర్జున్ 6 ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించి, నటించటంతో పాటు తన ఫిల్మ్ కెరీర్‌ను ప్రారంభించిన ‘ఒక మనసు’ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) నిహారిక బి) స్వాతి సి) ఇషా రెబ్బా డి) తేజస్వి మడివాడ 7 అఖిల్‌తో ‘హలో’ చెప్పి తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంటరైన కళ్యాణి ఓ హీరోయిన్ కుమార్తె. ఆమె తండ్రి పెద్ద దర్శకుడు. ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకముందు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. కళ్యాణి అమ్మ గారి పేరేంటి? ఎ) వాణీ విశ్వనాథ్ బి) అంబిక సి) లిజి డి) ఊర్వశి 8 విలక్షణ నటునిగా పేరున్న నటుడు మోహన్‌బాబు. ఆయన కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న పేరు మీదే ఆయన చిత్రనిర్మాణ సంస్థ ఉంది. ఆమె ఇంగ్లీషు, తెలుగు, తమిళ సినిమాలతో పాటు అనేక టీవీ షోస్ చేశారు. ఆమె ఏ తమిళ దర్శకుని చిత్రంలో నటించారో తెలుసా? ఎ) మణిరత్నం బి) బాలచందర్ సి) భారతీరాజా డి) పి. వాసు 9 చిరంజీవి పెద్ద కుమార్తె, రామ్‌చరణ్ అక్క సుస్మిత సినీ రంగంలో రాణిస్తున్నారు. ఆమె ఏ శాఖలో తన ఉనికిని చాటుకుంటున్నారో కనుక్కోండి? ఎ) ఎడిటింగ్ బి) ఫొటోగ్రఫీ సి) ప్రొడ్యూసర్ డి) ఫ్యాషన్ డిజైనర్ 10 ‘సాహెబా సుబ్రమణ్యం’ అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి దర్శకురాలిగా అడుగు పెట్టారు శశికిరణ్. ఆమె ఓ ప్రముఖ కమెడియన్ కూతురు. ఎవరా కమెడియన్ కనుక్కోండి? ఎ) ఏ.వి.యస్ బి) యం.యస్. నారాయణ సి) ధర్మవరపు సుబ్రమణ్యం డి) ఎల్బీ శ్రీరామ్ 11 అడివి శేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆయన సరసన హీరోయిన్గా నటిస్తున్న నటి ఎవరు? (ఆ హీరోయిన్ వాళ్ల అమ్మానాన్న ఇద్దరూ సినీ పరిశ్రమలో ఉన్నారు) ఎ) శివాత్మిక బి) రష్మికా మండన్నా సి) శివాని డి) చేతన 12 హీరో కమల్‌హాసన్ అన్న ప్రముఖ నటుడు చారుహాసన్. ఆయన కుమార్తె మొదట కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసి తర్వాత పెద్ద హీరోయిన్ అయ్యారు ఆమె పేరేంటి? ఎ) జయసుధ బి) భానుప్రియ సి) సుహాసిని డి) విజయశాంతి 13 తెలుగులో ‘రక్తకన్నీరు’ నాగభూషణం లానే తమిళ్లో యం.ఆర్. రాధ అనే నటుడు చాలా ఫేమస్. ఆయన కూతురు దక్షిణాదిన పాపులర్ హీరోయిన్. ఆమె పేరేంటి? ఎ) రాధిక బి) రాధ సి) సుమలత డి) జయప్రద 14 1989లో విడుదలైన ‘అడవిలో అభిమన్యుడు’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు నటి ఐశ్వర్య. ఆమె ప్రముఖ హీరోయిన్ లక్ష్మి కుమార్తె. ఆమె ఏ హీరోతో తన సినీ ప్రయాణం మొదలుపెట్టారో తెలుసా? ఎ) జేడీ చక్రవర్తి బి) వడ్డే నవీన్ సి) జగపతిబాబు డి) శ్రీకాంత్ 15 ప్రముఖ నటుడు అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వివేగం’లో ఆయన సరసన హీరోయిన్గా నటించారు కాజల్ అగర్వాల్. మరో నటి కీలక పాత్ర చేశారు. ఆమె పేరేంటి? (ఆమె తండ్రి తమిళ, తెలుగు సినీరంగంలో మంచి పేరున్న నటుడు) ఎ) అమలాపాల్ బి) శ్రుతీహాసన్ సి) అక్షర హాసన్ డి) కీర్తీసురేశ్ 16 వరలక్ష్మీ శరత్‌కుమార్.. ఈ పేరు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో చాలా ఫేమస్. ఆమెను హీరోయిన్గా మొదట పరిచయం చేసిన దర్శకుని పేరేంటో తెలుసా? (ఆయన ఇప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్‌తో ఎఫైర్లో ఉన్నాడు) ఎ) ఏ ఆర్ మురుగదాస్ బి) లింగుస్వామి సి) ఏ.ఎల్. విజయ్ డి) విఘ్నేశ్ శివన్ 17 శ్రీదేవి కూతురు జాహ్నవి. ఆమె నటించిన మొదటి సినిమా ‘ధడక్’ నటిగా మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలో ఏ పాత్ర పోషిస్తున్నారో తెలుసా? ఎ) బాక్సర్ బి) పైలెట్ సి) షూటర్ డి) క్రికెటర్ 18 ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన నటిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా? (ఆమె తండ్రి ప్రముఖ హిందీ దర్శకుడు) ఎ) కరీనా కపూర్ బి) కరిష్మా కపూర్ సి) ఆలియా భట్ డి) సోనమ్ కపూర్ 19 1970 – 80ల మధ్య కాలంలో తమిళ్ హీరోల్లో మంచి పేరున్న నటుడు ఆనంద్. ఆయన కుమార్తె తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు పెట్టింది పేరు. ఆమె భర్త కూడా నటుడే. ఎవరామె? ఎ) సిల్క్ స్మిత బి) అభినయ శ్రీ సి) అనురాధ డి) డిస్కో శాంతి 20 ఈ మధ్యే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘118’. ఆ చిత్రంలో నివేదా థామస్ చిన్నప్పటి పాత్రలో నటించిన బాల నటి పేరు పాట. ఆ పాప ఓ ప్రముఖ తెలుగు నటుని కుమార్తె. ఎవరా నటుడు? ఎ) ఉత్తేజ్ బి) రాజీవ్ కనకాల సి) సమీర్ డి) రఘుబాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (బి) 2) (బి) 3) (సి) 4) (సి) 5) (బి) 6) (ఎ) 7) (సి) 8) (ఎ) 9) (డి) 10) (బి) 11) (సి) 12) (సి) 13) (ఎ) 14) (సి) 15) (సి) 16) (డి) 17) (బి) 18) (సి) 19) (డి) 20) (ఎ) -
‘అది మగవారి తప్పు మాత్రమే కాదు’
మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు రచ్చరచ్చగా మారింది. ఇటీవల మీటూ అంటూ కొత్తగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏళ్ల క్రితం జరిగిందంటూ కొందరు ఇప్పుడు ఆరోపణలు చేయడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నా, వ్యతిరేకిస్తున్న వారు లేకపోలేదు. నిందలు ఎదుర్కొంటున్న వారిలో కొందరైతే మీటూ అనేది టీకప్పులో తుపాన్‌లా సమసిపోతుందని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇటీవల బాలీవుడ్ నటి తనూశ్రీదత్ సీనియర్ నటుడు నానాపటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది. ఆ తరువాత పలువురు అలాంటి ఆరోపణలు చేయడం మొదలెట్టారు. ఇక గాయని చిన్మయి మీటూ సామాజిక మాధ్యమంలో ప్రముఖ గీతరచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో చిన్మయికి పలువురు మద్దతుపలుకుతున్నారు. నా జీవితం నా ఇష్టం అనేలా ప్రవర్తించే నటి ఆండ్రియా రూటే వేరు కనుక ఆమె ఎలా స్పందిస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఈ అమ్మడు ధనుష్ హీరోగా నటించిన వడచెన్నై చిత్రంలో ముఖ్యపాత్రను పోషించింది. ఈ చిత్రం బుధవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆండ్రియా ఏమందో చూద్దాం. అవకాశాల పేరుతో నటీమణులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే విషయంపై స్పందిస్తూ అలాంటి వారు అంగీకరించకుండానే మగవారు పడక గదికి పిలుస్తున్నారా అని ప్రశ్నించింది. అయితే తానూ మీటూ వ్యవహారాన్ని స్వాగతిస్తున్నానంది. ఇది మార్పు కోసం మంచి సమయంగా భావిస్తున్నానంది. అయితే ఈ మీటూ అనేది 5,10 ఏళ్ల క్రితం లేకపోయ్యిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను పెద్దపెద్ద దర్శకుల చిత్రాల్లోనూ, ప్రముఖ నటులతోనూ కలిసి పని చేశానంది. హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్నా కథా పాత్రల్లోనూ నటిస్తున్నానని చెప్పింది. ప్రతిభ, శ్రమను నమ్ముకున్నానని ఆండ్రియా పేర్కొంది. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి పాత్రల్లో నటిస్తున్న పలు నటీమణులు తనకు తెలుసని చెప్పింది. ‘మీటూ’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వారిని ఆండ్రియా వ్యాఖ్యలు షాక్‌కు గురిచేస్తున్నాయి. -
ఇక ఆ సన్నివేశాలు చెయ్యను
తమిళసినిమా: సంచలన తారల్లో నటి అండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు నచ్చిన పనిచేయడానికి ఏమాత్రం వెనుకాడని నటి ఈమె. ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో రోమాన్స్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినా, డోంట్‌కేర్, వ్యక్తిగత విషయాల గురించి ఇతరులకు బదులివ్వాల్సిన అవసరం లేదని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చింది. నటిగానే కాకుండా మంచి గాయని కూడా అయిన ఆండ్రియా ఏ తరహా పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని నటించేది. అలా వేశ్య పాత్రలో నటించడానికీ వెనుకాడలేదు. ఇక ఇటీవల విడుదలైన విశ్వరూపం–2 చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించి శభాష్ అనిపించుకుంది. ఇంతకుముందు గ్లామరస్ పాత్రల్లోనూ నటించిన ఆండ్రియా తరమణి లాంటి చిత్రాల్లో మంచి నటనను ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ధనుష్‌తో నటిస్తున్న వడ చెన్నై చిత్రంలోనూ చాలా వైవిధ్యభరతమైన పాత్రలో కనిపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉంది. దీంతో తన పంథాను మార్చుకుందట. చాలా సెలెక్టెడ్ చిత్రాలే చేస్తున్న ఈ భామ ఇకపై గ్లామర్ పాత్రల్లో నటించరాదన్న నిర్ణయం తీసుకుందట. నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలనే అంగీకరించనున్నట్లు పేర్కొంది. ఇకపై ఇమేజ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించనున్నట్లు చెప్పింది. కాబట్టి దానికి భంగం కలిగించే లిప్‌లాక్, హీరోలతో సన్నిహితంగా నటించడం, హద్దులు మీరిన గ్లామర్ పాత్రల్లో నటించడం వంటి విషయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కథ వినే ముందే దర్శక నిర్మాతలకు చెప్పేస్తోందట. ఇప్పటి వరకూ అండ్రియా వేరు ఇకపై వేరు అని ఈ సంచలన నటి అంటోంది. చూద్దాం ఈ అమ్మడు తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందో. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో వడచెన్నై, కా అనే రెండు చిత్రాలే ఉన్నాయన్నది గమనార్హం. -
పాప్ సింగర్ జెన్నిఫర్ పాత్రలో ఆండ్రియా
చరణ్ తేజ్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ఆయుష్మాన్ భవ. నేను లోకల్ ఫేం త్రినాథ్ రావు నక్కిన కథ అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ సినిమాకు మరో యువ దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ రచయిత పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే సమకూరుస్తుండటం విశేషం. బాలీవుడ్ లో బేబీ డాళ్, హ్యాంగ్ ఓవర్, హైహీల్స్ లాంటి చిత్రాలకు సంగీతమందించిన బ్రోస్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. చరణ్ తేజ్ సరసన స్నేహా ఉల్లాల్ హీరోయిన్గా నటిస్తుండగా మరో కీలక పాత్రలో కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా అలరించనున్నారు. అది కూడా పాప్ సింగర్ జెన్నిఫర్ పాత్రలో ఆండ్రియా కనిపించనున్నారు. ప్రేమ పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన దీర్ఝ ఆయుష్మాన్ భవ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో జెన్నీఫర్‌గా ఆండ్రియా లుక్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
కత్తిలాంటి ఆలోచన
అడవిలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు కనీస అవసరాలకు సరిపడా వస్తువులను సమకూర్చుకోవడమే కాదు... ఆయుధాలను కూడా తోడు తీసుకెళ్లాలి. లేకపోతే ప్రమాదం పలకరించిన ప్రతిసారి తప్పించుకోవడం కష్టం. అందుకే హీరోయిన్ ఆండ్రియా జెర్మియా తన వెంట పదునైన కత్తిని తీసుకెళ్లారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆమె ఎదో కత్తిలాంటి పదునైన ఆలోచన చేస్తున్నారు. ఇంతకీ.. ఆండ్రియా అడవిలోకి ఎందుకెళ్లారో చెప్పలేదు కదూ! తన కొత్త సినిమా కోసం. ఆండ్రియా ముఖ్య తారగా నాన్‌జిల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కా: ది ఫారెస్ట్’. ఆదివారం సినిమా షూటింగ్ మొదలైంది. ‘‘చాలా టైమ్ వెయిట్ చేసిన తర్వాత ‘కా: ది ఫారెస్ట్’ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ మూవీ నా కంఫర్ట్ జోన్‌కి పూర్తి డిఫరెంట్ అని తెలుసు. కానీ ప్రయత్నిస్తా’’ అన్నారు ఆండ్రియా. ఈ సినిమాలో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ పాత్రలో ఆండ్రియా కనిపించనున్నారని టాక్. ఈ సినిమా కాకుండా కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘విశ్వరూపం 2’, ధనుష్ హీరోగా రూపొందిన ‘వడ చెన్నై’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారామె. ఆ రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. -
నా ఇష్టం
ఇలాంటి పిల్ల ఎక్కడైనా కనపడితే... అబ్బాయిలూ! ఓ సెల్యూట్ కొట్టేయండి. నిజంగా దమ్మున్న పిల్ల. తన వర్త్ని తెలుసుకున్న పిల్ల. ఇంకొకరి గురించి తక్కువగా మాట్లాడదు. తన గురించి తక్కువగా మాట్లాడనివ్వదు. ఒక రకంగా నేటి ప్రపంచంలో ఇలాంటి అమ్మాయిల సంఖ్య పెరిగితే అబ్బాయిలు దారికొస్తారేమో! మోడర్న్ గర్ల్.. మోడర్న్ థాట్స్ ‘నా లైఫ్.. నా ఇష్టం.’ అంటోంది ఆండ్రియా జెర్మియా ఈ మధ్య ‘కాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడుతూ.. ‘ఎవరితో ‘స్లీప్’ చేయాలన్నది ఆడవాళ్ల ఇష్టం. వాళ్లను ఫోర్స్ చేసే అధికారం మగవాళ్లకు లేదు’ అని బోల్డ్‌గా అన్నారు... ఇలాంటి స్టేట్మెంట్ ద్వారా సమాజానికి మీరు చెబుతున్నదేంటి? మగవాళ్లకు ఉండే స్వేచ్ఛ ఆడవాళ్లకూ ఉంటుందని చెబుతున్నా. నిజమే... ఎవరితో అన్నది ఆడవాళ్ల హక్కు. ఎవరూ ఫోర్స్ చేయకూడదు. ఆ రోజు ప్రెస్మీట్లో నేనీ మాట మాత్రమే చెప్పాను. కానీ, ‘కాస్టింగ్ కౌచ్’ గురించి ఇంకో మాట చెప్పాల్సింది. మిస్సయ్యాను. అదేంటంటే.. ‘కాస్టింగ్ కౌచ్’ కూడా ఆడవాళ్ల ఇష్టప్రకారమే జరుగుతుంది. ఇష్టపడినవాళ్లు ఒప్పుకుంటారు. లేనివాళ్లు ‘కుదరదు’ అని మొహం మీదే చెప్పేస్తారు. బయట చాలామందికి ఈ విషయం తెలియదు. ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ పేరుతో హెరాస్ చేస్తారని చెప్పుకుంటారు. కానీ, అది నిజం కాదు. ఉండలేక... వెళ్లలేక డైలమాలో ఉన్నవాళ్లు వేరే దారి లేక ‘ఇష్టం లేని ప్రపోజల్స్’ ఒప్పుకునే పరిస్థితి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. చాలా చోట్ల ఉంది.. అది నిజమే. ‘ఫిమేల్’ అనగానే ముందు ఆమె టాలెంట్ గురించి ఆలోచించేవాళ్లు తక్కువమంది ఉన్నారు. అది తప్పు. అవకాశం ఇవ్వడం కోసం ఏదో ఆశించడం సరి కాదు. ఆ ‘ఆఫర్’ కావాలంటే అడ్జస్ట్ కాక తప్పదనే పరిస్థితిలో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవడం టఫ్ అవుతుంది. ఆ పరిస్థితిలో కొంతమంది ఒప్పుకుంటున్నారు. అయితే ఫైనల్‌గా ఇలాంటివి కెరీర్‌కి ఉపయోగపడవు. టాలెంట్, హార్డ్‌వర్కే నిలబెడతాయి. వాటికి లాంగ్విటీ ఉంటుంది. అందుకే అంటున్నా... తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. యాక్చువల్‌గా నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ఆడవాళ్లను కొందరు ఆడిపోసుకుంటారు కానీ, వాళ్లది దయనీయమైన స్థితి అనాలి... ఎగ్జాట్లీ. ప్రపోజల్ పెట్టిన మగవాడి గురించి ఎవరూ మాట్లాడరు. అయితే ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నా. ‘ఈజీ రూట్’లో పైకి రావాలని ఎవరూ అనుకోకూడదు. నేను అనుకోను. అవకాశం వస్తే.. వస్తుంది. రాకపోతే రాదు. ఓపికగా వెయిట్ చేద్దామనుకుంటా. మన ఆలోచనల్లో నిజాయితీ, మన కష్టంలో క్రమశిక్షణ ఉంటే తప్పకుండా అవకాశాలొస్తాయి. అప్పటివరకూ ఎదురు చూసే ఓపిక లేనివాళ్లు ప్రపోజల్స్‌కి ఒప్పుకుంటారేమో! అది కూడా అందరూ అలా చేస్తారని అనలేం. ఓకే.. మూడు నాలుగు నెలల క్రితం సింగర్ సుచిత్ర తన ట్విట్టర్ ద్వారా కొందరి రహస్యాలను బయటపెట్టారు. మీకు సంబంధించిన పోస్ట్ కూడా ఉంది. అంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామనే విషయంలో జాగ్రత్తపడాలంటారా... అవును. ఎవరైతే మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకుంటారో వాళ్ల మీద మాటల దాడి, ఎలాంటి దాడి అయినా చేయడానికి కొందరు రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ల లైఫ్ అందరికీ ఓపెనే. అది సినిమా స్టార్స్ అయినా.. పొలిటికల్ లీడర్స్ అయినా. వాళ్ల జీవితం గురించి అందరికీ కావాలి. వాళ్లకి మంచి పేరు ఉంటే దాన్ని చెడగొట్టెయ్యాలని చూస్తారు. నా విషయానికి వస్తే... నేను సిగ్గుపడాల్సిన పనులేవీ నా లైఫ్‌లో చేయలేదు. ఒకవేళ చేసినా ‘అది నేను కాదు’ అని తప్పించుకునే టైప్ కాదు. ‘అవును.. నాకు ఏం అనిపించిందో అదే చేశాను. అది నా ప్రాబ్లమ్. మీ ప్రాబ్లమ్ కాదు. ఇది నా జీవితం. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరంలేదు’ అని ఓపెన్‌గా చెప్పే దమ్ము ఉంది. కరెక్టే.. మన లైఫ్‌ని మనం ఇష్టపడినట్లుగా జీవించాలి.. అయితే సమాజం గురించి కూడా ఆలోచించాలి కదా! కచ్చితంగా. సామాజిక స్పృహ ఉండాలి. ఆ స్పృహ ఉంటే.. మనకు ఇష్టం వచ్చినది చేయకూడదు. సొసైటీ ఇష్టపడేవి చేయాలి. సొసైటీయా? మన లైఫా? అనే క్లారిటీ ఉండాలి. ఏదో ఒక్కదానికే కమిట్ అవ్వాలి. సొసైటీ వ్యతిరేకించే పనులు చేసినప్పుడు విమర్శలు చుట్టుముడుతాయి. అలాంటివి తట్టుకునేంత ధైర్యం మీకు ఉందా? ఎప్పుడైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తామో అప్పుడు ‘పర్సనల్ ఫ్రీడమ్’ అనేది పోతుంది. ఇక్కడ ఉన్నందుకు మేం చెల్లించే మూల్యం అది. దాన్నే ‘ఆక్యుపేషన్ హాజర్డ్’ (వృత్తి సంబంధిత ప్రమాదాలు) అనాలి. ఫర్ ఎగ్జాంపుల్... ఓ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందనుకోండి.. కట్టే సమయంలో ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోయి చనిపోతే, అది ‘ఆక్యుపేషన్ హాజర్డ్’ అంటాం. అక్కడ అలాంటి ప్రమాదాలు.. సినిమా ఇండస్ట్రీలో ఇంకో రకమైన ప్రమాదాలు. వేరే చోట వేరే రకమైనవి. అండ్.. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ల గురించి వచ్చే వార్తలన్నీ నిజం కావు. జనాలు మా గురించి వచ్చే వార్తలు చదువుతున్నప్పుడు.. ఆ స్టోరీకి రెండు కోణాలుంటాయని ఆలోచించాలి. అయితే గుడ్ని ఫోకస్ చేయరు. దాంతో బ్యాడ్ ఎలివేట్ అవుతుంది. అంత మాత్రాన వాళ్లు ‘బ్యాడ్’ అనలేం. బయటి జనాల గురించి వదిలేద్దాం. ఫైనల్‌గా మన లైఫ్‌లో ఉన్న పీపుల్ మన గురించి ఏం అనుకుంటున్నారన్నదే ముఖ్యం. నా గురించి విమర్శలు వస్తే... అస్సలు పట్టించుకోను. న్యూస్ పేపర్స్ చదువుతారా? చదవడం మానేశాను. నేను, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్... ఇదే నా జీవితం. మిగతావాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి లేదు. అలా తెలుసుకోవాలంటే ఎంతమంది గురించి తెలుసుకుంటాం? ఇన్ఫాక్ట్ మన చుట్టూ ఉన్నవాళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక్క రోజు కూడా సరిపోదు. మన లైఫ్‌లో ఎక్కువ టైమ్‌ని మనకోసం కేటాయించాలి కానీ, అవతలివాళ్ల కోసం ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏంటి? ‘ఐ వర్క్.. ఐ ట్రావెల్.. ఐ ఎంజాయ్ మై లైఫ్’. అంతే. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాను. సొసైటీలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవడానికి చదవాలి కదా? ఒకవేళ తెలుసుకోదగ్గ విషయాలుంటే అది ఏదో రకంగా మన చెవికి వచ్చేస్తుంది. చెప్పడానికి చాలామంది ఉన్నారు. ‘అక్కడ భూకంపం వచ్చిందట’, ‘ఆ ప్లేస్‌లో ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందట’ అని చెప్పేవాళ్లు నా చుట్టూ చాలామంది ఉన్నారు. మీరు ‘ఫెమినిస్టా’? ఆడ–మగ సమానం అనుకుంటా. దాన్నే ఫెమినిజమ్ అంటే.. అవును. నేను స్త్రీవాదినే. ఇవాళ ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి, వాళ్లకు ఆర్థిక స్వాతంత్య్రం వచ్చింది. నాకు తెలిసిన ఒకామె ఉంది. ఆవిడ ఇళ్లలో పనులు చేస్తుంది. నెలకి 20వేల రూపాయలు సంపాదిస్తుంది. అంటే.. ఎన్ని ఇళ్లలో పనులు చేస్తుంది? ఎంత కష్టపడుతుంది? అని ఊహించవచ్చు. ఆవిడ భర్త తాగుబోతు. తాగి, ఆమెను తిడతాడు. కొడతాడు. భరించలేక అతన్నుంచి విడిపోయింది. పిల్లలను చక్కగా చదివించుకుంటోంది. అంటే.. ఆవిడకిప్పుడు డబ్బుకోసం మగాడు అక్కర్లేదు. వస్తువుల కోసం అక్కర్లేదు. అంతెందుకు? ఆవిడకి మగాడే అవసరం లేదు. అందుకే అంటున్నా.. ఇప్పుడు తమకెలాంటి భర్త కావాలో సెలక్ట్ చేసుకోవడం అనేది ప్యూర్లీ అమ్మాయి చాయిస్సే. అలా ఆడవాళ్లు తమను ఎన్నుకోవడం అనేది మగాళ్లు భరించలేరు. అలాంటివాళ్లను మీరు కలిసిన సందర్భాలున్నాయా? ఉన్నాయి. ‘ఇతను మంచివాడు. ఆడవాళ్లను హీనంగా చూడడు’ అనే నమ్మకంతో ఆ వ్యక్తితో మాట్లాడేదాన్ని. కానీ, నిరుత్సాహమే ఎదురైంది. ఇప్పటివరకూ ఆడవాళ్లను తమతో పాటు సమానంగా గౌరవించే మగాడు నాకు తారసపడలేదు. అందుకే నేను ‘సింగిల్’గా ఉన్నాను. అందరూ సమానం అంటాం.. హీరోలతో పోల్చితే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువ కదా.. పోనీ లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసినప్పుడు హీరోయిన్లకు ఎక్కువ పారితోషికం ఇస్తారా? ‘తరమణి’ (తమిళ చిత్రం – లేడీ ఓరియెంటెడ్)కి ముందు నేను చాలా స్క్రిప్ట్స్ విన్నాను. అవన్నీ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీసే. రెమ్యునరేషన్ ఎక్కువ అడిగితే, ‘మేడమ్.. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. అందుకని ఎక్కువ పారితోషికం ఇవ్వలేం’ అన్నారు. ఇక్కడ లేడీ ఆర్టిస్టులు ఎంత కష్టపడినా మేల్ ఆర్టిస్టులకు ఇచ్చినంత పారితోషికం ఇవ్వరు. ఇప్పుడిప్పుడే కొంచెం మార్పు కనపడుతోంది. ఆ మార్పుకి హ్యాపీ. ‘తరమణి’ సినిమాలో మీరు మందు పుచ్చుకుంటారు.. సిగరెట్ తాగారు.. ఇవి ఆడవాళ్లు చేయదగ్గ పనులు కాదంటారు కదా... ఎవరన్నారు? ఇవి తయారు చేసేటప్పుడు మగవాళ్ల కోసమే అని ఎవరూ చెప్పలేదే? మందు, సిగరెట్ తాగడం మగవాళ్ల హక్కు అంటే ఒప్పుకోను. ఇష్టపడితే ఆడవాళ్లూ తాగొచ్చు. అంటే.. స్మోకింగ్‌ని ఎంకరేజ్ చేస్తున్నారా? నెవర్. ఆల్కహాల్, స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం. ఆడవాళ్ల రైట్స్ గురించి మాట్లాడానంతే. వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ముఖ్యంగా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఆల్కహాల్, సిగరెట్‌కి దూరంగా ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఆ మహిళకు ఆమె శరీరం మీద మాత్రమే కాదు.. ఇంకో శరీరం మీద బాధ్యత ఉంటుంది. ఒకరికి జన్మనివ్వాలి. హెల్దీ లైఫ్ ఇవ్వాలి కాబట్టి, ప్రెగ్నెన్సీ సమయంలో చాలా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. ఫైనల్లీ... ‘తడాఖా’ తర్వాత డబ్బింగ్ సినిమాల్లో తప్ప స్ట్రయిట్ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు.. మావైపు కూడా రావొచ్చు కదా? మీ దర్శక–నిర్మాతలను పిలవమనండి. కచ్చితంగా వస్తా. నా అంతట నేను ఎవర్నీ అవకాశాలు అడగను. అది సింగర్‌గా అయినా.. ఆర్టిస్ట్‌గా అయినా. లైఫ్‌లో ఇప్పటివరకూ ‘సార్.. నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి’ అని ఎవర్నీ అడగలేదు. భవిష్యత్తులోనూ అడగను. ఇది నా స్టయిల్. అవకాశం వస్తే చేస్తా. లేకపోతే లేదు. ఫైట్స్కన్నా సాంగ్స్ ఈజీ! ఇటీవల విడుదలైన ‘డిటెక్టివ్’లో ఫైట్స్ చేశాను. సాంగ్స్ చేయడం చాలా ఈజీ అనిపించింది. ఆ సినిమాలో హార్లీ డేవిడ్సన్ బైక్ నడిపాను. సీన్ తీసేటప్పుడు బైక్ టర్న్ చేస్తే.. ఓ కారు అడ్డం వచ్చింది. భయపడ్డాను. ప్రొఫెషన్ అంటే ప్రేమ నేను స్టేజీ ఆర్టిస్ట్‌ని. అక్కడ రిజల్ట్ అప్పటికప్పుడు తెలుస్తుంది. సినిమాలకు అలా కాదు. లాంగ్ ప్రాసెస్. లొకేషన్లో మేం చేసినప్పుడు కూడా రిజల్ట్‌ని ఊహించలేం. ప్రేక్షకుల దగ్గరకు వెళ్లాక అసలు విషయం తెలుస్తుంది. సింగింగ్, డబ్బింగ్, యాక్టింగ్.. ఈ మూడింటిలో మీకేది ఇష్టం? అంటే చెప్పలేను. నాకు ప్రొఫెషన్ అంటే ప్రేమ. మూడింటినీ ఎంజాయ్ చేస్తాను. ‘తరమణి’ గురించి 20 నిమిషాలు మాట్లాడింది ఆర్టిస్ట్‌గా ఉండటం అనేది లక్. కొన్నిసార్లు మేం చేసే సినిమాలు కొందరి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఒకసారి నేను బయటికెళితే, ఒకావిడ ‘మీతో మాట్లాడొచ్చా’ అనడిగి, ‘తరమణి’ గురించి 20 నిమిషాలు మాట్లాడింది. ‘నా సమస్యలకు ఆ సినిమా పరిష్కారం చూపింది. మీ క్యారెక్టర్ నాలో ధైర్యాన్ని నింపింది’ అని ఆవిడ అన్నప్పుడు నాక్కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. – డి.జి. భవాని -
'గృహం' మూవీ రివ్యూ
టైటిల్ : గృహం జానర్ : హర్రర్ తారాగణం : సిద్ధార్థ్, ఆండ్రియా, సురేష్, అతుల్ కులకర్ణి, అనీషా ఎంజెలీనా విక్టర్ సంగీతం : గిరీష్ వాసుదేవన్ దర్శకత్వం : మిలింద్ రావ్ నిర్మాత : సిద్ధార్థ్ తెలుగు తెరమీద హర్రర్ సినిమాలకు సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ జానర్ లో తెరకెక్కిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అందుకే అప్పుడప్పుడు స్టార్ హీరోలు కూడా ఈ జానర్ సినిమాల మీద దృష్టి పెట్టారు. తాజాగా నాగార్జున లాంటి సీనియర్ హీరో కూడా దెయ్యం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాతో సక్సెస్ సాధించటంతో మరోసారి హర్రర్ జానర్ అదరి దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు టాలీవుడ్ లో లవర్ బాయ్ కు స్టార్ ఇమేజ్ అందుకున్న సిద్ధార్థ్ తన రీ ఎంట్రీ కోసం హర్రర్ జానర్ నే ఎంచుకున్నాడు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా సిద్ధార్థ్ కు సక్సెస్ ఇచ్చిందా..? కథ: సినిమా 1934 కాలంలో మొదలవుతుంది. ఓ చైనా వ్యక్తి ఇంట్లో ఓ గర్భవతితో పాటు ఆమె కూతురు నివసిస్తుంటారు. వెంటనే సినిమా 2016కు మారుతుంది. సర్జన్ కృష్ణ కాంత్(సిద్ధార్థ్) తన భార్య లక్ష్మి (ఆండ్రియా)తో కలిసి రోషినీ వ్యాలీలోని బంగ్లాకు మారతారు. వారి పక్కింట్లోకి ఓ కుటుంబం అద్దెకు వస్తుంది. వారిలో జెన్నీ అనే అమ్మాయి కృష్ణకుమార్ ను ఇష్టపడుతుంది. అదే సమయంలో వారి ఫ్యామిలీ, కృష్ణ కాంత్ ల కుటుంబాలు దగ్గరవుతాయి. కొద్ది రోజులకు జెన్నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. కృష్ణ సలహాతో జెన్నిని సైక్రియాటిస్ట్ కు చూపిస్తారు. అదే సమయంలో వారి ఇంట్లో ఓ చైనా మహిళ, ఆమె కూతురు ఆత్మలు ఉన్నాయన్న నిజం తెలుస్తుంది. ఆ ఇంట్లో ఉన్న ఆ దెయ్యాలు ఎవరు..? వాటికి జెన్నీకి సంబంధం ఏంటి..? పాల్, కృష్ణలు జెన్నిని ఎలా కాపాడారు అన్నదే మిగతా కథ. నటీనటులు : నా సినిమాకు 18 ఏళ్ల లోపు వారు రావొద్దు అంటూ తానే స్వయంగా ప్రకటించిన హీరో సిద్ధార్థ్ అదే స్థాయి హర్రర్ సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇలాంటి సినిమాలకు నటీనటుల ఎంపిక చాలా కీలకం ప్రధాన పాత్రలో తానే నటించిన సిద్ధార్థ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. తనకు అలవాటైన రొమాంటిక్ సన్నివేశాలతో పాటు భయపెట్టే సీన్స్ లోనూ అదే స్థాయి నటన కనబరిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో సిద్ధార్థ్ నటన వావ్ అనిపిస్తుంది. హీరోయిన్ గా ఆండ్రియా అందంతో పాటు అభినయంలోనూ పరవాలేదనిపించింది. పాల్ పాత్రలో అతుల్ కులకర్ణి తనదైన నటనతో మెప్పించాడు. ఇతర నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. బాలనటి అలీషా ఏంజెలినా విక్టర్ అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచింది. విశ్లేషణ : ఈ సినిమాతో నటుడిగా, నిర్మాతగా సక్సెస్ సాధించాలన్న సిద్ధార్థ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. తన స్నేహితుడు మిలింద్ రావ్ ను దర్శకుడిగా ఎంచుకున్న సిద్ధార్థ్ నటుడిగానే కాక మేకింగ్ లోనూ తనదైన ముద్ర ఉండేలా చూసుకున్నాడు. హాలీవుడ్ స్థాయి హర్రర్ సినిమాను దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం చేసిన మిలింద్ రావ్ సూపర్బ్ విజువల్స్ తో భయపెట్టాడు. సినిమా అంతా డిఫరెంట్ టింట్, కలర్ మోడ్ లో సాగటంతో హాలీవుడ్ సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథనం కాస్త నెమ్మదిగా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. హర్రర్ సినిమాలకు సినిమాటోగ్రఫి చాలా ఇంపార్టెంట్. శ్రేయాస్ కృష్ణ సూపర్బ్ సినిమాటోగ్రఫి సినిమా స్థాయిని పెంచింది. అందుకు తగ్గట్టుగా గిరీష్ వాసుదేవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత భయపెట్టింది. రొమాంటిక్ సీన్స్ ను కూడా కాస్త ఘాటుగానే తెరకెక్కించారు. బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ హర్రర్ సినిమాను అందించే ప్రయత్నం చేశారు. కామెడీ, డ్రామా లాంటి అంశాలను ఆశించే వారిని ఈ సినిమా ఏ మాత్రం అలరించదు. ప్లస్ పాయింట్స్ : సిద్ధార్థ్ నటన కథ, టేకింగ్ మైనస్ పాయింట్స్: రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం స్లో నేరేషన్ -సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్ నెట్ డెస్క్ -
'నా సినిమాకు 'ఏ' సర్టిఫికేట్ ఇవ్వమన్నా'
ఒక్కప్పుడు లవర్ బాయ్ టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ అందుకున్న సిద్ధార్థ్ తరువాత వరుస ఫ్లాప్ లతో తెలుగు సినిమాకు దూరమయ్యాడు. కోలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తున్నా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని సొంత నిర్మాణ సంస్థ లో ఓ హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒకే సారి తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే కోలీవుడ్, బాలీవుడ్ లలో రిలీజ్ అయిన సిద్దార్థ్ హర్రర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను శుక్రవారం టాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారు. గృహం పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు సిద్ధూ. తన సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా తానే సెన్సార్ బోర్డ్ ను కోరాడాట. అన్ని సినిమాలు కుటుంబ సమేతంగా చూడాల్సిన అవసరం లేదన్న సిద్ధూ. ఈ సినిమాకు 18 ఏళ్ల పై బడినవారే రావాలని కోరాడు. అంతేకాదు గుండె జబ్బులు ఉన్నవారు కూడా తన సినిమా చూడవద్దని తెలిపాడు. -
అమ్రేశ్ సంగీతం ఆండ్రియా గీతం
తమిళసినిమా: యువ కెరటం అమ్రేశ్ తొలుత నటుడిగా రంగప్రవేశం చేసినా, ఇప్పుడు సంగీత దర్శకుడిగా దూసుకుపోతున్నారు. తాను హీరోగా నటించిన చిత్రంతోనే సంగీతదర్శకుడిగానూ పరిచయమైన ఈయన ప్రస్తుతం సంగీత దర్శకుడిగా చేతి నిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్, ఇటీవలే సెట్ పైకి వెళ్లిన చార్లిచాప్లిన్–2 చిత్రాలతో పాటు అరవిందస్వామి, అమలాపాల్ జంటగా నటిస్తున్న భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది సిద్ధిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన మలయాళంలో మమ్ముట్టి, నయనతార హీరోహీరోయిన్లుగా తెరకెక్కించిన సక్సెస్ఫుల్ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. కాగా భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రంలో అమ్రేశ్ సంగీత బాణీలు కట్టిన ఒక పాటను సంచలన నటి ఆండ్రియా పాడడం విశేషం. నటి ఆండ్రియా చాలా అరుదుగానే పాడుతుంటారు. అదీ తన ఆ పాట హత్తుకుంటేనే పాడడానికి అంగీకరిస్తారు. అంటే అమ్రేశ్ కట్టిన బాణీలు నచ్చే తను భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రంలో పాటను పాడారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్ర ఆడియోను ట్రిపుల్ రికార్డ్స్ సంస్థ సొంతం చేసుకుని ఈ నెల 30వ తేదీన చిత్ర గీతాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. -
సెన్సార్ కారణంగా మరో సినిమా వాయిదా
ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్‌గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్దార్థ్ తరువాత వరుస ఫ్లాప్ లతో టాలీవుడ్ కు దూరమయ్యాడు. ఇటీవల ఎక్కువగా తమిళ సినిమాల్లో మాత్రమే నటిస్తూ వస్తున్న సిద్ధూ లాంగ్ గ్యాప్ తరువాత తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు తెర మీద హిట్ ఫార్ములాగా పేరు తెచ్చుకున్న హర్రర్ జానర్లో గృహం పేరుతో తెరకెక్కిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఈ సినిమాను తమిళ వర్షన్ పాటు ఈ నెల 3న రిలీజ్ చేయాలని భావించారు. అయితే తెలుగునాట ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరక్కపోవటంతో వారంపాటు వాయిదా వేసి నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ 10న కూడా ఈ సినిమా రిలీజ్ కావటంలో కారణాలు వెల్లడించకపోయినా గృహం సినిమా వాయదా పడినట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్టుగా తెలిపారు. చాలా రోజులుగా తెలుగులో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సిద్దార్థ్ ఈ సినిమాతో ఆకట్టుకుంటాడేమో చూడలి. It pains us that #GRUHAM our Telugu film is still waiting for its censor certificate. We will try to release the film on November 17. #HOPE — Siddharth (@Actor_Siddharth) 8 November 2017 -
సెన్సార్ సర్టిఫికేషన్‌పై విశాల్ కామెంట్స్
ఈ శుక్రవారం డిటెక్టివ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విశాల్, ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సెన్సార్ సర్టిఫికేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ సినిమా సెన్సార్ ను ముంబైకి మార్చేయటంతో సెన్సార్ సర్టిఫికేట్ సాధించటం డిగ్రీ సర్టిఫికేట్ సాధించడమంత కష్టంగా మారిందన్నారు. అదే సమయంలో తమిళ్ తెలుగు భాషల్లో తమ సినిమాను ఒకేసారి రిలీజ్చేయలేకపోవటానికి కారణాలు కూడా తెలిపారు. తమిళ్ లో తమ సినిమా రిలీజ్ అయ్యే సమయంలో తెలుగులో పెద్ద హీరోల సినిమాలు బరిలో ఉంటున్నాయని అందుకే ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేయటం కుదరటం లేదని తెలిపారు. సెన్సార్ అయిన సినిమా విషయంలో కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం పై కూడా విశాల్ స్పందించారు. సినిమాకు సెన్సార్ సెంట్రల్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తరువాత కొంత మంది సినిమాలోని డైలాగ్స్‌ను కట్ చేయమనటం అన్యాయం అన్నారు. అలా కట్ చేసుకుంటూ వెళితే సెన్సార్ సర్టిఫికేట్ తప్ప చూపించడానికి ఏమి మిగలదని ఆవేదన వ్యక్తం చేశారు. జి హరి దర్శకత్వంలో తెరకెక్కిన డిటెక్టివ్ సినిమాలో ఆండ్రియా హీరోయిన్ గా నటించింది. తమిళ నటుడు ప్రసన్న మరో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే ఆలోచన ఉన్నట్టుగా వెల్లడించారు విశాల్. -
సిద్ధార్థ్‌తో కలిసి బాలీవుడ్‌కు..
సాక్షి, హైదరాబాద్: ఆండ్రియా రూటే సెపరేట్ అనవచ్చు. చర్చనీయాంశ పాత్రల్లో నటించే ధైర్యం ఉన్న అతికొద్దిమంది నటీమణుల్లో ఈ భామ ఒకరు. దర్శక నిర్మాతలు కూడా ఈ అమ్మడిని సాదాసీదా హీరోయిన్ పాత్రలకు ఎంపిక చేయరు. తాజాగా ధనుష్ హీరోగా నటిస్తున్న వడచెన్నై చిత్రంలో వేశ్యగా విభిన్న పాత్రలో కనిపించనుందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన తుప్పరివాలన్ చిత్రంలో నెగిటివ్ పాత్రలో నటించిన ఆండ్రియా తాజాగా సిద్ధార్థ్‌తో కలిసి బాలీవుడ్లో మెరవడానికి రెడీ అవుతోంది. ఇక సిద్దూ కూడా దక్షిణాదిలో కనిపించి చాలా కాలమైంది. ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచాడు. యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్‌తో కలిసి ఒక ఫ్యామిలీ ఎంటర్టెయినర్ మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నాడు. ఈ నెలలోనే సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. దీంతోపాటు సిద్ధార్థ్ మరో చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. హిందీ దర్శకుడు మిలింద్‌రావ్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి 'ది హౌస్ నెక్ట్స్ డోర్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌కు జంటగా నటి ఆండ్రియా నటించనుంది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది హర్రర్ కథా చిత్రంగా ఉంటుందని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సిద్ధార్థ్ పేర్కొన్నారు. మొత్తం మీద నటి ఆండ్రియా ఈ చిత్రంతో కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ సినీ థియేటర్లలో చక్కర్లు కొట్టడానికి రెడీ అవుతోందన్న మాట. -
వేశ్య పాత్రలో ఆండ్రియా
వేశ్య లాంటి పాత్రలో నటించడానికి హీరోయిన్లు ఒకప్పుడు సంకోచించేవారు. అలాంటిది ఇప్పుడు అగ్రనాయికలు సైతం సై అంటున్నారు. వేదం చిత్రంలో క్రేజీ నటి అనుష్క వేశ్య యువతిగా నటించి మెప్పించారు. అదే విధంగా శ్రీయ, చార్మీలాంటి వారు అలాంటి పాత్రలు ధరించడానికి వెనుకాడలేదు. తాజాగా నటి ఆండ్రియా వేశ్య పాత్రకు సిద్ధం అవుతున్నారు. బాలీవుడ్ నుంచి దక్షిణాదికి దిగుమతి అయిన ఈ భామ ఇక్కడ సంచలన నటిగా పేరొందారు. విశ్వరూపం చిత్రంలో విశ్వనటుడు కమలహాసన్‌కు జంటగా నటించిన ఆండ్రియా ప్రస్తుతం తరమణి చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు. తాజాగా ధనుష్ కథానాయకుడిగా నటించనున్న వడచెన్నై చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇందులో ధనుష్‌కు జంటగా సమంత ఇప్పటికే ఎంపికయ్యారు. వీరిద్దరు ఉత్తర చెన్నై వాసులుగా జీవించడానికి రెడీ అవుతున్నారు.కాగా ఇందులో ఆండ్రియా వేశ్య పాత్రను పోషించనున్నారని తెలిసింది. ఇది చాలా బలమైన పాత్ర అని, ఆండ్రియాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని చిత్ర యూనిట్ అంటోంది. వేట్రిమారన్ కథ, కథనం, దర్శకత్వం వహించనున్న ఈ వడచెన్నై చిత్రం జూన్ నెల 15న ప్రారంభం కానుంది. ప్రస్తుతం కొడి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ధనుష్ తదుపరి నటించే చిత్రం వడచెన్నైనే అవుతుంది. -
ఛాలెంజ్ మూవీ స్టిల్స్
-
ఎవరైతే నాకేంటి!
వృత్తిపరంగా, వ్యక్తిగతంగాగాని నటి ఆండ్రియా పోకడే వేరు. తన ఇష్టానుసారం నడుచుకునే ఆమె మనస్తత్వమే వేరు. ఎవరేమనుకుంటే నా కేంటి అన్నట్లుగా ఉంటుందామె ప్రవర్తన. ఉత్తమవిలన్ చిత్ర యూనిట్ ఆండ్రియా నుంచి అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. చివరికి కమలహాసన్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. అసలా కథేంటో చూద్దామా? కమలహాసన్ నటించిన చిత్రం ఉత్తమవిలన్. ఇందులో పూజాకుమార్, ఆండ్రియా ప్రధాన హీరోయిన్లు. చిత్రం పలు ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొని ఎట్టకేలకు శుక్రవారం తెరపైకి రానుంది. చిత్ర ప్రచారంలో కమలహాసన్ ముఖమే అధికంగా కనిపిస్తోంది. మరీ అయితే నటి పూజాకుమార్ ఫొటో అక్కడక్కడా కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఆ చిత్రంలో మరో హీరోయిన్ అయిన ఆండ్రియాకు సహజంగానే మండింది. సరే సమయం వచ్చినప్పుడు ఆ ఆగ్రహ మంటల్ని బయటకు వెళ్లకక్కుదాం అని కాచుకూర్చున్నారు. అలాంటి సమయం రానే వచ్చింది. ఉత్తమవిలన్ చిత్ర విడుదల దగ్గరపడడంతో చిత్ర యూనిట్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా నటి ఆండ్రియాను ఆహ్వానించారు. ఆమె నుంచి చిత్ర యూనిట్‌కు నేను రాను పొమ్మనే సమాధానమే వచ్చింది. ఎంతగా ప్రయత్నించినా ఆండ్రియాససేమిరా అనడంతో చిత్ర వర్గాలు కమలహాసన్‌తో చెబుతామన్నారు. కమల్‌తోనే కాదు ఎవరితోనైనా చెప్పుకోండి అంటూ ఆండ్రియా ఖరాఖండిగా చెప్పారు. దీంతో చేసేదిలేక చిత్రవర్గాలు కమల్‌కు ఆండ్రియాపై ఫిర్యాదు చేయక తప్పలేదు. దీంతో రంగంలోకి దిగిన కమల్ ఆండ్రియాకు నచ్చ చెప్పారని కోలీవుడ్ టాక్. -
డిఫెరెంట్ పాత్రలో ఆండ్రియా
చాలా బోల్డ్‌గా నటించే కథా నాయికల్లో నటి ఆండ్రియా ఒకరు. అభినయమే కాదు అందాలారబోతకు సరిలేరు నాకెవ్వరూ అనేంతగా పేరు తెచ్చుకున్న నటి ఆమె. ఆయిరత్తిల్ ఒరువన్, అరణ్మణై వంటి పలు చిత్రాల్లో తనదైన శారీరక భాషతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బూటీ తాజాగా తరమణి చిత్రంతో తనలోని బహుపార్వ్సాల్ని ఆవిష్కరించ నున్నారట. నగర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇంతవరకు తెరపై చూడనటువంటి పాత్రలో ఆండ్రియా కనిపించనున్నారట. ధనం, మోహం, కామం ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే తరమణి చిత్ర కథలో ప్రేమ అంతర్లీనంగా ఉంటుందని నటి ఆండ్రియ మూడు డిఫరెంట్ కోణాల్లో ఈ చిత్రంలో కనిపించనున్నారని ఆ చిత్ర దర్శకుడు రామ్ తెలిపారు. తంగమాన్గళ్ చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం త్వరలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు రామ్తదుపరి చిత్రంలో కూడా ఆండ్రియానే హీరోయిన్ అట. -
సంగీతంలో రాణిస్తా
ఒక్కొక్కరు ఒక్కో రంగంలో ప్రతిభ చాటుకుంటారు. కొందరు మాత్రం పలురంగాల్లో సత్తా చాటాలని ఆశిస్తుంటారు. ఈ రెండో కోవకు చెందింది ఆండ్రియా. నటిగా ఈ సుందరి ప్రతిభ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బోల్డ్ గర్ల్‌లో మంచి గాయని కూడా దాగి ఉన్న విషయం తెలిసిందే. ఆయిరత్తిల్ ఒరువన్ లాంటి పలు చిత్రాల్లో ఈ బ్యూటీ పాడిన గీతాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. ఇలా నటిగా, గాయనిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటున్న ఆండ్రియా ఇప్పుడు తనలోని మూడో ముఖాన్ని చూపించాలని తపిస్తున్నారు. సంగీత దర్శకురాలిగా రాణిస్తానని చెబుతున్నారు. తన కోరిక కూడా అదేనని స్పష్టం చేశారు. ఈ కారణంగానే ఆండ్రియా యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారని, అయితే అది మరో రకంగా విమర్శలకు తావిచ్చిందనే టాక్ కూడా ఉంది. ఏదేమయినా ఆ ప్రయత్నం బెడిసికొట్టినా ఆండ్రియా సంగీత దర్శకురాలవ్వాలనే లక్ష్యంగా సాగిపోతున్నారు. ఆ మధ్య తను నటించిన తరమణి చిత్రం కోసం ఒక పాటను ఆంగ్లంలో రాసి తానే ట్యూన్ కట్టారు. రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ఆండ్రియా ఆసక్తిని గ్రహించి ట్యూన్లు కూడా బాగుండడంతో ఆ చిత్రంలో పొందుపరచడానికి యువన్ శంకర్ రాజా అంగీకరించారట. ఇప్పుడీ పాటనే దర్శకుడు రామ్ తన చిత్ర ప్రమోషన్ కోసం వాడుకోవడానికి సిద్ధం అవుతున్నారు. షోల్ అప్ తరణి.... అనే ఆ పాటను నటుడు కమల్ హాసన్ విడుదల చేశారు. పనిలో పనిగా ఆండ్రియా ట్యూన్స బాగున్నాయనే కితాబు కూడా ఇచ్చారు. అలా ఆయన ప్రోత్సహించడంతో ఆండ్రియా ఖాళీ సమయాల్లో తన సెల్ఫోన్లోనే మరిన్ని ట్యూన్స్ కట్టి రికార్డ్ చేసుకున్నారట. ఈ పాటల ఆల్బమ్‌ను పలువురు సినీ ప్రముఖులకు అందించారట. అలా అందుకున్న వారిలో దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా ఉన్నారట. ఆయనకు ఆండ్రియా ట్యూన్ తెగనచ్చేయడంతో ఆమెను సంగీత దర్శకురాలిగా పరిచయం చేసే పనిలో ఉన్నారని సమాచారం. -
లవ్ ఇన్ లండన్ మూవీ న్యూ స్టిల్స్
-
జయ్‌తో ఆండ్రియా రొమాన్స్
తెరవెనుక సంగీత దర్శకుడు అనిరుధ్‌తో రొమాన్స్ చేసిన ఆండ్రియా తాజాగా తెరపై యువ నటుడు జయ్‌తో ఫుల్‌గా రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. జయ్ నటించిన తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం త్వరలో తెరపైకి రానుంది. జయ్ తదుపరి చిత్రానికి రెడీ అయిపోయారు. ఈయన నటిస్తున్న చిత్రానికి వలియవన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో జయ్ సరసన నటి ఆండ్రియా హీరోయిన్గా జతకట్టడం విశేషం. వీరి కాంబినేషన్లో రూపొం దుతున్న ఈ చిత్రానికి ఎంగేయుం ఎప్పోదుం చిత్రం ఫేమ్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, వలియవన్ తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. ఇం దులో యాక్షన్ కంటే రొమాన్సే అధికంగా ఉంటుందన్నారు. జయ్‌తో ఇంతకు ముందే ఎంగేయుం ఎప్పోదుం చిత్రంలో కలిసి పని చేశానని, అయితే ఆండ్రియా ఈ చిత్ర కథకు అవసరం అయ్యాయని వివరించారు. ఈ పాత్రకు ఆమె మినహా మరొక నటి గురించి ఆలోచన లేదన్నారు. ఈ చిత్రాన్ని ఎస్.కె.స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్నట్లు దర్శకుడు శరవణన్ తెలిపారు. ఆండ్రియా ఇప్పటికే జాతీయ అవార్డు గ్రహీత రామ్ దర్శకత్వంలో తరమణి చిత్రం లోను, కమల్ హాసన్ సరసన ఉత్తమ విలన్ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.