చెన్నై : నటి ఆండ్రియా ఒక సంచలనం. బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ లేడీ. అంతే కాదు మల్టీపుల్ టాలెంటెండ్ నటి. ఈమెలో మంచి గాయని. ఇక గీతరచయిత కూడా. ఆ మధ్య ఆంగ్లంలో పాట రాసి, తనే ట్యూన్ కట్టి ఆల్బమ్ విడుదల చేసింది. ఇక నటిగా ఎలాంటి పాత్రనైనా ఛాలెంజ్‌గా తీసుకుని నటించే సత్తా కలిగింది. అయితే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించకుండా, చాలా సెలెక్టెడ్ పాత్రల్లోనే నటిస్తూ తన కంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్న నటి ఆండ్రియా. ఆ మధ్య వడచెన్నైలో ఏ హీరోయిన్ చేయడానికి సాహసించని వైవిధ్యభరిత పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఆండ్రియా మళ్లీ తెరపై కనిపించలేదు. అయితే ఒక వివాహితుడిని నమ్మి శారీరకంగానూ, మానసికంగానూ బాధింపునకు గురయ్యానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొని సంచలనం కలిగించింది. అదేవిధంగా మళ్లీ మామూలు మనిషిని కావడానికి వైద్యం పొందినట్లు చెప్పింది. కాగా అలాంటి సంచలన నటి ఆండ్రియా తాజాగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ అమ్మడు యువ నటుడు సిబిరాజ్‌కు జంటగా నటిస్తోంది. ఇందులో మరో హీరోయిన్‌గా నటి అతుల్యరవి నటిస్తోంది. 2012లో మధుబాన కడై చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కమల్ కన్నన్ ఏడేళ్ల తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా ఈ చిత్రంతో నటి ఆండ్రియా కొత్తగా కనిపిస్తుందంటున్నారు. ఆమె పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. చూద్దాం ఈ చిత్రం ఆండ్రియా కెరీర్‌కు ఎంత వరకూ దోహదపడుతుందో.
Comments
Please login to add a commentAdd a comment