
హీరోయిన్, సింగర్ ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మణుసీ. ఇంతకుముందు అరం అనే విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన గోపీ నయినార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తన గ్రాస్‌రూట్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈయన ఒక పక్క దర్శకుడిగా విజయవంతమైన చిత్రాలు చేస్తూనే మరోపక్క నిర్మాత గానూ వైవిధ్య భరిత కథా చిత్రాలను నిర్మిస్తున్నారు.
ఇంతకుముందు ఈయన ఉదయం ఎన్‌హెచ్ 4, పొరియాలన్, కొడి, లెన్స్ అన్నక్కు జై వంటి పలు సక్సెస్ చిత్రాలను నిర్మించారు. అలా 2022లో ఈయన బ్యానర్‌లో ఆండ్రియా నటించిన అమో ల్ మేలే పణితుళి ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం నటుడు సూరి కథానాయకుడిగా గరుడన అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే మణుసీ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇందులో ఆండ్రియా నటన కట్టిపడేస్తోందంటున్నారు ఫ్యాన్స్.
Comments
Please login to add a commentAdd a comment