Sibiraj
-
హాట్‌స్టార్‌లో ఆండ్రియా 'వట్టం', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నటుడు సిబిరాజ్, ఆండ్రియా, అతుల్య రవి హీరో హీరోయిన్లుగా నటింన చిత్రం వట్టం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతలు ఎస్ ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మించిన తాజా చిత్రం ఇది. కమలకన్నన్ దీనికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 29వ తేదీన నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ.. సిబిరాజ్, ఆండ్రియా, అతుల్య రవి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారన్నారు. సిబిరాజ్ మాట్లాడుతూ.. ఓటీటీలో విడుదలవుతున్న తన తొలి చిత్రం ఇదేనని తెలిపారు. చిత్ర నిర్మాత ఎస్సార్ ప్రభు మాట్లాడుతూ.. జీవితంలో ప్రేమికుల మధ్య సమస్యలు తలెత్తినా, ఆ తర్వాత అవి సమసిపోతాయని అలాంటి ఇతివృత్తంతో కూడిన చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో హీరోగా ఎవరైతే బాగుంటుంది అన్న ఆలోచించినప్పుడు సిబిరాజ్ గుర్తొచ్చారని చెప్పారు. ఆండ్రియా, అతుల్య రవి పాత్రల్లో ఒదిగిపోయారని అన్నారు. చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్ పదివారాల తర్వాతే ఓటీటీలో పెద్ద సినిమాలు -
ఓటీటీకి రెడీ అవుతున్న ‘వట్టం’
ఇటీవల ఓటీటీ ప్రభావం చాలా పెరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే అది నిర్మాతలకు ఓ వరంగా మారింది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఓ2 చిత్రం, కమలహాసన్ కథానాయకుడుగా నటించిన విక్రమ్ చిత్రాలు ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతున్నాయి. అదే బాటలో ఇప్పుడు వట్టం చిత్రం కూడా ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. నటుడు శిబిరాజ్ కథానాయకుడుగా నటించిన ఇందులో ఆండ్రియా, అతుల్యరవి నాయికలుగా నటించారు. శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు నిర్మించారు. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ వట్టం విభిన్న అంశాలతో కూడిన థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. 24 గంటలలో ముగ్గురు వ్యక్తులు ఎదుర్కొన్న సమస్యలు, వాటి వల్ల వారి జీవితాలు ఎలా మారాయి..? అనే అంశాలతో చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. అందరిని అలరించేలా తెరకెక్కించినట్లు తెలిపారు. నటుడు శిబిరాజ్ మాట్లాడుతూ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. వైవిధ్య భరిత కథా చిత్రాలు నిర్మించే డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థలో చిత్రం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఒక సామాన్యుడి పాత్రలో నటించాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, ఈ చిత్రంతో ఆ కల నెరవేరిందని తెలిపారు. చిత్రంలో నటి ఆండ్రియ, అతుల్య రవి పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. -
మూవీ సక్సెస్.. దర్శకుడికి మాయోన్ మూవీ నిర్మాత సర్ప్రైజ్ గిఫ్ట్
సాక్షి, చెన్నై: మాయోన్ చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి తేలుతోంది. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ మొళి మాణిక్యం కథణం, నిర్మాణ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రంలో శిబిరాజ్, తాన్యా రవిచంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. నవ దర్శకుడు కిషోర్ దర్శకత్వం వహించారు. శిలల స్మగ్లింగ్ ప్రధాన ఇతివృత్తంగా ఫాంటిసీ సన్నివేశాలతో రూపొందిన చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలై విమర్శకుల ప్రశంసలతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి తేలుతోంది. గురువారం చిత్ర యూనిట్ చెన్నైలో కేక్ కట్ చేసి వేడుకగా సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత.. దర్శకుడు కిషోర్‌కు బంగారు గొలుసును కానుకగా అందించారు. కాగా ఈ చిత్రం 7వ తేదీన తెలుగులోనూ విడుదల కానుందని ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు. అదే విధంగా మాయోన్కు సీక్వెల్‌ను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. -
నా కొడుకును ఆదరించండి.. ‘కట్టప్ప’ సత్యరాజ్ విజ్ఙప్తి
చాలా కాలంగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఏం ఇచ్చినా నేను మీ రుణం తీర్చుకోలేను. ఇప్పటి వరకు నన్ను ఆదరించినట్లే.. మంచి కంటెంట్ ఉన్న ‘మయోన్’చిత్రం ద్వారా పరిచయమవుతున్న నా కొడుకు శిభి సత్యరాజ్‌ను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా’అని ప్రముఖ నటుడు ‘కట్టప్ప’ సత్యరాజ్ అన్నారు. ఆయన కొడుకు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం “మాయోన్” ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ‘మాయోన్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..ఈ చిత్ర ట్రైలర్, టీజర్ చాలా బాగున్నాయి. ‘మయోన్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయ మవుతున్న సిబి చాలా చక్కగా నటించాడు. దర్శక, నిర్మాతలు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినా ఇష్టపడి చేశారు.అందుకే సినిమా బాగా వచ్చింది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి’ అన్నారు. ‘మయోన్ వంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు’అని హీరో శిబి సత్యరాజ్ అన్నారు . ‘మా చిత్రం గురించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ట్వీట్ చేయడం సంతోషంగా ఉంది. పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ‘మాయోన్’చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా ఆదరిస్తారు అన్నారు నిర్మాత శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, తిరుపతి రెడ్డి, హ్యుమన్ రైట్స్ సభ్యురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు. -
ఏదో ఏదో ఏదో వెతికే నయనం.. పాట విన్నారా?
“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మాయోన్”. ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. “మాయోన్” చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి 'ఏదో ఏదో ఏదో.. వెతికే నయనం.. చేతికి అందేదాకా ఆగదు పయనం" అను పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'నాకు మాస్ట్రో ఇళయరాజా పాటలంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ద్వారా ఆయనను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. అయన అభిమానినైన నేను అయన సంగీత సారధ్యంలో సత్య ప్రకాష్ ధర్మార్, శ్రీనిషా జయశీలన్ పాడిన "ఏదో ఏదో ఏదో వెతికే నయనం చేతికి అందేదాకా ఆగదు పయనం" పాటకు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తుండగా, తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది' అన్నారు. చదవండి: ఆ వార్తలను ఖండించిన సోనాలి బింద్రె, నాకావసరం లేదు.. మిస్ ఇండియా పోటీ నుంచి వైదొలిగిన శివానీ -
సరికొత్తగా మూవీ ప్రమోషన్స్.. 40 రోజులపాటు ప్రచార రథయాత్ర..
చెన్నై సినిమా: మాయోన్ చిత్ర ప్రచారానికి వినూత్నంగా(విష్ణుమూర్తి శేష శయనం ప్రతిభతో) రథయాత్రను ప్రారంభించారు. నటుడు సిబిరాజ్, తాన్యా జంటగా నటించిన చిత్రం మాయోన్. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ పతాకంపై అరుణ్ మొళి మాణిక్యం కథను అందించి నిర్మించిన చిత్రం ఇది. ఎన్.కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రచార యాత్ర విశేషపూజ, హోమాలతో ఆదివారం ప్రారంభమైంది. ఇక రామాపురంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార రథయాత్రను రాష్ట్రవ్యాప్తంగా 40 రోజులపాటు నిర్వహించనున్నట్లు నిర్మాత తెలిపారు. దైవం, సైన్స్, విగ్రహాల స్మగ్లింగ్, గుప్తనిధులవేట వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందించిన చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. డావిన్సీ కోడ్ వంటి చిత్రాలు తనకు చాలా ఇష్టమని, ఆ తరహా చిత్రాల్లో నటించాలనే కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని నటుడు సిబిరాజ్ పేర్కొన్నారు. -
పలు వాయిదాల అనంతరం రిలీజ్‌కు రెడీ అయిన రంగా మూవీ
సాక్షి, చెన్నై: నటుడు సిబిరాజ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం రంగా. నిఖిలా విమల్ నాయికగా, డీఎల్ వినోద్‌ను దర్శకుడిగా బాస్ మూవీ పతాకంపై విజయ్ కె.చెల్లయ్య నిర్మించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 13వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. శనివారం సాయంత్రం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు సిబిరాజ్ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నటించడానికి సిద్ధమయ్యానన్నారు. చదవండి: బాలీవుడ్ నన్ను భరించలేదు, అక్కడ సినిమాలు తీసి టైం వేస్ట్ చేసుకోను షూటింగ్ అధికభాగం కశ్మీర్లో నిర్వహించనున్నట్లు చెప్పారన్నారు. కథ బావుంది గానీ.. కొత్త దర్శకుడు ఎలా తెరకెస్తారన్న సంశయం కలిగిందన్నారు. దీంతో కొన్ని రోజులు చెన్నైలో షూటింగ్ చేసి దర్శకుడి ప్రజెంటేషన్ చూసిన తర్వాత కశ్మీర్‌కి వెళ్దామని నిర్మాతకు చెప్పానన్నారు. కానీ కథకు తగిన వాతావరణం ఇప్పుడు కశ్మీర్లో ఉంటుందని అక్కడే షూటింగ్ చేద్దామని ఆయన చెప్పారన్నారు. -
సిబిరాజ్‌కు జంటగా నందితాశ్వేత
నటి నందితాశ్వేతాకు నటుడు సిబిరాజ్‌తో జత కట్టే చాన్స్ వచ్చింది. అట్టకత్తి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ అమ్మడికి ఆ చిత్రం హిట్ అయ్యి మంచి పేరే తెచ్చి పెట్టింది. ఆ తరువాత పలు అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు తెలుగులోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. కానీ ఎందుకో అందం కూడా కావలసినంత ఉన్నా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోతోంది. అంతేకాదు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే అవకాశాలను రాబట్టుకోలేకపోతోంది. ఇటీవల ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన దేవీ 2 చిత్రంలో ఒక హీరోయిన్గా కనిపించింది. ఈ అమ్మడు చివరిగా నటించిన చిత్రం 7. ఈ ద్విభాషా చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తాజాగా నటుడు సిబిరాజ్‌తో జతకట్టే అవకాశం తలుపు తట్టింది. ఇంతకుముందు సిబిరాజ్ హీరోగా సత్య చిత్రాన్ని తెరకెక్కించిన ప్రదీప్‌కృష్ణమూర్తి తాజాగా ఆయన హీరోగానే మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో సిబి రాజ్ తండ్రి సత్యరాజ్ కూడా నటించనున్నారు. ఇది కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన కావలుదారి చిత్రానికి రీమేక్. దీన్ని జీ.ధనుంజయన్ నిర్మించనున్నారు. చాలా కాలం తరువాత తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇందులో నటి నందితాశ్వేత జర్నలిస్ట్ పాత్రలో నటించనుందట. చిత్రంలో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలాంటివేవీ ఉండవట. అయితే కథలో చాలా ముఖ్యమైన పాత్ర అని చిత్ర వర్గాలు అంటున్నారు. -
మళ్లీ వస్తున్న ఆండ్రియా
చెన్నై : నటి ఆండ్రియా ఒక సంచలనం. బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ లేడీ. అంతే కాదు మల్టీపుల్ టాలెంటెండ్ నటి. ఈమెలో మంచి గాయని. ఇక గీతరచయిత కూడా. ఆ మధ్య ఆంగ్లంలో పాట రాసి, తనే ట్యూన్ కట్టి ఆల్బమ్ విడుదల చేసింది. ఇక నటిగా ఎలాంటి పాత్రనైనా ఛాలెంజ్‌గా తీసుకుని నటించే సత్తా కలిగింది. అయితే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించకుండా, చాలా సెలెక్టెడ్ పాత్రల్లోనే నటిస్తూ తన కంటూ ఒక ఇమేజ్ను సంపాదించుకున్న నటి ఆండ్రియా. ఆ మధ్య వడచెన్నైలో ఏ హీరోయిన్ చేయడానికి సాహసించని వైవిధ్యభరిత పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఆండ్రియా మళ్లీ తెరపై కనిపించలేదు. అయితే ఒక వివాహితుడిని నమ్మి శారీరకంగానూ, మానసికంగానూ బాధింపునకు గురయ్యానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొని సంచలనం కలిగించింది. అదేవిధంగా మళ్లీ మామూలు మనిషిని కావడానికి వైద్యం పొందినట్లు చెప్పింది. కాగా అలాంటి సంచలన నటి ఆండ్రియా తాజాగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ అమ్మడు యువ నటుడు సిబిరాజ్‌కు జంటగా నటిస్తోంది. ఇందులో మరో హీరోయిన్గా నటి అతుల్యరవి నటిస్తోంది. 2012లో మధుబాన కడై చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కమల్ కన్నన్ ఏడేళ్ల తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా ఈ చిత్రంతో నటి ఆండ్రియా కొత్తగా కనిపిస్తుందంటున్నారు. ఆమె పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. చూద్దాం ఈ చిత్రం ఆండ్రియా కెరీర్‌కు ఎంత వరకూ దోహదపడుతుందో. -
రేంజర్‌గా సిబిరాజ్
యువ నటుడు సిబిరాజ్ ఇప్పుడు రేంజర్‌గా మారనున్నారు. అవును ఈయన నటించనున్న నూతన చిత్రానికి రేంజర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన ఆరా సినిమాస్ సంస్థ అధినేత మహేశ్.జీ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇంతకుముందు బర్మా, రాజారంగూష్కీ, జాక్సన్‌దురై చిత్రాలను తెరకెక్కించిన ధరణీధరణ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను మంగళవారం చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్.జీ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది మహారాష్ట్రలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించనున్న చిత్రం అని చెప్పారు. ఈ మధ్య మహారాష్ట్రలోని యావత్మాల్ అనే జిల్లాలో ఆవ్నీ అనే పులి మనుషులను ఎలా బలి తీసుకున్నదన్న విషయం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందేనన్నారు. ఆ సంఘటను ఆధారంగా చేసుకుని రేంజర్ పేరుతో చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో సిబిరాజ్ కథానాయకుడిగా నటించనున్నారని, ఆయనకు జంటగా నటి రమ్యానంబీశన్, మధుశాలిని నటించనున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు మనుషులపై దాడి చేసిన మృగాల ఇతివృత్తంతో పలు చిత్రాలు వచ్చాయని, అయితే అవన్నీ కల్పిత కథా చిత్రాలని అన్నారు. తమ చిత్రం మన దేశంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందనున్న చిత్రం అని చెప్పారు. ఈ చిత్రానికి సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్ అధికంగా ఉంటుందని చెప్పారు. అందుకు హాలీవుడ్ సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు ధరణీధరణ్ కథ, కథనాన్ని వైవిధ్యంగా తీర్చిదిద్దారని చెప్పారు. థ్రిల్లర్‌తో కూడిన కమర్శియల్ కథా చిత్రంగా రేంజర్ ఉంటుందన్నారు. ఈ చిత్రానికి నటుడు సిబిరాజ్ పక్కాబలంగా ఉంటారని అన్నారు. ఆయన ఇమేజ్ను మరింత పెంచేదిగా రేంజర్ చిత్రం ఉంటుందని అన్నారు. రేంజర్ ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తుందన్నారు. చిత్ర షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో నటించే ఇతర నటీనటుల ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని, అదే విధంగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. అరోల్ కరోలి సంగీతాన్ని, కల్యాణ వెంకట్రామన్ ఛాయాగ్రహణం అందించనున్నారని నిర్మాత తెలిపారు. -
షూటింగ్ మొదలైన రోజే వివాదం!
వాల్టర్ పేరు వినగానే నటుడు సత్యరాజ్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించిన సూపర్‌హిట్ చిత్రం వాల్టర్ వెట్రివేల్ గుర్తుకు వస్తుంది. సత్యరాజ్ వారసుడు శిబిరాజ్ వాల్టర్‌లో హీరోగా నటిస్తున్నారు. 11–11 సినిమా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అన్బు అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. కాగా నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా చిత్రం ఫేమ్ నటి శిరిన్ కాంచ్వాలా సిబిరాజ్‌తో రొమాన్స్ చేయనున్నారు. మరో ముఖ్య పాత్రలో దర్శకుడు సముద్రకని నటిస్తున్నారు. కుంభకోణం నేపథ్యంలో యాక్షన్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం శుక్రవారం చెన్నైలో ప్రారంభం అయింది. కాగా ఇదే రోజున ప్రముఖ ఫైనాన్సియర్, నిర్మాత శింగారవేలన్ వాల్టర్ పేరుతో విక్రమ్‌ప్రభు, అర్జున్‌లను నటింపజేస్తూ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి అన్బరసన్ దర్శకత్వం వహించనున్నారని పేర్కొన్నారు. వాల్టర్ చిత్ర కథ, టైటిల్ తనకు చెందినవని, వాటిని తన అనుమతి లేకుండా వాడితే సంబంధిత దర్శక, నిర్మాతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇలా వాల్టర్ చిత్రం ఆదిలోనే వివాదాంశంగా మారడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. -
డ్రీమ్ వారియర్ సంస్థలో సిబిరాజ్
తమిళ సినిమా : ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థగా రాణిస్తున్న డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ సంస్థలో యువ నటుడు సిబిరాజ్ నటించడానికి రెడీ అవుతున్నారు. కార్తీ హీరోగా కాష్మోరా, ధీరన్ అధికారం ఒండ్రు వంటి భారీ చిత్రాలతో పాటు జోకర్, అరివి వంటి సంచలన విజయాలను సాధించిన చిత్రాలను నిర్మించిన సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్. ఈ సంస్థ ప్రస్తుతం సూర్య హీరోగా ఎన్జీకే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సత్య వంటి సక్సెస్ఫుల్ చిత్రంలో నటించిన నటుడు సిబిరాజ్ ప్రస్తుతం రంగా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సిబిరాజ్‌కు జంటగా నిఖిలా విమల్ నటిస్తోంది. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఇలా ఉండగా సిబిరాజ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు మధుభాన కడై చిత్రాన్ని తెరకెక్కించిన కమల్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సంధించిన మధుపాన కడై చిత్రం ఆయనకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఈ చిత్రం 2012లో విడుదలైంది. దాదాపు ఆరేళ్ల తరువాత కమల్‌కన్నన్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. సిబిరాజ్ హీరోగా నటించనున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఆర్ఎస్.ప్రకాశ్, ఆర్ఎస్.ప్రభు నిర్మించనున్నారు. చిత్ర షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
పాడడమే నాకిష్టం
తమిళసినిమా: నటి రమ్యానంబీశన్ది మంచి ఫిజిక్. చూడ సక్కని అందం. మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ మలయాళీ బ్యూటీకి తమిళంలో పిజ్జా, సేతుపతి వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. అయినా ఎందుకో తనకు పాడడం అంటేనే చాలా ఇష్టం అంటోంది. ఈ ముద్దుగుమ్మ తమిళంలో తొలిసారిగా పాడిన ఫైఫైఫై అనే పాట యువతను ఉర్రూతలూగించింది.అక్కడి నుంచి గాయనిగా రాణించాలన్న నిర్ణయానికి వచ్చేసిందట. ఇప్పటికే మాతృభాషలో 20 వరకూ పాటలు పాడేసిన రమ్యానంబీశన్‌కు కోలీవుడ్‌లో చేతి నిండా ఆఫర్లు ఉన్నాయట. సిబిరాజ్ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్, తాను హీరోయిన్లుగా నటిస్తున్న సత్య చిత్రం కోసం ఇటీవల ఒక పాట పాడిందట. ఈ పాట వినగానే తానే పాడాలనిపించిందట. అదే విషయాన్ని చిత్ర హీరో సిబిరాజ్‌కు, సంగీత దర్శకుడు సీమోన్ కే.కింగ్‌కు చెప్పగా వారిద్దరూ ఒకే అనడంతో స్టూడియోకు వెళ్లి పాడానని, ఆ పాట తనతో పాటు చిత్ర యూనిట్ అందరికీ తెగ నచ్చేసిందంటున్న రమ్యానంబీశన్ ఇలాంటివి బోలెడన్ని పాడాలని ఆశపడుతోందట. సింగర్‌గా తానింకా ప్రారంభ దశలోనే ఉన్నానని, సినిమా పాటలకే పరిమితం కాకుండా ఇండిపెండెంట్ పాటలను పాడాలని కోరుకుంటున్నానని అంది. ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రం సత్య త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండగా మెర్కురీ అనే మరో చిత్రంలోనూ నాయకిగా నటిస్తోంది. అదే విధంగా కన్నడంలో కురుక్షేత్రం అనే పురాణ ఇతిహాసం మహాభారతం కథా చిత్రంలో నటిస్తోంది. -
కశ్మీర్లో ఆ ఇద్దరు రొమాన్స్
యువ నటుడు సిబిరాజ్ వర్ధమాన నటి, కిడారి చిత్రం ఫేమ్ నిఖిలావిమల్తో చలో కశ్మీర్ అన్నా రు. కొత్తదనం కోసం తపించే యు వ నటుల్లో సిబిరాజ్ ఒకరు. అదే విధంగా నూతన దర్శకులను ప్రొత్సహించడానికి ముందుండే సిబిరాజ్ తాజాగా వినోద్ అనే మరో నవ దర్శకుడికి అవకాశం కల్పించారు. ఈయన దర్శకుడు విజెడ్.దురై శిష్యుడన్నది గమనార్హం. బాస్ మూవీస్ పతాకంపై విజయ్ కే.చల్లయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిబిరాజ్‌కు జంటగా నిఖిలావిమల్ నాయకిగా నటిస్తోంది. ఈ జంట ప్రస్తుతం కశ్మీర్లో రొమాన్స్ చేస్తున్నారు. దర్శకుడు వినోద్ చిత్ర వివరాలను తెలుపుతూ ఇదొక థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం అని చెప్పారు. ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే అంశాలతో కూడిన ఈ చిత్ర షూటింగ్‌ను ఇటీవలే కశ్మీర్లో ప్రారంభించామని తెలిపారు. కథ డిమాండ్ చేయడంతో కశ్మీర్లో షూటింగ్ చేయడానికి సిద్ధమైనట్లు వివరించారు. అక్కడ గుల్మార్గ్, పాల్గమ్ ప్రాంతాల్లో చిత్రంలోని కీలక సన్నివేశాలను 21 రోజుల పాటు చిత్రీకరించనున్నట్లు తెలిపారు. కశ్మీర్లో పరదాలా కమ్ముకున్న మంచు కారణంగా ఆ ప్రాంత పాఠశాలకు సెలవులు ప్రకటించారన్నారు. అలాంటిది చిత్ర యూని ట్ సహకారంతో షూటింగ్ ప్రణాళిక ప్రకారం జరుగుతోందని చెప్పారు. కశ్మీర్ షెడ్యూల్ పూ ర్తి చేసుకుని తదుపరి పొల్లాచ్చిలో రెం డవ షెడ్యూల్‌ను నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. -
సిబిరాజ్‌కు జంటగా కిడారి నాయకి
కిడారి చిత్రంలో శశికుమార్‌కు జంటగా నటించి చక్కని హావభావాలతో తమిళ ప్రేక్షకులను అలరించిన నటి నిఖిలవిమల్. ఈ అమ్మడికిప్పుడు నటుడు సిబిరాజ్‌తో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. సిబిరాజ్ నటించిన కట్టప్పావ కానోమ్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.దీంతో ఆయన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. బాస్ ఫిలింస్ పతాకంపై నిర్మాత విజయ్ కే.సెల్లయ్య నిర్మిస్తున్న ఈచిత్రానికి దర్శకుడు విజయ్Š. దురై శిష్యుడు, పలు వాణిజ్య ప్రకటనలు రూపొందించిన వినోద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో నటించడానికి నటి నిఖిలవిమల్ చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తోందట. దీని గురించి ఈ బ్యూటీ చెబుతూ ఇంతకు ముందు నటించిన చిత్రంలో తనను గ్రామీణ యువతిగా చూసిన తమిళ ప్రేక్షకులు ఈ చిత్రంలో సిటీ గర్ల్‌గా చూడబోతున్నారని చెప్పింది.యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఒకే కార్యాలయంలో పని చేసే కళాకారులుగా తాను, సిబిరాజ్ నటించనున్నామని తెలిపింది. సామాజిక సమస్య ఇతివృత్తంగా రూపందనున్న మంచి కథా చిత్రంలో తానూ ఒక భాగం కానుండడం గర్వంగా ఉందని చెప్పింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ త్వరలో కశ్మీర్లో ప్రారంభం కానుందని, ఆ తరువాత పొల్లాచ్చి, చెన్నై ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకోనుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. -
సిబిరాజ్‌తో వరలక్ష్మి
యువ నటుడు సిబిరాజ్‌తో నటించడానికి వరలక్ష్మి శరత్‌కుమార్ రెడీ అవుతున్నారు. ఈ సంచలన తార వృత్తి పరంగా స్పీడ్ పెంచారు.ఇప్పటి వరకూ స్లో అండ్ స్టడీ పాలసీని అవలంభిస్తూ వచ్చిన వరలక్ష్మి ఇప్పుడు నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నటుడు విశాల్‌కు ఈ అమ్మడికి మధ్య ప్రేమాయణం లాంటిదేదో జరుగుతోందని ఆ మధ్య కథలు కథలుగా ప్రచారం అరుున విషయం తెలిసిందే. అరుుతే ఇటీవల మూడేళ్ల ప్రేమను మేనేజర్‌తో చెప్పించి తుంచేశారని తన ట్విట్టర్లో పేర్కొని కలకలం సృష్టించిన నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవల నటుడు శంబుతో కలిసి విందులో పాల్గొని మరోసారి వార్తల్లో కెక్కారు. కాగా శింబుతో కలిసి నటించిన పోడా పోడీ చిత్రం నిర్మాణం పూర్తి అరుున చాలా కాలానికి తెరపైకి వచ్చింది. అదే ఈ బ్యూటీ తొలి చిత్రం అన్నది గమనార్హం. ఆ తరువాత చాన్నాళ్లకు విశాల్‌కు జంటగా మదగజరాజా చిత్రంలో నటించారు. అరుుతే ఆ చిత్ర విడుదలకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. ఆ తరువాత బాలా దర్శకత్వంలో నటించిన తారైతప్పటై్ట చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందకపోరుునా వరలక్ష్మి నటనకు మాత్రం ప్రశంసలు లభించారుు. ఆ తరువాత తమిళ చిత్రం ఏదీ విడుదల కాకపోరుునా, కన్నడ, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రంలో నటించి బహుభాషా నటి అనిపించుకున్నారు. ప్రస్తుతం తమిళంలో నిపుణన్, అమ్మారుు, విక్రమ్ వేదా చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా సిబిరాజ్‌తో మరో చిత్రం చేసే అవకాశం వరించింది. నటుడు సత్యరాజ్ సమర్పణలో నాదాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రంలో సిబిరాజ్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ఇప్పటికే నటి రమ్యానంభీశన్ను ఎంపిక చేశారు. మరో ముఖ్య పాత్రలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్ నటించనున్నారు. ఇందులో వరలక్ష్మి ఇంతకు ముందు పోషించనటువంటి బలమైన పాత్రలో నటిస్తున్నారని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. దీనికి సైతాన్ చిత్రం ఫేమ్ ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు -
సిబిరాజ్‌తో రమ్యానంబీశన్ రొమాన్స్
యువ నటుడు సిబిరాజ్‌తో రొమాన్‌సకు సిద్ధం అవుతున్నారు నటి రమ్యానంబీశన్. ఈ మలయాళీ భామ నటించిన చిత్రాలు విజయం సాధిస్తున్నా కోలీవుడ్‌లో అవకాశాలు మాత్రం అడపాదడపానే వరించడం గమనార్హం. అయితే తమిళంతో పాటు మలయాళంలోనూ నటించడంతో రమ్యానంబీశన్ బిజీగానే ఉన్నారని చెప్పవచ్చు. ఆ అమ్మడు కోలీవుడ్‌లో నటించిన చివరి చిత్రం సేతుపతి. ఇది మంచి విజయాన్నే అందుకుంది. కాగా సమీపకాలంలో మోహన్‌లాల్‌కు జంటగా నటించిన పులిమురుగన్ ఘన విజయాన్ని సాధించింది. ఇకపోతే యువ నటుడు సిబిరాజ్ కట్టప్పావ కానోం చిత్రాన్ని పూర్తి చేసి తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. తన తదుపరి చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తికి దర్శకత్వం అవకాశం కల్పించారు. ఈయన విజయ్ అంటోని హీరోగా నటించిన సైతాన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారన్నది గమనార్హం. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. సిబిరాజ్ హీరోగా నటించే చిత్రం తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన క్షణం చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కనుందన్నది గమనార్హం. ఇందులో సిబిరాజ్‌కు జంటగా నటి రమ్యానంబీశన్ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు సతీష్ ముఖ్య పాత్రను పోషించనున్నారు. దీన్ని నాదాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. -
దొరగా వస్తున్న కట్టప్ప!
‘బాహుబలి’కి ముందు తమిళ నటుడు సత్యరాజ్ తెలుగులో మంచి పాత్రలు చేసినప్పటికీ ఆ చిత్రంలో చేసిన ‘కట్టప్ప’పాత్ర ఆయన్ను చాలా పాపులర్ చేసేసింది. ఆ గుర్తింపుని దృష్టిలో పెట్టుకునే తమిళంలో ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జాక్సన్ దురై’ చిత్రాన్ని తెలుగులోకి ‘దొర’ పేరుతో జక్కం జవహర్‌బాబు విడుదల చేస్తున్నారు. ధరణీధరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ హారర్ ఎంటర్టైనర్లో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు. తెలుగమ్మాయి బిందుమాధవి కథానాయిక. చిత్రవిశేషాలను జవహర్‌బాబు తెలియజేస్తూ- ‘‘ఆసక్తికి గురి చేసే హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. తమిళంలో టీజర్‌కు స్పందన బాగుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నాం. సిద్ధార్థ్ విపిన్ అద్భుతమైన పాటలు స్వరపరిచాడు. వెన్నెలకంటి, చంద్రబోస్ చక్కటి సాహిత్యంతో పాటలు రాశారు. శశాంక్ వెన్నెలకంటి డైలాగులు హైలెట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్ మొదటి వారంలో పాటలనూ మూడో వారంలో సినిమానూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: యువరాజ్, నేపథ్య సంగీతం: చిన్నా. -
సిబిరాజ్ చేతిలో క్షణం రీమేక్ రైట్స్
ఒక భాషలో హిట్ అయిన చిత్ర రీమేక్ హక్కుల కోసం గట్టి పోటీ నెలకొనడం సహజం. అలా ఇటీవల తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం క్షణం. వైవిధ్యభరిత హారర్ కథా చిత్రంగా తెరకెక్కిన క్షణం చిత్ర విజయం కోలీవుడ్ వరకూ పాకింది. అడివి శేషు, ఆదాశర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి రవికాంత్ దర్శకుడు. కాగా ఈ చిత్రం తమిళంలో రీమేక్ కానుందన్నది తాజా వార్త. దీని తమిళ రీమేక్ హక్కుల్ని యువ నుటుడు సిబిరాజ్ పొందారు. అడివి శేషు పోషించిన పాత్రను తమిళంలో సిబిరాజ్ చేయనున్నారు. ఇక ఆదాశర్మ పాత్రను పోషించే అదృష్టం దక్కించుకునే నటి ఎవరన్నది త్వరలోనే తేలనుంది. అదే విధంగా ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని తెలిసింది. ఇటీవల విడుదలైన పోకిరిరాజా చిత్రంలో విలన్‌గా విలక్షణ నటనను ప్రదర్శించిన సిబిరాజ్ ప్రస్తుతం నవ దర్శకుడు మణికందన్ దర్శకత్వంలో నటిస్తున్నారు.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సిబిరాజ్ నటించిన హారర్ కథా చిత్రం జాక్సన్‌దురై నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. -
ఆ ఒక్కడికే తెలుసు !
2015 సంవత్సరంలో చోటుచేసుకున్న నేరాలకు సంబంధించి ఇప్పటివరకు ఏమాత్రం క్లూ దొరకని ఒకే ఒక్క కేసు.. అమరేంద్ర బాహుబలి హత్య! 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' ఈ ప్రశ్నకి సమాధానం కోసం ఎదురుచూడని సినీ అభిమాని ఉండడు. అసలు నిజం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. వారిలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ ఒకరు. బాహుబలి రిలీజ్ అయినప్పటి నుంచి సత్యరాజ్ సుపుత్రుడు, తమిళ నటుడు శిబిరాజ్ ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నాడట. సత్యరాజ్ కుటుంబసభ్యులు కూడా బాహుబలి హత్య వెనుక ఉన్న సీక్రెట్ కోసం శతవిధాలా ప్రయత్నించి విసుగుచెంది ఊరుకున్నారట. ఎవరెంత బతిమిలాడినా సత్యరాజ్ మాత్రం కథలోని సస్పెన్స్ ని బయటపెట్టలేదు. 'మా నాన్నకు పని పట్ల ఉన్న నిబద్ధత అటువంటిది' అంటూ తండ్రి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు శిబిరాజ్. అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయం సత్యరాజ్ కుటుంబంలో ఒకే ఒక్కరికి తెలుసట.. సత్యరాజ్ రెండున్నరేళ్ల మనవడికి! -
పోకిరిరాజా టీజర్‌కు ప్రశంసలు
సాధారణంగా ఒక చిత్ర టీజర్ విడుదలైతే దాన్ని ఒకటి రెండు రోజుల్లోనే లక్షల్లో అభిమానులు తిలకిస్తున్న రోజులివి.అయితే సినీ దిగ్గజాల నుంచి యువ కళాకారుల వరకు ముక్త కంఠంతో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రశంసించడం అన్నది పోకిరిరాజా చిత్ర టీజర్‌కు దక్కింది. యువ నటుడు జీవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పోకిరిరాజా. హీరోగా ఇది ఆయనకు 25వ చిత్రం అన్నది గమనార్హం. అందాల భామ హన్సిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిబిరాజ్ మరో హీరోగా నటిస్తున్నారు. పులి చిత్ర నిర్మాతలలో ఒకరైన పీటీ.సెల్వకుమార్ సమర్పణలో పీటీఎస్.ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళుక్కు ఎన్ 1ఐ అళుత్తవుమ్ చిత్రం ఫేమ్ రామ్ ప్రకాశ్ రాయప్ప దర్శకత్వం వహిస్తున్నారు. పోకిరిరాజా చిత్ర టీజర్ ఫిబ్రవరి1న విడుదలైంది. ఈ టీజర్‌ను చూసిన ప్రముఖ దర్శకుడు కేఎస్.రవికుమార్, ఎస్ఏ.చంద్రశేఖర్,విక్రమ్‌ప్రభు, కేవీ.ఆనంద్ నటి కుష్భూ, బద్రి, మైఖెల్‌రాయప్పన్, విజయ్‌సేతుపతి, అట్లీ, శక్తి సౌందర్‌రాజన్, ఎల్రెడ్.కుమార్, మాధవన్, జయంరవి, సిద్ధార్థ్, కాజల్‌అగర్వాల్, దినేశ్, నకుల్, ఆర్జే.బాలాజీ,లక్ష్మీమీనన్ తదితర 25 మంది సినీ ప్రముఖులు చాలా బాగుందంటూ ప్రశంసల వర్షం కురిపించారని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని14న కోయంబత్తూర్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు చిత్ర విడుదల హక్కుల్ని పొందిన కాస్మో విలేజ్ శివ తెలిపారు.చిత్రాన్ని ఈ నెల 26న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
జీవా, సిబిరాజ్ల మధ్య రియల్ ఫైట్
ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు పోటీ పడడం, పోరాటానికి దిగడం అనే సన్నివేశాలను చాలా చిత్రాలలో చూస్తుంటాం.అలా పోకిరిరాజా చిత్రంలో అందగత్తె హన్సిక కోసం జీవా సిబిరాజ్ చేసిన రీల్ ఫైట్ రియల్ ఫైట్‌కు దారి తీయడం చర్చనీయాంశంగా మారింది. జీవా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం పోకిరిరాజా. మరో కథానాయకుడిగా సిబిరాజ్ నటిస్తున్న ఈ చిత్రంలో హన్సిక కథానాయకిగా నటిస్తున్నారు. ఇంతకు ముందు తమిళుక్కు ఎన్ ఒండై అళిక్కువమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రామ్‌ప్రకాశ్ రాయప్ప దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం ఇది. అదే విధంగా ఇలయదళపతి విజయ్ హీరోగా పులి వంటి భారీ సాంఘిక జానపద చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలలో ఒకరైన పీటీ.సెల్వకుమార్ సమర్పణలో పీటీఎస్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై టీఎస్.పొన్‌సెల్వి నిర్మిస్తున్న చిత్రం పోకిరిరాజా. రాజస్థాన్ సెట్లో అందాల పాట కాగా డీ.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ఒక పాట కోసం ఇటీవల పూందమల్లి రోడ్డు సమీపంలో రాజస్థాన్‌ను తలపించే విధంగా ఒక బ్రహ్మాండమైన సెట్‌ను రూపొందించినట్లు దర్శకుడు రామ్‌ప్రకాశ్ రాయప్ప మంగళవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీని గురించి ఆయన తెలుపుతూ జీవా, హన్సికలపై చిత్రీకరించిన ఈ పాటలో 100 మంది డాన్సర్లు, రాజస్థాన్ నుంచి రప్పించిన 100 మంది సహాయ నటులు పాల్గొనగా నృత్య దర్శకురాలు బృంద అందాలను మేళవిస్తూ డాన్స్‌ను కంపోజ్ చేశారన్నారు. బబ్లీ బబ్లీ అంటూ సాగే ఆ పాటను ఆ సెట్లో రూపొందించిన స్విమ్మింగ్పూల్లోను చితీక్రరించినట్లు తెలిపారు. తన ముందు చిత్రానికి, ఈ పోకిరిరాజా చిత్రం చాలా భిన్నంగా ఉంటుందన్నారు. పక్కా కమర్షియల్ అంశాలతో జాలీగా సాగే కథా చిత్రం పోకిరిరాజా అని చెప్పారు. ఇది జీవాకు 25వ చిత్రం కావడంతో కథ విషయంలో చాలా జాగ్రత్తలను తీసుకుని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.