సిబిరాజ్ చేతిలో క్షణం రీమేక్ రైట్స్ | Sibiraj snap `Kshanam` remake rights | Sakshi
Sakshi News home page

సిబిరాజ్ చేతిలో క్షణం రీమేక్ రైట్స్

Published Fri, Apr 22 2016 2:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

సిబిరాజ్ చేతిలో క్షణం రీమేక్ రైట్స్

సిబిరాజ్ చేతిలో క్షణం రీమేక్ రైట్స్

ఒక భాషలో హిట్ అయిన చిత్ర రీమేక్ హక్కుల కోసం గట్టి పోటీ నెలకొనడం సహజం. అలా ఇటీవల తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం క్షణం. వైవిధ్యభరిత హారర్ కథా చిత్రంగా తెరకెక్కిన క్షణం చిత్ర విజయం కోలీవుడ్ వరకూ పాకింది. అడివి శేషు, ఆదాశర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి రవికాంత్ దర్శకుడు.
 
  కాగా ఈ చిత్రం తమిళంలో రీమేక్ కానుందన్నది తాజా వార్త. దీని తమిళ రీమేక్ హక్కుల్ని యువ నుటుడు సిబిరాజ్ పొందారు. అడివి శేషు పోషించిన పాత్రను తమిళంలో సిబిరాజ్ చేయనున్నారు. ఇక ఆదాశర్మ పాత్రను పోషించే అదృష్టం దక్కించుకునే నటి ఎవరన్నది త్వరలోనే తేలనుంది. అదే విధంగా ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని తెలిసింది.
 
 ఇటీవల విడుదలైన పోకిరిరాజా చిత్రంలో విలన్‌గా విలక్షణ నటనను ప్రదర్శించిన సిబిరాజ్ ప్రస్తుతం నవ దర్శకుడు మణికందన్ దర్శకత్వంలో నటిస్తున్నారు.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  సిబిరాజ్ నటించిన హారర్ కథా చిత్రం జాక్సన్‌దురై నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement