సిబిరాజ్‌తో రమ్యానంబీశన్ రొమాన్స్ | Ramya nambisan romance with Sibiraj | Sakshi
Sakshi News home page

సిబిరాజ్‌తో రమ్యానంబీశన్ రొమాన్స్

Published Wed, Nov 2 2016 3:02 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

సిబిరాజ్‌తో రమ్యానంబీశన్ రొమాన్స్

సిబిరాజ్‌తో రమ్యానంబీశన్ రొమాన్స్

యువ నటుడు సిబిరాజ్‌తో రొమాన్‌‌సకు సిద్ధం అవుతున్నారు నటి రమ్యానంబీశన్. ఈ మలయాళీ భామ నటించిన చిత్రాలు విజయం సాధిస్తున్నా కోలీవుడ్‌లో అవకాశాలు మాత్రం అడపాదడపానే వరించడం గమనార్హం. అయితే తమిళంతో పాటు మలయాళంలోనూ నటించడంతో రమ్యానంబీశన్ బిజీగానే ఉన్నారని చెప్పవచ్చు. ఆ అమ్మడు కోలీవుడ్‌లో నటించిన చివరి చిత్రం సేతుపతి. ఇది మంచి విజయాన్నే అందుకుంది. కాగా సమీపకాలంలో మోహన్‌లాల్‌కు జంటగా నటించిన పులిమురుగన్ ఘన విజయాన్ని సాధించింది. ఇకపోతే యువ నటుడు సిబిరాజ్ కట్టప్పావ కానోం చిత్రాన్ని పూర్తి చేసి తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు.

తన తదుపరి చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తికి దర్శకత్వం అవకాశం కల్పించారు. ఈయన విజయ్ అంటోని హీరోగా నటించిన సైతాన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారన్నది గమనార్హం. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. సిబిరాజ్ హీరోగా నటించే చిత్రం తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన క్షణం చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కనుందన్నది గమనార్హం. ఇందులో సిబిరాజ్‌కు జంటగా నటి రమ్యానంబీశన్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు సతీష్ ముఖ్య పాత్రను పోషించనున్నారు. దీన్ని నాదాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement