
మనకు జస్ట్ కాకపోవచ్చు కానీ బెంగళూరుకు చెందిన ప్రముఖ డాగ్ బ్రీడర్ ఎస్.సతీశ్ మాత్రం జస్ట్ రూ.50 కోట్లేగా అని అనుకున్నారు. వెంటనే డబ్బులిచ్చేసి.. కొనేశారు.
దీని పేరు చెప్పలేదు కదూ.. ఒకామి.. వినడానికి చైనా, జపానోళ్ల పేరులాగా ఉంది గానీ.. ఇది పుట్టింది మాత్రం అమెరికాలో.. తోడేలు, కాకేషన్ షెపర్డ్ జాతి కుక్క క్రాస్ బ్రీడ్. ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైమట. అందుకే ఇంత రేటు అని చెబుతున్నారు. ఏదైతేనేం ఇప్పుడిది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్క. వయసు కేవలం 8 నెలలు.. బరువు మాత్రం ఇప్పటికే 75 కిలోలు ఉంది. అంటే.. ఒకామి మన మీద ఒక్కసారి పడిందంటే.. కాలో చేయో విరగాల్సిందే.
ఇంత డబ్బిచ్చి ఎందుకు కొన్నట్లు..
సతీశ్.. 1990 నుంచి ఈ డాగ్స్ బ్రీడింగ్ బిజినెస్‌లో ఉన్నారు. ఆయన దగ్గర 150 రకాల జాతుల కుక్కలు ఉన్నాయట. ఇవి చాలా పోటీల్లో పాల్గొని.. ప్రైజులు గెలుచుకున్నాయి. గత పదేళ్ల నుంచి బ్రీడింగ్‌ను ఆపేసిన సతీశ్.. ఇలాంటి అరుదైన కుక్కలను కొని.. వాటిని షోలలో ప్రదర్శించడం ద్వారా సంపాదిస్తున్నారు. 30 నిమిషాలకు రూ.2.5 లక్షలు చార్జ్ చేస్తారు. గతేడాది కూడా ఆయన పాండాలా కనిపించే చౌచౌ జాతి కుక్కను.. జస్ట్ రూ.29 కోట్లే కదా అని కొన్నారు. ‘వీటిని చూడటానికి చాలా మంది ఆసక్తి చూపు తారు.
టికెట్లు కొనుక్కొని మరీ వస్తారు. సెల్ఫీలు తీసుకుంటారు. నేను, నా డాగ్స్ సినిమా యాక్టర్లలాగా బాగా పాపులర్ అయి పోయాము’ అని సతీశ్ చెప్పారు. 7 ఎకరాల ఫామ్‌హౌస్‌లో ఈ శునకాలు ఉంటాయి. ఖరీదై నవి కావడంతో ఎవరూ ఎత్తుకుపోకుండా సీసీటీవీ పహారా ఉంటుంది. కుక్కల సంరక్షణ బాధ్యతలను చూసుకోవడానికి ఆరుగురు సిబ్బంది ఉంటారు. కనకపు సింహాసనం వేయలేదు కానీ.. దాదాపుగా అలాంటి సదుపాయాలే ఉంటాయి. రేయ్.. ఎవర్రా అంది.. ఛీ కుక్క బతుకని..
మమ్మీ, డాడీ సంగతి..
తోడేలు ఎంత క్రూరమైనదో మనకు తెలిసిందే. ఇక కాకేషన్ షెపర్డ్ జాతి కుక్కల గురించి చెప్పాలంటే.. శీతల దేశాల్లో ఉండే ఈ శునకాలు చాలా బలంగా ఉంటాయి. గొర్రెలు, పశువుల మందలను తోడేళ్ల బారి నుంచి కాపాడటానికి వీటిని వాడతారు. ఈ లెక్కన.. ఈ రెండింటినీ మిక్సీలో వేసి తీసినట్లు ఉండే ఒకామి.. ఇంకెంత స్పెషలో చూడండి మరి.. రోజుకు కనీసం 3 కిలోల చికెన్ తిననిదే నిద్ర కూడా పోదట. – సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment