Maayon Movie Producer Gifted Gold Chain To Director in Success Meet - Sakshi
Sakshi News home page

Maayon Movie: దర్శకుడికి మాయోన్‌ మూవీ నిర్మాత సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

Published Sat, Jul 2 2022 4:27 PM | Last Updated on Sat, Jul 2 2022 5:43 PM

Maayon Movie Producer Gifted Gold Chain To Director in Success Meet - Sakshi

సాక్షి, చెన్నై: మాయోన్‌ చిత్ర యూనిట్‌ విజయానందంలో మునిగి తేలుతోంది. డబుల్‌ మీనింగ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై అరుణ్‌ మొళి మాణిక్యం కథణం, నిర్మాణ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రంలో శిబిరాజ్‌, తాన్యా రవిచంద్రన్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. నవ దర్శకుడు కిషోర్‌ దర్శకత్వం వహించారు. శిలల స్మగ్లింగ్‌ ప్రధాన ఇతివృత్తంగా ఫాంటిసీ సన్నివేశాలతో రూపొందిన చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలై విమర్శకుల ప్రశంసలతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

దీంతో చిత్ర యూనిట్‌ విజయానందంలో మునిగి తేలుతోంది. గురువారం చిత్ర యూనిట్‌ చెన్నైలో కేక్‌ కట్‌ చేసి వేడుకగా సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత.. దర్శకుడు కిషోర్‌కు బంగారు గొలుసును కానుకగా అందించారు. కాగా ఈ చిత్రం 7వ తేదీన తెలుగులోనూ విడుదల కానుందని ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు. అదే విధంగా మాయోన్‌కు సీక్వెల్‌ను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement