పలు వాయిదాల అనంతరం రిలీజ్‌కు రెడీ అయిన రంగా మూవీ | Actor Sibiraj Ranga Movie Release On May 13th | Sakshi
Sakshi News home page

Sibiraj Ranga: ఎట్టకేలకు విడుదలకు సిద్దమైన రంగా, రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Tue, May 10 2022 2:00 PM | Last Updated on Tue, May 10 2022 2:03 PM

Actor Sibiraj Ranga Movie Release On May 13th - Sakshi

సాక్షి, చెన్నై: నటుడు సిబిరాజ్‌ కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం రంగా. నిఖిలా విమల్‌ నాయికగా, డీఎల్‌ వినోద్‌ను దర్శకుడిగా బాస్‌ మూవీ పతాకంపై విజయ్‌ కె.చెల్లయ్య నిర్మించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 13వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. శనివారం సాయంత్రం చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు సిబిరాజ్‌ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నటించడానికి సిద్ధమయ్యానన్నారు.

చదవండి: బాలీవుడ్‌ నన్ను భరించలేదు, అక్కడ సినిమాలు తీసి టైం వేస్ట్‌ చేసుకోను

షూటింగ్‌ అధికభాగం కశ్మీర్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారన్నారు. కథ బావుంది గానీ.. కొత్త దర్శకుడు ఎలా తెరకెస్తారన్న సంశయం కలిగిందన్నారు. దీంతో కొన్ని రోజులు చెన్నైలో షూటింగ్‌ చేసి దర్శకుడి ప్రజెంటేషన్‌ చూసిన తర్వాత కశ్మీర్‌కి వెళ్దామని నిర్మాతకు చెప్పానన్నారు. కానీ  కథకు తగిన వాతావరణం ఇప్పుడు కశ్మీర్‌లో ఉంటుందని అక్కడే షూటింగ్‌ చేద్దామని ఆయన చెప్పారన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement