nikhila Vimal
-
Vaazhai In OTT: ఆ హిట్ డైరెక్టర్ మూవీ.. నేరుగా ఓటీటీకేనా!
మామన్నన్ మూవీతో హిట్ అందుకు డైరెక్టర్ మారి సెల్వరాజ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వాజై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కలైయరాసన్, నిఖిలా విమల్, ప్రియాంక, దివ్య, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మూడు సూపర్ హిట్ చిత్రాల తర్వాత మారి సెల్వరాజ్ తెరకెక్కించిన నాలుగో చిత్రం వాజై ఓటీటీలో రిలీజ్ చేయడంపై ఫ్యాన్స్‌కు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మామన్నన్ కంటే ముందే వచ్చిన పెరియారుమ్ పెరుమాల్, కర్ణన్ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. సమాజంలో అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షలను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకున్నారు మారి సెల్వరాజ్. దీంతో వాజై మూవీని కూడా థియేటర్లలోనే రిలీజ్ చేస్తారని కోలీవుడ్ ఫ్యాన్స్ భావించారు. అదే తరహాలోనే వాజై చిత్రాన్ని కూడా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అసలు కారణమిదేనా? అయితే ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నవ్వి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అందువల్లే ఈ మూవీని థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. కాగా.. ఈ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. நீளும் நீச்சலில் என் நா கேட்கும் ஒரு சொட்டுத் தேன் . —வாழை 🌴 This year belongs to #Vaazhai Team Vaazhai welcomes 2024 with warm hands!! Hitting theatres soon!! 🌴@disneyplusHSTam @navvistudios @mari_selvaraj @Music_Santhosh @thenieswar @KalaiActor @Nikhilavimal1… pic.twitter.com/CKrQNimnt7 — Mari Selvaraj (@mari_selvaraj) January 1, 2024 -
పలు వాయిదాల అనంతరం రిలీజ్‌కు రెడీ అయిన రంగా మూవీ
సాక్షి, చెన్నై: నటుడు సిబిరాజ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం రంగా. నిఖిలా విమల్ నాయికగా, డీఎల్ వినోద్‌ను దర్శకుడిగా బాస్ మూవీ పతాకంపై విజయ్ కె.చెల్లయ్య నిర్మించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 13వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. శనివారం సాయంత్రం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు సిబిరాజ్ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నటించడానికి సిద్ధమయ్యానన్నారు. చదవండి: బాలీవుడ్ నన్ను భరించలేదు, అక్కడ సినిమాలు తీసి టైం వేస్ట్ చేసుకోను షూటింగ్ అధికభాగం కశ్మీర్లో నిర్వహించనున్నట్లు చెప్పారన్నారు. కథ బావుంది గానీ.. కొత్త దర్శకుడు ఎలా తెరకెస్తారన్న సంశయం కలిగిందన్నారు. దీంతో కొన్ని రోజులు చెన్నైలో షూటింగ్ చేసి దర్శకుడి ప్రజెంటేషన్ చూసిన తర్వాత కశ్మీర్‌కి వెళ్దామని నిర్మాతకు చెప్పానన్నారు. కానీ కథకు తగిన వాతావరణం ఇప్పుడు కశ్మీర్లో ఉంటుందని అక్కడే షూటింగ్ చేద్దామని ఆయన చెప్పారన్నారు. -
సహాయపడదాం
కరోనా వల్ల ఏర్పడిన కష్ట కాలంలో వీలైనంత సహాయం అందించడానికి సినిమా స్టార్స్ ముందుకు వస్తున్నారు. కరోనాపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మలయాళ నటి నిఖిలా విమల్ కూడా తనకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. కేరళలోని కన్నూర్ ప్రాంతంలో కోవిడ్ 19–కాల్ సెంటర్లో పని చేస్తున్నారామె. లాక్ డౌన్ కారణంగా అందరికీ నిత్యావసర వస్తువులు అందుతున్నాయా? లేదా? అని తెలుసుకోవడంతో పాటు ఏదైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడానికి ఈ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బంది, సందేహాలు ఉన్నవాళ్లు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు, సహాయం పొందవచ్చు. ఈ కాల్ సెంటర్లో సిబ్బంది అవసరం ఉందని తెలిసి వాలంటీర్‌గా పని చేయాలనుకున్నారట నిఖిల. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ సెంటర్లో పని చేస్తున్నారామె. తన వివరాలేవీ కాలర్కి తెలియకుండా పని చేసుకుంటూ వెళ్తున్నారట. ఈ కాల్ సెంటర్ చేరుకోవడానికి 20 కిలో మీటర్లు ప్రయాణిస్తున్నారట కూడా. ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నా వంతు సహాయం చేయడం, అది ఉపయోగకరంగా ఉండడం సంతోషంగా ఉంది. ఇదో సరికొత్త అనుభూతి. అందరం కూడా ఏదో విధంగా సహాయపడటానికి ట్రై చేద్దాం’’ అన్నారు నిఖిలా విమల్. మోహన్ బాబు నటించిన ‘గాయత్రి’ సినిమాలో ఆయన కుమార్తె పాత్రలో నిఖిల నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఖైదీ తర్వాత దొంగ ఏంటి?
‘‘ఊపిరి’ సినిమాలో కార్తీ నటన అద్భుతం. తన గురించి చెప్పాలంటే వెయ్యిలో ఒక్కడు. మూడు సార్లు బెస్ట్ యాక్టర్‌గా ఫిలిం ఫేర్ అవార్డ్ గెలుచుకున్నారు. జీతూ చాలా తెలివైన డైరెక్టర్. ‘ఖైదీ’ కంటే ‘దొంగ’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’’ అని సీనియర్ దర్శకులు శివనాగేశ్వర రావు అన్నారు. కార్తీ హీరోగా ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దొంగ’. వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ పతాకాలపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో హర్షిత మూవీస్ పతాకంపై రావూరి వి. శ్రీనివాస్ రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కార్తీ మాట్లాడుతూ– ‘‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ ఏంటి? అని అందరూ అడుగుతున్నారు. రెండూ చిరంజీవిగారికి పెద్ద హిట్ ఇచ్చిన టైటిల్సే. స్క్రిప్ట్‌కి తగ్గట్టే ఈ రెండు పేర్లు పెట్టాం. ‘దొంగ’ కథ వినేటప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అక్కాతమ్ముడు రిలేషన్షిప్ ఇంట్రెస్టింగ్గా, ఎమోషనల్‌గా అనిపించింది. మా నాన్న క్యారెక్టర్ సత్యరాజ్‌గారు చేశారు. మా మూడు పాత్రలు సినిమాకి పిల్లర్స్ లాంటివి. ‘నా పేరు శివ, ఊపిరి’ కలిపితే వచ్చిన వైవిధ్యమైన సినిమాలా ‘దొంగ’ ఉంటుంది’’ అన్నారు. ‘‘దృశ్యం’ సినిమా తెలుగులో రీమేక్ అయి పెద్ద విజయం సాధించినప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఓ సినిమా చేయాలనుకున్నా. ఇప్పుడు ‘దొంగ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు జీతూ జోసెఫ్. నటుడు సత్యరాజ్, డైలాగ్ రైటర్ హనుమా¯Œ చౌదరి, హీరోయి¯Œ నిఖిలా విమల్ తదితరులు పాల్గొన్నారు. -
నచ్చిన సినిమాలే చేస్తాను
‘‘దొంగ’ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలానే దర్శకుడు జీతూ జోసెఫ్ సినిమాల్లో కనిపించే సస్పెన్స్, థ్రిల్స్ కూడా ఉంటాయి. నేను చేసిన ‘ఊపిరి, నా పేరు శివ’ సినిమాలను కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో అలాంటి ఛాయలుంటాయి’’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, నిఖిలా విమల్ జంటగా జ్యోతిక, సత్యరాజ్, ‘షావుకారు’ జానకి ముఖ్య పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘తంబీ’. తెలుగులో ‘దొంగ’ పేరుతో రిలీజ్ కాబోతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రావూరి వి. శ్రీనివాస్ నిర్మించారు. ఈ నెల 20న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న సందర్భంగా కార్తీ పంచుకున్న విశేషాలు.. ► నా కెరీర్లో ఇప్పటి వరకూ 19 సినిమాలు చేశాను. ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడ్డాను. స్క్రిప్ట్ నాకు బాగా నచ్చితేనే సినిమా చేశాను. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తుంటాను. ఈ సినిమా ‘ఖైదీ’ వచ్చిన రెండు నెలల తర్వాత వస్తుండొచ్చు, కానీ రెండేళ్ల నుంచి పక్కా ప్లానింగ్‌తో ‘దొంగ’ సినిమా చేశాం. ► ‘రంగ్ దే బసంతి’ రాసిన రచయిత రెన్సిల్ డిసిల్వ ఈ కథను నా దగ్గరకు తీసుకువచ్చారు. ఈ కథ నాకు బాగా నచ్చింది. వదిన(జ్యోతిక) కూడా ఈ కథ విన్నారు. దర్శకుడు ఎవరు? అని అనుకుంటుంటే.. జీతూ జోసెఫ్ కరెక్ట్ అని అనుకున్నాం. నేనూ, వదినా ఈ సినిమా చేయబోతున్నాం అని తెలిసి ఆయన కూడా ఓకే అన్నారు. ఆయనకి ఈ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో మాకు మరింత నమ్మకం వచ్చింది. ► వదినతో యాక్ట్ చేయడం ఇంట్లో కూర్చొని మాట్లాడినట్టే ఉండేది. ఎందుకంటే ఈ సినిమాలో మా పాత్రలు కూడా అలానే ఉంటాయి. మేమిద్దరం అక్కాతమ్ముడి పాత్రల్లో నటించాం. నెల రోజుల ముందే డైలాగ్స్ అన్నీ నేర్చుకుని సెట్‌కి వచ్చేవారు వదిన. ► ఈ సినిమాను అన్నయ్య(సూర్య) ఇంకా చూడలేదు. థియేటర్స్‌లోనే చూస్తా అని చెప్పారు. ► ఇందులో సత్యరాజ్ మా తండ్రి పాత్రలో నటించారు. ‘షావుకారు’ జానకి మా బామ్మ పాత్ర చేశారు. ఇంతమంది అద్భుతమైన నటీ నటులతో పని చేసినప్పుడు మనం కూడా బాగా చేస్తాం. చాలా నేర్చుకుంటాం. ► నా గత చిత్రం ‘ఖైదీ’ చిరంజీవిగారి సినిమా టైటిలే. ఇది కూడా చిరంజీవిగారి సినిమా టైటిలే. ఆయన కూడా ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ సినిమా చేశారని నాతో ఎవరో అన్నారు. మంచి శకునం అనుకున్నాను. ► ప్రస్తుతం మణిరత్నంగారి ‘పొన్నియిన్ సెల్వమ్’ షూటింగ్ థాయ్‌ల్యాండ్‌లో జరుగుతోంది. ‘దొంగ’ ప్రమోషన్స్ కోసం చిన్న బ్రేక్ తీసుకొని వచ్చాను. మళ్లీ వెళ్లి షూటిం గ్లో జాయిన్ అవుతాను. -
ఆరంభమే ముద్దులతో..
సినిమా: కార్తీతో ఆరంభంలోనే ముద్దు సన్నివేశంలో నటించానని నటి నికిలా విమల్ చెప్పుకొచ్చింది. ఈ మలయాళీ కుట్టి ఇంతకు ముందు కిడారి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత తంబి చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కార్తీ, నటి జ్యోతిక అక్కా, తమ్ముడుగా నటిస్తున్న చిత్రం తంబి. నటుడు సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జీతు జోసఫ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 20వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. తంబి చిత్రంలో నటుడు కార్తీతో నటించిన అనుభవం గురించి నటి నికిల విమల్ పేర్కొంటూ జీతూజోసప్ దర్శకత్వంలో ఇంతకు ముందే ఒక మలమాళ చిత్రంలో నటించాల్సిందని, కాల్షీట్స్ సమస్య కారణంగా నటించలేకపోయినట్లు చెప్పింది. అప్పుడు మరో చిత్రంలో నటించే అవకాశం ఇస్తానని దర్శకుడు తెలిపారంది. అలా ఒక సారి ఫోన్ చేసి తమిళంలో ఒక చిత్రం చేస్తున్నానని, అందులో జ్యోతిక, కార్తీ, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారని చెప్పారని తెలిపింది. ఈ చిత్రంలో కార్తీకి జంటగా ఒక పాత్ర ఉంది, నువ్వు నటిస్తావా? అని అడిగారని చెప్పింది. దర్శకుడు అంత నిజాయితీగా చెప్పడంతో తాను వెంటనే తంబి చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది. ఉత్తమ కళాకారులతో నటించాలని తాను కోరుకుంటానని, అలాంటి మంచి అవకాశం ఈ చిత్రంలో లభించిందని అంది. తనకు తమిళ భాష తెలియడంతో ఈ చిత్రంలో నటించడం సులభం అనిపించిందని చెప్పింది. చాలామంది మాదిరిగానే తానూ నటుడు సూర్య, జ్యోతికలను తెరపై చూసి ఆనందించానని చెప్పింది. అలాంటిది ఇప్పుడు నటి జ్యోతకతో కలిసి ఈ తంబి చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని పేర్కొంది. సాధారణంగా చాలా చిత్రాల్లో ఆరంభంలో చిన్నచిన్న సన్నివేశాల్లో నటింపజేస్తారని అంది. అలాంటిది ఈ చిత్రంలో తాను తొలి రోజే డ్యూయెట్ సాంగ్‌లో నటించాల్సిన పరిస్థితి అని చెప్పింది. అదీ కాకుండా తొలి షాట్‌లోనే కార్తీతో లిప్‌లాక్ సన్నివేశంలో నటించాల్సి రావడంతో చాలా భయపడ్డానని చెప్పింది. కార్తీ చాలా కూల్‌గా మాట్లాడి సహజంగా నటించమని చెప్పడంతో అలానే నటించినట్లు పేర్కొంది. -
ఖైదీ యాక్షన్
‘ఖైదీ’ వంటి సూపర్‌హిట్ తర్వాత కార్తీ నటించిన తమిళ చిత్రం ‘తంబి’. ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జ్యోతిక, నికిలా విమల్, సత్యరాజ్ కీలక పాత్రధారులు. ఈ సినిమా తెలుగులో ‘దొంగ’ అనే టైటిల్‌తో ఈ నెల 20న రిలీజ్ కానుంది. తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ‘‘యాక్షన్‌తో కూడిన ఎమోషనల్ చిత్రం ఇది. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. గోవింద్ వసంత మ్యూజిక్, ఆర్. డి రాజశేఖర్ విజువల్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ చిత్రం తెలుగు హక్కులను మాకు అందించడానికి సంపూర్ణ సహకారం అందించిన కె.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు రావూరి వి. శ్రీనివాస్. -
మహానటుల్లో ఆయన ఉంటారు
‘‘గాయత్రి’ సినిమా తండ్రి, కూతుళ్ల కథ. పూర్తిగా వారి మధ్యన నడుస్తుంది. గాయత్రిగా నిఖిలా విమల్ నటించారు. మోహన్‌బాబుగారు ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్ర పేరు గాయత్రీపటేల్.. మరొకటి శివాజీ. గాయత్రీపటేల్ పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది’’ అని దర్శకుడు మదన్ రామిగాని అన్నారు. మోహన్‌బాబు హీరోగా విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘గాయత్రి’. అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మదన్ చెప్పిన విశేషాలు.. ► మన జీవితంలో చాలా విషయాలు కష్టమైనవి, ఇష్టమైనవి ఉంటాయి. రెండూ ముడిపడి ఉండేదే గాయత్రి. ఓ విభిన్నమైన అంశం ఈ సినిమాలో ఉంటుంది. అదేంటన్నది తెరపై చూడాలి. ► ‘గాయత్రి’ సినిమా మోహన్‌బాబుగారికి రీ–లాంచ్ లాంటిది. ఆయన మంచి సలహాలు ఇచ్చారు. ఎవరు సలహా చెప్పినా ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తారు. అదే మోహన్బాబుగారిలోని గొప్పదనం. కేవలం ఒక్క సిట్టింగ్‌లో సినిమా ఓకే చేసేశారు. ఆయనతో పనిచేయడం గర్వంగా ఉంది. ► మోహన్‌బాబుగారు మహానటుడు. అంతటి నటుణ్ణి ఎలా హ్యాండిల్ చేయగలనా? అనిపించేది. ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, ఏయన్నార్, శివాజీ గణేశన్ గార్లు మహానటులు. ఆ జాబితాలో ఆయనుంటారు. ఆయనకు గొప్ప పాత్రలు రాయాలంతే. విష్ణు పాత్ర ఇద్దరు మోహన్బాబుల్లో ఒకరికి యంగర్ వెర్షన్‌గా ఉంటుంది. ► ఫ్యామిలీ డ్రామాల్లో కొత్త.. పాత ఉండదు. అన్నిటిలోనూ ఎమోషన్ ఉంటుంది. ట్రెండ్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు తీసినా పండుతాయి. నేను తక్కువ సినిమాలు చేయడానికి ప్రత్యేక కారణం ఏం లేదు. ఎందుకో అలా కుదిరింది. కొత్త కథలు రాసుకుంటున్నా. ఈ ఏడాదే మరో చిత్రం ఉంటుంది. అది ఎవరితో అన్నది తర్వాత చెబుతా. -
విర్రవీగితే తొక్కేస్తాడు – మోహన్‌బాబు
‘‘మాకు తెలిసిన ఫీల్డ్, వ్యాపారం సినిమా. నటుడిగా పుట్టా. నటుడిగా.. నిర్మాతగా తప్ప వేరే వ్యాపకాలు లేవు. భగవంతుడి ఆశీర్వాదాలతో విద్యాసంస్థ స్థాపించా’’ అని నటులు మంచు మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు హీరోగా విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘గాయత్రి’. మదన్ రామిగాని దర్శకత్వంలో అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మించారు. తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కష్టపడి సినిమా తీశాం. విజయం భగవంతుని ఆశీస్సులతో ఉంటుంది. అలా తీశాం.. ఇలా తీశాం.. అంటుంటాం. కానీ అన్నీ భగవంతుడు చూస్తుంటాడు. ఎంత అణిగి మణిగి ఉంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన మనకు ఇస్తాడు. విర్రవీగినప్పుడు ఒక తొక్కు తొక్కుతాడు. దాదాపు 60పైన సినిమాలు తీశాం. జయాలు.. అపజయాలున్నాయి. విజయం వచ్చినప్పుడు విర్ర వీగలేదు.. అపజయం వచ్చినప్పుడు కుంగిపోలేదు. ఐదు సినిమాలు హిట్ అయినా.. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే.. ఐదు సినిమాల హిట్టూ పోతుంది. నన్ను నటుడిగా పరిచయం చేసిన మా గురువు దాసరి నారాయణరావుగారు ఎంత గొప్ప దర్శకుడో ఈ జనరేషన్‌కి తెలీదు. మహానటుడు ఎన్టీఆర్ తర్వాత డైలాగులు చెప్పగలడని నాకు పేరొచ్చిందంటే ఆ క్రెడిట్ మా గురువుగారిదే. నన్ను నా వైఫ్ నిర్మల ఎప్పుడూ ‘బావా’ అని ప్రేమగా పిలిచేది. కానీ.. ఈ మధ్య పిలవడం లేదు. ఎందుకంటే నాకు సక్సెస్ లేదు కదా. సక్సెస్ లేకపోతే ఎవరూ పిలవరు (నవ్వుతూ). ‘గాయత్రి’ సినిమాలో శ్రియ నటన చూసి నాకు కౌగిలించుకోవాలని కోరిక ఉండేది. కానీ విష్ణు ఎక్కడ సీరియస్ అవుతాడోనని ఊరుకున్నా (నవ్వుతూ). ‘గాయత్రి’ చిత్రంలో విష్ణు తన నటనతో కంటతడి పెట్టించాడు. సెన్సార్ కాకుండా ఫిబ్రవరి 9వ తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పకూడదు. సెన్సార్ పూర్తయి అదే తారీఖుకి సినిమా విడుదలవుతుందని.. అవ్వాలని కోరుకుందాం. మదన్ ‘గాయత్రి’ సినిమాను అద్భుతంగా తీశాడు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు’’ అన్నారు. ‘‘42 ఏళ్ల కెరీర్లో ఓ పాత్రకీ మరో పాత్రకీ సంబంధం లేని పాత్రలు చేశారు మోహన్‌బాబు’’ అన్నారు ఎంపీ, ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి. మదన్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ సినిమాలో ఓ డైలాగ్ రాశా. ‘మనుషులను చదివినవాడు వేదాంతి అయినా అవుతాడు లేదా వ్యాపారి అయినా అవుతాడు’ అని. ఈ సందర్భంలో ఆ డైలాగ్ రాయాల్సి వస్తే ‘మనుషులను చదివినవాడు వేదాంతి అయినా అవుతాడు.. వ్యాపారి అయినా అవుతాడు.. లేదా మోహన్బాబుగారిలాగా మహా నటుడైనా అవుతాడు’’ అన్నారు. ‘‘గాయత్రి’లో నా పాత్ర నా కెరీర్లో వన్నాఫ్ ది మోస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది’’ అన్నారు విష్ణు. నటులు కోటా శ్రీనివాసరావు, గిరిబాబు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, డైరెక్టర్ బి.గోపాల్, మంచు లక్ష్మి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
అదిరిపోయే డైలాగ్స్!
డైలాగ్స్ చెప్పడంలో మోహన్‌బాబు స్టైలే డిఫరెంట్. స్క్రీన్‌పై ఆయన డైలాగ్స్ చెబుతుంటే ప్రేక్షకుల రెస్పాన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. త్వరలో విడుదల కాబోతున్న ‘గాయత్రి’లో పవర్ఫుల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. మోహన్‌బాబు, విష్ణు, శ్రియ, నిఖిలా విమల్ ముఖ్య తారలుగా ఆర్.మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాయత్రి’. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. టీజర్లో మోహన్‌బాబు చెప్పిన డైలాగ్స్ అదిరిపోయేలా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. ‘‘మోహన్‌బాబుగారి నటన ఈ సినిమాకు కొండంత అండ’’ అని చిత్రబృందం చెబుతోంది. అనసూయ, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. ‘గాయత్రి’ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
తర్వాత సంగతి తర్వాత!
కొంతమంది మనస్తత్వం అంతే.. మనసులో ఏదనిపిస్తే అది బయటకు చెప్పేస్తారు. తర్వాత సంగతి తర్వాత అంటారు. ఎవరేమనుకుంటారో అని భయపడరు. లోపల ఒకటి అనుకొని బయట ఇంకోలాగా ప్రవర్తించటం వాళ్లకు చేత కాదు. అలాంటి మనస్తత్వం ఉన్న పాత్రనే పోషించారు శ్రియ ‘గాయత్రి’ సినిమాలో. ఈ సినిమాలో శ్రియ లుక్‌ను శనివారం విడుదల చేశారు. ‘నేనేదనుకుంటే అది చెప్పటం నాకలవాటు.. తర్వాత సంగతి తర్వాత’ అని క్యాప్షన్ ఉన్న ఆమె పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పణలో మంచు మోహన్‌బాబు నటించి, శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పై నిర్మించిన ఈ సినిమాలో గాయత్రి పాత్రను నిఖిలా విమల్ పోషించారు. విష్ణు, శ్రియ భార్యాభర్తలుగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు మదన్ రామిగాని దర్శకుడు. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సర్వేష్ మురారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్.ఆర్. -
విష్ణు పవర్ఫుల్... శ్రియ స్పెషల్!
ఎవరికి? మంచు మోహన్‌బాబు ‘గాయత్రి’కి! యస్... ‘పెళ్లైన కొత్తలో’ ఫేమ్ మదన్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘గాయత్రి’లో మంచు విష్ణు, శ్రియ నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగులో పాల్గొంటున్నారు కూడా! ఓ రకంగా ప్రేక్షకులకు స్వీట్ సర్ప్రైజే ఇది. సైలెంట్‌గా, లో ప్రొఫైల్‌లో ఈ సిన్మా షూటింగ్ చేస్తున్నారు. కొంత విరామం తర్వాత మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. తెరపై ఆయనుంటే చాలు. డైలాగులతో, నటనతో చెలరేగుతారు. మరి, ఆయనకు తోడు తనయుడు విష్ణు, శ్రియ అనగానే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలుగుతోంది. పవర్ఫుల్ పాత్రలో విష్ణు, స్పెషల్ రోల్లో శ్రియ కనిపించనున్నారని చిత్రబృందం తెలిపింది. ఇప్పుడీ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సోమవారం విష్ణు సెట్స్‌లో జాయిన్ అయ్యారు. అదే రోజున నందమూరి బాలకృష్ణ ‘గాయత్రి’ సెట్స్‌కి విచ్చేసి మోహన్‌బాబు, విష్ణులను కలసి కాసేపు వారితో ముచ్చటించారు. అనసూయ, ‘మేడ మీద అబ్బాయి’ ఫేమ్ నిఖిలా విమల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. -
సైలెంట్‌గా.. హిట్ ఖాయం
మోహన్‌బాబుకు కూతురంటే ఎంతో ప్రేమ... రియల్ లైఫ్‌లో ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది! ఇప్పుడు రీల్ లైఫ్‌లోనూ కొంచెం అటువంటి పాత్రనే పోషిస్తున్నారట! కొంత విరామం తర్వాత మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘గాయత్రి’. ‘పెళ్లైన కొత్తలో’ ఫేమ్ మదన్ దర్శకుడు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. మొన్న జూలైలో షూటింగ్ మొదలైంది. అప్పటి నుంచి సైలెంట్‌గా షూట్ కానిచ్చేస్తున్నారు.ఒక్క మేటర్ కూడా బయటకు రానివ్వడం లేదు. అసలు సిన్మా కథ ఏంటని ఆరా తీస్తే... ఇందులో కూతురిపై ఎంతో ప్రేమ గల తండ్రిగా మోహన్‌బాబు, ఆయన కుమార్తెగా ‘మేడ మీద అబ్బాయి’ ఫేమ్ నిఖిలా విమల్ నటిస్తున్నారని తెలిసింది. కూతురి కోసం తండ్రి ఏం చేశాడనేది కథ అట!! వెరీ హై ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ అట! విలువలతో పాటు కమర్షియల్ అంశాలు ఉన్నాయని సమాచారం! స్ట్రాంగ్ కంటెంట్‌కి గ్రేట్ యాక్టర్ మోహన్‌బాబు తోడవడంతో టీమంతా పెద్ద హిట్ కొట్టబోతున్నామని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. షూటింగులో కొన్ని సీన్లు చూసినోళ్లు కూడా అదే మాట చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. నాగినీడు, ‘సత్యం’ రాజేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కళ: చిన్నా, ఫైట్స్: కనల్ కణ్ణన్, కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం
–‘అల్లరి’ నరేశ్ మేడమీద అబ్బాయి’ విడుదలైన అన్ని చోట్లా మంచి టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. నరేశ్, నిఖిలా విమల్ జంటగా జి. ప్రజిత్ దర్శకత్వంలో నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన ‘మేడ మీద అబ్బాయి’ ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నరేశ్ మాట్లాడుతూ– ‘‘స్పూఫ్‌లు లేకుండా కథను, అందులోని పాత్రలు, సన్నివేశాలు, కామెడీని బేస్ చేసుకుని తెరకెక్కించిన చిత్రమిది. సైబర్ క్రైమ్ ద్వారా ఎలాంటి మోసాలు జరుగుతు న్నాయో చూపించి చిన్న మెసేజ్ ఇచ్చాం. చంద్రశేఖర్‌గారు ఈ సినిమాను ఓన్‌గా రిలీజ్ చేశారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. అప్పుడే మరిన్ని సక్సెస్‌లు సాధించొచ్చు’’ అన్నారు. ‘‘ఇది డిఫరెంట్ మూవీ అని రిలీజ్‌కు ముందే చెప్పాను. అందుకే స్లో పాయిజన్‌లా సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. కొత్త కాన్సెప్ట్ మూవీస్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని మరో సారి రుజువైంది’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. ‘‘మూవీ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు చంద్రశేఖర్. -
కొంచెం కొత్తగా చేయమన్నారు
‘అల్లరి’ నరేశ్ ‘‘గమ్యం’ సినిమాలో నేను చేసిన గాలి శీను పాత్ర నవ్విస్తూనే ఏడిపిస్తుంది. అలాంటి కథ కోసం చాలా కాలం ఎదురు చూశా. ‘నేను, గమ్యం’ చిత్రాల తరహా సీరియస్ సినిమా చేద్దామని ‘కెవ్వు కేక’ టైమ్ నుంచి చంద్రశేఖర్‌గారు అడుగుతున్నారు. కామెడీకి థ్రిల్లర్ అంశాల్ని జోడించిన అటువంటి కథే మలయాళ ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’. నిర్మాతకు, నాకు బాగా నచ్చడంతో ‘మేడమీద అబ్బాయి’గా తెలుగులో రీమేక్ చేశాం’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. నరేశ్, నిఖిలా విమల్ జంటగా జి. ప్రజిత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. ట్రైలర్‌ని విడుదల చేసిన అనంతరం నరేశ్ మాట్లాడుతూ– ‘‘మీ సినిమాలు మూస ధోరణిలో ఉంటున్నాయి. కొంచెం కొత్తగా ప్రయత్నించమని చాలామంది అడిగారు. కొత్తగా చేయాలని ఆలోచించి చేసిన ప్రయత్నమే ఈ ‘మేడ మీద అబ్బాయి’. సెప్టెంబర్ 8న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అల్లరి, ప్రాణం, గమ్యం, శంభో శివ శంభో... ఈ నాలుగు సినిమాలు కలిస్తే ఎలా ఉంటుందో ‘మేడమీద అబ్బాయి’ ఆ స్థాయిలో ఉంటుంది’’ అన్నారు నిర్మాత. నటుడు ‘హైపర్’ ఆది, రచయిత విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు ఎమ్మెస్ కుమార్, సీతారామరాజు పాల్గొన్నారు. -
సిబిరాజ్‌కు జంటగా కిడారి నాయకి
కిడారి చిత్రంలో శశికుమార్‌కు జంటగా నటించి చక్కని హావభావాలతో తమిళ ప్రేక్షకులను అలరించిన నటి నిఖిలవిమల్. ఈ అమ్మడికిప్పుడు నటుడు సిబిరాజ్‌తో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. సిబిరాజ్ నటించిన కట్టప్పావ కానోమ్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.దీంతో ఆయన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. బాస్ ఫిలింస్ పతాకంపై నిర్మాత విజయ్ కే.సెల్లయ్య నిర్మిస్తున్న ఈచిత్రానికి దర్శకుడు విజయ్Š. దురై శిష్యుడు, పలు వాణిజ్య ప్రకటనలు రూపొందించిన వినోద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో నటించడానికి నటి నిఖిలవిమల్ చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తోందట. దీని గురించి ఈ బ్యూటీ చెబుతూ ఇంతకు ముందు నటించిన చిత్రంలో తనను గ్రామీణ యువతిగా చూసిన తమిళ ప్రేక్షకులు ఈ చిత్రంలో సిటీ గర్ల్‌గా చూడబోతున్నారని చెప్పింది.యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఒకే కార్యాలయంలో పని చేసే కళాకారులుగా తాను, సిబిరాజ్ నటించనున్నామని తెలిపింది. సామాజిక సమస్య ఇతివృత్తంగా రూపందనున్న మంచి కథా చిత్రంలో తానూ ఒక భాగం కానుండడం గర్వంగా ఉందని చెప్పింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ త్వరలో కశ్మీర్లో ప్రారంభం కానుందని, ఆ తరువాత పొల్లాచ్చి, చెన్నై ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకోనుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. -
రొమాంటిక్ ఎంటర్టైనర్లో...
‘ఒరు వడక్కన్ సెల్ఫీ’.. మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమా ఇది. దాదాపు 4 కోట్ల బడ్జెట్‌తో తీస్తే సుమారు 30 కోట్లు వసూలు చేసింది. కథ అలాంటిది. ఇప్పుడా చిత్రం తెలుగు రీమేక్‌లో ‘అల్లరి’ నరేశ్ నటించనున్నారు. జాహ్నవి ఫిల్మ్ బ్యానర్‌పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్ బొప్పన నిర్మించనున్నారు. మలయాళ చిత్రానికి డైరెక్ట్ చేసిన జి.ప్రజీత్ తెలుగు వెర్షన్‌ను కూడా తెరకెక్కించనున్నారు. ‘అల్లరి’ నరేశ్, నిఖిలా విమల్ హీరో, హీరోయిన్లులుగా, కీలక పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటించనున్నారు. ‘‘ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్. స్క్రీన్‌ప్లే ఉత్కంఠ కల్గిస్తుంది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 5 వరకు పొల్లాచ్చిలో, ఆ తర్వాత హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతాం. తెలుగులోనూ ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డీజేlవసంత్, మాటలు: ‘పిల్ల జమిందార్’ చంద్రశేఖర్, కెమేరా: ఉన్ని.ఎస్. కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎమ్.ఎస్ కుమార్.