
కార్తీ
‘ఖైదీ’ వంటి సూపర్‌హిట్ తర్వాత కార్తీ నటించిన తమిళ చిత్రం ‘తంబి’. ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జ్యోతిక, నికిలా విమల్, సత్యరాజ్ కీలక పాత్రధారులు. ఈ సినిమా తెలుగులో ‘దొంగ’ అనే టైటిల్‌తో ఈ నెల 20న రిలీజ్ కానుంది. తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ‘‘యాక్షన్‌తో కూడిన ఎమోషనల్ చిత్రం ఇది. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. గోవింద్ వసంత మ్యూజిక్, ఆర్. డి రాజశేఖర్ విజువల్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ చిత్రం తెలుగు హక్కులను మాకు అందించడానికి సంపూర్ణ సహకారం అందించిన కె.ఎఫ్.సి ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు రావూరి వి. శ్రీనివాస్.
Comments
Please login to add a commentAdd a comment