Donga Movie
-
ఖైదీ తర్వాత దొంగ ఏంటి?
‘‘ఊపిరి’ సినిమాలో కార్తీ నటన అద్భుతం. తన గురించి చెప్పాలంటే వెయ్యిలో ఒక్కడు. మూడు సార్లు బెస్ట్ యాక్టర్‌గా ఫిలిం ఫేర్ అవార్డ్ గెలుచుకున్నారు. జీతూ చాలా తెలివైన డైరెక్టర్. ‘ఖైదీ’ కంటే ‘దొంగ’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’’ అని సీనియర్ దర్శకులు శివనాగేశ్వర రావు అన్నారు. కార్తీ హీరోగా ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దొంగ’. వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ పతాకాలపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో హర్షిత మూవీస్ పతాకంపై రావూరి వి. శ్రీనివాస్ రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కార్తీ మాట్లాడుతూ– ‘‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ ఏంటి? అని అందరూ అడుగుతున్నారు. రెండూ చిరంజీవిగారికి పెద్ద హిట్ ఇచ్చిన టైటిల్సే. స్క్రిప్ట్‌కి తగ్గట్టే ఈ రెండు పేర్లు పెట్టాం. ‘దొంగ’ కథ వినేటప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అక్కాతమ్ముడు రిలేషన్షిప్ ఇంట్రెస్టింగ్గా, ఎమోషనల్‌గా అనిపించింది. మా నాన్న క్యారెక్టర్ సత్యరాజ్‌గారు చేశారు. మా మూడు పాత్రలు సినిమాకి పిల్లర్స్ లాంటివి. ‘నా పేరు శివ, ఊపిరి’ కలిపితే వచ్చిన వైవిధ్యమైన సినిమాలా ‘దొంగ’ ఉంటుంది’’ అన్నారు. ‘‘దృశ్యం’ సినిమా తెలుగులో రీమేక్ అయి పెద్ద విజయం సాధించినప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఓ సినిమా చేయాలనుకున్నా. ఇప్పుడు ‘దొంగ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు జీతూ జోసెఫ్. నటుడు సత్యరాజ్, డైలాగ్ రైటర్ హనుమా¯Œ చౌదరి, హీరోయి¯Œ నిఖిలా విమల్ తదితరులు పాల్గొన్నారు. -
‘దొంగ’ ప్రీ రిలీజ్ వేడుక
-
నచ్చిన సినిమాలే చేస్తాను
‘‘దొంగ’ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలానే దర్శకుడు జీతూ జోసెఫ్ సినిమాల్లో కనిపించే సస్పెన్స్, థ్రిల్స్ కూడా ఉంటాయి. నేను చేసిన ‘ఊపిరి, నా పేరు శివ’ సినిమాలను కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో అలాంటి ఛాయలుంటాయి’’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, నిఖిలా విమల్ జంటగా జ్యోతిక, సత్యరాజ్, ‘షావుకారు’ జానకి ముఖ్య పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘తంబీ’. తెలుగులో ‘దొంగ’ పేరుతో రిలీజ్ కాబోతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రావూరి వి. శ్రీనివాస్ నిర్మించారు. ఈ నెల 20న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న సందర్భంగా కార్తీ పంచుకున్న విశేషాలు.. ► నా కెరీర్లో ఇప్పటి వరకూ 19 సినిమాలు చేశాను. ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడ్డాను. స్క్రిప్ట్ నాకు బాగా నచ్చితేనే సినిమా చేశాను. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తుంటాను. ఈ సినిమా ‘ఖైదీ’ వచ్చిన రెండు నెలల తర్వాత వస్తుండొచ్చు, కానీ రెండేళ్ల నుంచి పక్కా ప్లానింగ్‌తో ‘దొంగ’ సినిమా చేశాం. ► ‘రంగ్ దే బసంతి’ రాసిన రచయిత రెన్సిల్ డిసిల్వ ఈ కథను నా దగ్గరకు తీసుకువచ్చారు. ఈ కథ నాకు బాగా నచ్చింది. వదిన(జ్యోతిక) కూడా ఈ కథ విన్నారు. దర్శకుడు ఎవరు? అని అనుకుంటుంటే.. జీతూ జోసెఫ్ కరెక్ట్ అని అనుకున్నాం. నేనూ, వదినా ఈ సినిమా చేయబోతున్నాం అని తెలిసి ఆయన కూడా ఓకే అన్నారు. ఆయనకి ఈ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో మాకు మరింత నమ్మకం వచ్చింది. ► వదినతో యాక్ట్ చేయడం ఇంట్లో కూర్చొని మాట్లాడినట్టే ఉండేది. ఎందుకంటే ఈ సినిమాలో మా పాత్రలు కూడా అలానే ఉంటాయి. మేమిద్దరం అక్కాతమ్ముడి పాత్రల్లో నటించాం. నెల రోజుల ముందే డైలాగ్స్ అన్నీ నేర్చుకుని సెట్‌కి వచ్చేవారు వదిన. ► ఈ సినిమాను అన్నయ్య(సూర్య) ఇంకా చూడలేదు. థియేటర్స్‌లోనే చూస్తా అని చెప్పారు. ► ఇందులో సత్యరాజ్ మా తండ్రి పాత్రలో నటించారు. ‘షావుకారు’ జానకి మా బామ్మ పాత్ర చేశారు. ఇంతమంది అద్భుతమైన నటీ నటులతో పని చేసినప్పుడు మనం కూడా బాగా చేస్తాం. చాలా నేర్చుకుంటాం. ► నా గత చిత్రం ‘ఖైదీ’ చిరంజీవిగారి సినిమా టైటిలే. ఇది కూడా చిరంజీవిగారి సినిమా టైటిలే. ఆయన కూడా ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ సినిమా చేశారని నాతో ఎవరో అన్నారు. మంచి శకునం అనుకున్నాను. ► ప్రస్తుతం మణిరత్నంగారి ‘పొన్నియిన్ సెల్వమ్’ షూటింగ్ థాయ్‌ల్యాండ్‌లో జరుగుతోంది. ‘దొంగ’ ప్రమోషన్స్ కోసం చిన్న బ్రేక్ తీసుకొని వచ్చాను. మళ్లీ వెళ్లి షూటిం గ్లో జాయిన్ అవుతాను. -
ఆరంభమే ముద్దులతో..
సినిమా: కార్తీతో ఆరంభంలోనే ముద్దు సన్నివేశంలో నటించానని నటి నికిలా విమల్ చెప్పుకొచ్చింది. ఈ మలయాళీ కుట్టి ఇంతకు ముందు కిడారి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత తంబి చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కార్తీ, నటి జ్యోతిక అక్కా, తమ్ముడుగా నటిస్తున్న చిత్రం తంబి. నటుడు సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జీతు జోసఫ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 20వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. తంబి చిత్రంలో నటుడు కార్తీతో నటించిన అనుభవం గురించి నటి నికిల విమల్ పేర్కొంటూ జీతూజోసప్ దర్శకత్వంలో ఇంతకు ముందే ఒక మలమాళ చిత్రంలో నటించాల్సిందని, కాల్షీట్స్ సమస్య కారణంగా నటించలేకపోయినట్లు చెప్పింది. అప్పుడు మరో చిత్రంలో నటించే అవకాశం ఇస్తానని దర్శకుడు తెలిపారంది. అలా ఒక సారి ఫోన్ చేసి తమిళంలో ఒక చిత్రం చేస్తున్నానని, అందులో జ్యోతిక, కార్తీ, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారని చెప్పారని తెలిపింది. ఈ చిత్రంలో కార్తీకి జంటగా ఒక పాత్ర ఉంది, నువ్వు నటిస్తావా? అని అడిగారని చెప్పింది. దర్శకుడు అంత నిజాయితీగా చెప్పడంతో తాను వెంటనే తంబి చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది. ఉత్తమ కళాకారులతో నటించాలని తాను కోరుకుంటానని, అలాంటి మంచి అవకాశం ఈ చిత్రంలో లభించిందని అంది. తనకు తమిళ భాష తెలియడంతో ఈ చిత్రంలో నటించడం సులభం అనిపించిందని చెప్పింది. చాలామంది మాదిరిగానే తానూ నటుడు సూర్య, జ్యోతికలను తెరపై చూసి ఆనందించానని చెప్పింది. అలాంటిది ఇప్పుడు నటి జ్యోతకతో కలిసి ఈ తంబి చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని పేర్కొంది. సాధారణంగా చాలా చిత్రాల్లో ఆరంభంలో చిన్నచిన్న సన్నివేశాల్లో నటింపజేస్తారని అంది. అలాంటిది ఈ చిత్రంలో తాను తొలి రోజే డ్యూయెట్ సాంగ్‌లో నటించాల్సిన పరిస్థితి అని చెప్పింది. అదీ కాకుండా తొలి షాట్‌లోనే కార్తీతో లిప్‌లాక్ సన్నివేశంలో నటించాల్సి రావడంతో చాలా భయపడ్డానని చెప్పింది. కార్తీ చాలా కూల్‌గా మాట్లాడి సహజంగా నటించమని చెప్పడంతో అలానే నటించినట్లు పేర్కొంది. -
ఖైదీ యాక్షన్
‘ఖైదీ’ వంటి సూపర్‌హిట్ తర్వాత కార్తీ నటించిన తమిళ చిత్రం ‘తంబి’. ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జ్యోతిక, నికిలా విమల్, సత్యరాజ్ కీలక పాత్రధారులు. ఈ సినిమా తెలుగులో ‘దొంగ’ అనే టైటిల్‌తో ఈ నెల 20న రిలీజ్ కానుంది. తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ‘‘యాక్షన్‌తో కూడిన ఎమోషనల్ చిత్రం ఇది. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. గోవింద్ వసంత మ్యూజిక్, ఆర్. డి రాజశేఖర్ విజువల్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ చిత్రం తెలుగు హక్కులను మాకు అందించడానికి సంపూర్ణ సహకారం అందించిన కె.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు రావూరి వి. శ్రీనివాస్. -
‘దొంగ’ టీజర్ విడుదల
-
ఒక్కొక్క కేసుకి.. ఒక్కో పేరు!
తమిళ హీరో కార్తీ తాజా చిత్రం ‘దొంగ’ టీజర్ నేడు విడుదలైంది. దృశ్యం ఫేం మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళంలో ‘తంబి’ పేరుతో తీసిన ఈ చిత్రానికి తెలుగులో ‘దొంగ’ టైటిల్ పెట్టారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో కార్తీకి అక్కగా ఆయన వదిన జ్యోతిక నటించారు.వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కీలకపాత్రల్లో సత్యరాజ్, షావుకారు జానకి కనిపించనున్నారు. తమిళ వెర్షన్ ‘తంబి’ టీజర్‌ను కూడా నేడు విడుదల చేశారు. వయకామ్ 18, సూరజ్ సదన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన ‘ఖైదీ’ సినిమా కార్తీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘ఖైదీ’, ‘దొంగ’ టైటిల్స్ రెండూ చిరంజీవి నటించిన సినిమా టైటిల్సే కావడం విశేషం.