నచ్చిన సినిమాలే చేస్తాను | Hero Karthi Interview About Donga Movie | Sakshi
Sakshi News home page

నచ్చిన సినిమాలే చేస్తాను

Published Mon, Dec 16 2019 12:12 AM | Last Updated on Mon, Dec 16 2019 4:36 AM

Hero Karthi Interview About Donga Movie - Sakshi

కార్తీ

‘‘దొంగ’ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. అలానే దర్శకుడు జీతూ జోసెఫ్‌ సినిమాల్లో కనిపించే సస్పెన్స్, థ్రిల్స్‌ కూడా ఉంటాయి. నేను చేసిన ‘ఊపిరి, నా పేరు శివ’ సినిమాలను కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో అలాంటి ఛాయలుంటాయి’’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, నిఖిలా విమల్‌ జంటగా జ్యోతిక, సత్యరాజ్, ‘షావుకారు’ జానకి ముఖ్య పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘తంబీ’. తెలుగులో ‘దొంగ’ పేరుతో రిలీజ్‌ కాబోతోంది. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రావూరి వి. శ్రీనివాస్‌ నిర్మించారు. ఈ నెల 20న ఈ చిత్రం రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా కార్తీ పంచుకున్న విశేషాలు..

► నా కెరీర్‌లో ఇప్పటి వరకూ 19 సినిమాలు చేశాను. ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడ్డాను. స్క్రిప్ట్‌ నాకు బాగా నచ్చితేనే సినిమా చేశాను. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తుంటాను. ఈ సినిమా ‘ఖైదీ’ వచ్చిన రెండు నెలల తర్వాత వస్తుండొచ్చు, కానీ రెండేళ్ల నుంచి పక్కా ప్లానింగ్‌తో ‘దొంగ’ సినిమా చేశాం.

► ‘రంగ్‌ దే బసంతి’ రాసిన రచయిత రెన్సిల్‌ డిసిల్వ ఈ కథను నా దగ్గరకు తీసుకువచ్చారు. ఈ కథ నాకు బాగా నచ్చింది. వదిన(జ్యోతిక) కూడా ఈ కథ విన్నారు. దర్శకుడు ఎవరు? అని అనుకుంటుంటే.. జీతూ జోసెఫ్‌ కరెక్ట్‌ అని అనుకున్నాం. నేనూ, వదినా ఈ సినిమా చేయబోతున్నాం అని తెలిసి ఆయన కూడా ఓకే అన్నారు. ఆయనకి ఈ స్క్రిప్ట్‌ బాగా నచ్చడంతో మాకు మరింత నమ్మకం వచ్చింది.

► వదినతో యాక్ట్‌ చేయడం ఇంట్లో కూర్చొని మాట్లాడినట్టే ఉండేది. ఎందుకంటే ఈ సినిమాలో మా పాత్రలు కూడా అలానే ఉంటాయి. మేమిద్దరం అక్కాతమ్ముడి పాత్రల్లో నటించాం. నెల రోజుల ముందే డైలాగ్స్‌ అన్నీ నేర్చుకుని సెట్‌కి వచ్చేవారు వదిన.

► ఈ సినిమాను అన్నయ్య(సూర్య) ఇంకా చూడలేదు. థియేటర్స్‌లోనే చూస్తా అని చెప్పారు.

► ఇందులో సత్యరాజ్‌ మా తండ్రి పాత్రలో నటించారు. ‘షావుకారు’ జానకి మా బామ్మ పాత్ర చేశారు.  ఇంతమంది అద్భుతమైన నటీ నటులతో పని చేసినప్పుడు మనం కూడా బాగా చేస్తాం. చాలా నేర్చుకుంటాం.

► నా గత చిత్రం ‘ఖైదీ’ చిరంజీవిగారి సినిమా టైటిలే. ఇది కూడా చిరంజీవిగారి సినిమా టైటిలే. ఆయన కూడా ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ సినిమా చేశారని నాతో ఎవరో అన్నారు. మంచి శకునం అనుకున్నాను.

► ప్రస్తుతం మణిరత్నంగారి ‘పొన్నియిన్‌ సెల్వమ్‌’ షూటింగ్‌ థాయ్‌ల్యాండ్‌లో జరుగుతోంది. ‘దొంగ’ ప్రమోషన్స్‌ కోసం చిన్న బ్రేక్‌ తీసుకొని వచ్చాను. మళ్లీ వెళ్లి షూటిం గ్‌లో జాయిన్‌ అవుతాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement