
ఎవరికి? మంచు మోహన్‌బాబు ‘గాయత్రి’కి! యస్... ‘పెళ్లైన కొత్తలో’ ఫేమ్ మదన్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘గాయత్రి’లో మంచు విష్ణు, శ్రియ నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగులో పాల్గొంటున్నారు కూడా! ఓ రకంగా ప్రేక్షకులకు స్వీట్ సర్‌ప్రైజే ఇది. సైలెంట్‌గా, లో ప్రొఫైల్‌లో ఈ సిన్మా షూటింగ్ చేస్తున్నారు. కొంత విరామం తర్వాత మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. తెరపై ఆయనుంటే చాలు. డైలాగులతో, నటనతో చెలరేగుతారు.
మరి, ఆయనకు తోడు తనయుడు విష్ణు, శ్రియ అనగానే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలుగుతోంది. పవర్‌ఫుల్ పాత్రలో విష్ణు, స్పెషల్ రోల్‌లో శ్రియ కనిపించనున్నారని చిత్రబృందం తెలిపింది. ఇప్పుడీ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సోమవారం విష్ణు సెట్స్‌లో జాయిన్ అయ్యారు. అదే రోజున నందమూరి బాలకృష్ణ ‘గాయత్రి’ సెట్స్‌కి విచ్చేసి మోహన్‌బాబు, విష్ణులను కలసి కాసేపు వారితో ముచ్చటించారు. అనసూయ, ‘మేడ మీద అబ్బాయి’ ఫేమ్ నిఖిలా విమల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment