రాముడు చేసింది తప్పు అయితే నాదీ తప్పే | First Look of Mohan Babu's 'Gayatri' Unveiled! | Sakshi
Sakshi News home page

రాముడు చేసింది తప్పు అయితే నాదీ తప్పే

Published Tue, Dec 26 2017 12:16 AM | Last Updated on Tue, Dec 26 2017 12:16 AM

First Look of Mohan Babu's 'Gayatri' Unveiled! - Sakshi

... అంటున్నారు మోహన్‌బాబు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి? ఆ తప్పుని రైట్‌ అని చెప్పడానికి రాముడితో ఎందుకు పోల్చారు? అనేది తెలియాలంటే ‘గాయత్రి’ సినిమా చూడాల్సిందే. విలక్షణ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రంలో గాయత్రి పాత్రను నిఖిలా రామన్‌ పోషిస్తున్నారు. ఆరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మదన్‌ రామిగాని దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ఈ చిత్రంలో మోహన్‌బాబు పవర్‌ఫుల్‌ లుక్‌ను విడుదల చేశారు.

‘ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే నాదీ తప్పే’ అనే క్యాప్షన్‌తో ఉన్న పోస్టర్‌తో విడుదలైన ఈ లుక్‌ ఆసక్తి పెంచే విధంగా ఉంది. ఇందులో మంచు విష్ణు, శ్రియ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేయటానికి ప్లాన్‌ చేస్తున్నారు. బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్‌ ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్, కెమెరా: సర్వేశ్‌ మురారి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విజయ్‌కుమార్‌ ఆర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement