
డైలాగ్స్ చెప్పడంలో మోహన్‌బాబు స్టైలే డిఫరెంట్. స్క్రీన్‌పై ఆయన డైలాగ్స్ చెబుతుంటే ప్రేక్షకుల రెస్పాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. త్వరలో విడుదల కాబోతున్న ‘గాయత్రి’లో పవర్‌ఫుల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. మోహన్‌బాబు, విష్ణు, శ్రియ, నిఖిలా విమల్ ముఖ్య తారలుగా ఆర్.మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాయత్రి’.
శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. టీజర్‌లో మోహన్‌బాబు చెప్పిన డైలాగ్స్ అదిరిపోయేలా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. ‘‘మోహన్‌బాబుగారి నటన ఈ సినిమాకు కొండంత అండ’’ అని చిత్రబృందం చెబుతోంది. అనసూయ, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. ‘గాయత్రి’ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment