రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో... | Allari Naresh's remake launched | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో...

Published Thu, Mar 9 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో...

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో...

‘ఒరు వడక్కన్‌ సెల్ఫీ’.. మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమా ఇది. దాదాపు 4 కోట్ల బడ్జెట్‌తో తీస్తే సుమారు 30 కోట్లు వసూలు చేసింది. కథ అలాంటిది. ఇప్పుడా చిత్రం తెలుగు రీమేక్‌లో ‘అల్లరి’ నరేశ్‌ నటించనున్నారు. జాహ్నవి ఫిల్మ్‌ బ్యానర్‌పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్‌ బొప్పన నిర్మించనున్నారు. మలయాళ చిత్రానికి డైరెక్ట్‌ చేసిన జి.ప్రజీత్‌ తెలుగు వెర్షన్‌ను కూడా తెరకెక్కించనున్నారు.

‘అల్లరి’ నరేశ్, నిఖిలా విమల్‌ హీరో, హీరోయిన్లులుగా, కీలక పాత్రలో అవసరాల శ్రీనివాస్‌ నటించనున్నారు. ‘‘ఇది రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. స్క్రీన్‌ప్లే ఉత్కంఠ కల్గిస్తుంది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 5 వరకు పొల్లాచ్చిలో, ఆ తర్వాత హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతాం. తెలుగులోనూ ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డీజేlవసంత్, మాటలు: ‘పిల్ల జమిందార్‌’ చంద్రశేఖర్, కెమేరా: ఉన్ని.ఎస్‌. కుమార్, ఎడిటింగ్‌: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎమ్‌.ఎస్‌ కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement