romantic entertainer
-
హీరోగా రాఘవేంద్రుడు
దర్శకులు రాఘవేంద్రరావు తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్లో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు సాధారణం. ఆయన తదుపరి సినిమాలోనూ ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలిసింది. అయితే ఇది ఆయన దర్శకుడిగా తెరకెక్కించే సినిమాలో కాదు. హీరోగా చేయబోతున్న సినిమాలో. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఆయన కథానాయకుడిగా, నలుగురు హీరోయిన్లతో ఓ సినిమా ప్రస్తుతం ప్లానింగ్‌లో ఉంది. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్లు రమ్యకృష్ణ, శ్రియ, సమంత, ఓ కొత్త హీరోయిన్ నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ సినిమాలో రాఘవేంద్రరావు భార్యగా రమ్యకృష్ణ కనిపిస్తారట. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకుడు. జనార్దన∙మహర్షి కథారచయిత, చంద్రబోస్ పాటల రచయిత, కీరవాణి సంగీత దర్శకుడు. -
రొమాంటిక్ ఎంటర్టైనర్లో...
‘వంగవీటి, జార్జి రెడ్డి’ వంటి సినిమాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సందీప్ మాధవ్. తాజాగా ఆయన నటించనున్న సినిమాని ప్రకటించారు. ఈ చిత్రంతో రచయిత జె.వి. మధుకిరణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. హల్సియన్ మూవీ పతాకంపై సినిమాటోగ్రాఫర్ అరుణ్ కుమార్ సూరపనేని ఈ సినిమా నిర్మించనున్నారు. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘వంగవీటి, జార్జి రెడ్డి’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన సందీప్ మాధవ్ ఈ సినిమాతో మరింత దగ్గరవుతారు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని రూపొందించనున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ‘వంగవీటి’, ‘జార్జి రెడ్డి’.. ఈ రెండూ యాక్షన్ సినిమాలే. తాజా సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ కాబట్టి కొత్త లుక్‌లో సందీప్ కనిపిస్తారని ఊహించ్చు. -
రొమాంటిక్ ఎంటర్టైనర్లో...
‘ఒరు వడక్కన్ సెల్ఫీ’.. మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమా ఇది. దాదాపు 4 కోట్ల బడ్జెట్‌తో తీస్తే సుమారు 30 కోట్లు వసూలు చేసింది. కథ అలాంటిది. ఇప్పుడా చిత్రం తెలుగు రీమేక్‌లో ‘అల్లరి’ నరేశ్ నటించనున్నారు. జాహ్నవి ఫిల్మ్ బ్యానర్‌పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్ బొప్పన నిర్మించనున్నారు. మలయాళ చిత్రానికి డైరెక్ట్ చేసిన జి.ప్రజీత్ తెలుగు వెర్షన్‌ను కూడా తెరకెక్కించనున్నారు. ‘అల్లరి’ నరేశ్, నిఖిలా విమల్ హీరో, హీరోయిన్లులుగా, కీలక పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటించనున్నారు. ‘‘ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్. స్క్రీన్‌ప్లే ఉత్కంఠ కల్గిస్తుంది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 5 వరకు పొల్లాచ్చిలో, ఆ తర్వాత హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతాం. తెలుగులోనూ ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డీజేlవసంత్, మాటలు: ‘పిల్ల జమిందార్’ చంద్రశేఖర్, కెమేరా: ఉన్ని.ఎస్. కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎమ్.ఎస్ కుమార్. -
అన్యాయాలను ప్రశ్నిస్తుంది
సమాజంలో జరిగే అన్యాయాలను స్పృశిస్తూ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘ది బెల్స్’. రేయాన్ రాహుల్, నేహాదేశ్‌పాండే జంటగా ఎర్రోజు వెంకట ఆచారి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ నెల్లుట్ల దర్శకుడు. ఈ సినిమా మే నెలలో విడుదల కానుంది. వెంకట ఆచారి మాట్లాడుతూ -‘‘చక్కని సందేశంతో పాటు, మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇప్పటికే పాటలకు మంచి స్పందన లభిస్తోంది ’’ అని చెప్పారు. సమకాలీన అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, అన్ని వయసుల వారికి నచ్చే విధంగా ఉంటుందనీ దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కాసర్ల శ్యామ్. -
ఇవన్నీ సమాజంలో జరుగుతున్నవే!
అక్రమ సంబంధాలు మానవ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తాయనే కథాంశంతో దర్శకుడు పి. సునీల్‌కుమార్ రెడ్డి తీసిన చిత్రం ‘మిస్ లీలావతి’. కార్తీక్, లీలావతి ముఖ్య తారలుగా కీ ప్రొడక్షన్స్, శ్రావ్య ఫిలింస్‌పై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ -‘‘వైజాగ్‌లో పోలీస్‌గా చేస్తున్న నా స్నేహితుడు, ‘అక్రమ సంబంధాల వల్ల ఎన్నో జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి... ఆ పాయింట్ మీద సినిమా తీస్తే బాగుంటుంది’ అన్నాడు. అందుకే ఈ సినిమా చేశా. సమాజంలో జరుగుతున్నవే నా సినిమాల్లో చూపిస్తున్నా. విమర్శలు, ప్రశంసలూ రెండూ వస్తున్నాయి. మంచి సందేశం ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు. అసభ్యతకు తావు లేకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నిర్మాత చెప్పారు. సునీల్‌కుమార్ రెడ్డి ఏ సినిమా చేసినా మంచి సందేశం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు అన్నారు. పాటలు మాత్రమే కాదు, రీ-రికార్డింగ్ కూడా అద్భుతంగా కుదిరిందని సంగీతదర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి చెప్పారు. ఛాయాగ్రాహకుడు ఎస్.వి. శివరాం, నటులు కార్తీక్, మహేశ్ కూడా మాట్లాడారు. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
విజయ్ భాస్కర్, వివేక్, ఆనంద్, పూజిత ముఖ్య తారలుగా గణమురళి శరగడం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నిన్నే కోరుకుంటా’. తుమ్మల నవ్య, నిత్య సమర్పణలో మరిపి విద్యాసాగర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత కేకే రాధామోహన్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకురాలు బి. జయ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.ఇది రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని దర్శకుడు తెలిపారు. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, మేలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాహు, ప్రకాశ్, పి.టి. మాధవ్, సంగీతం: ప్రణవ్. -
రొమాంటిక్ ప్రేమ
జై ఆకాశ్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘దొంగప్రేమ’. శ్రావణి కథానాయిక. దినేశ్ మాడ్నే నిర్మాత. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలలో జై ఆకాశ్ మాట్లాడుతూ- ‘‘కథే ఈ చిత్రానికి హీరో. ప్రేమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో విలన్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రకాశ్‌రాజ్‌తో చేయించాలనుకున్నాను. కానీ డేట్స్ ప్రాబ్లమ్ వల్ల ఒక స్ట్రగులింగ్ ఆర్టిస్ట్ ఈ పాత్ర చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెలాఖరున గానీ, వచ్చే నెల తొలివారంలో కానీ సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అందరికీ నచ్చే సినిమా అవుతుందని నిర్మాత నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు, ప్రతాని రామకృష్ణ గౌడ్ కూడా మాట్లాడారు. -
విదేశీ నేపథ్యంతో...
స్వార్థం కోసం కొంతమంది వ్యక్తులు ఎలా మారిపోతున్నారు అనే ఇతివృత్తంతో నగేష్ నారదాశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బూమ్ బూమ్’. భరత్ భూషణ్, రీతూ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టి. చలపతి నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘విదేశీ నేపథ్యంలో సాగే కథ ఇది. స్క్రీన్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్. ప్రధానంగా యువతను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు ఓ హైలైట్. వచ్చే నెలలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
అడుసుమిల్లి శ్రీరామ్, శాలిని, బిందు ముఖ్య తారలుగా సీహెచ్‌వీ సుమన్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘రొమాంటిక్ లవ్‌స్టోరీ’. వి.అశోక్‌కుమార్‌రెడ్డి సమర్పణలో చెరువుపల్లి వెంకట నరేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం మొదలు కానుంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘సంగీతదర్శకుడు అమోఘ్ దేశపతి సారథ్యంలో ఇటీవల పాటలను రికార్డ్ చేశాం. ప్రేమ, వినోదం, సెంటిమెంట్ సమాహారంతో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది’’ అని చెప్పారు