విదేశీ నేపథ్యంతో... | bhoom bhoom movie like as romantic entertainer | Sakshi
Sakshi News home page

విదేశీ నేపథ్యంతో...

Published Tue, Jul 29 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM

విదేశీ నేపథ్యంతో...

విదేశీ నేపథ్యంతో...

స్వార్థం కోసం కొంతమంది వ్యక్తులు ఎలా మారిపోతున్నారు అనే ఇతివృత్తంతో నగేష్ నారదాశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బూమ్ బూమ్’. భరత్ భూషణ్, రీతూ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టి. చలపతి నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘విదేశీ నేపథ్యంలో సాగే కథ ఇది. స్క్రీన్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ప్రధానంగా యువతను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు ఓ హైలైట్. వచ్చే నెలలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement