Bharat Bhushan
-
టాలీవుడ్లో చాలా సమస్యలు ఉన్నాయి.. సి.కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు పనిచేసిన దిల్ రాజు పదవీకాలం పూర్తవగా.. తాజాగా ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఇకపోతే ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం తర్వాత భరత్ భూషణ్ తోపాటు సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)'ఈ రోజు గెలిచిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరూ మాటకు కట్టుబడి ఉంటారు. అందరు కలసి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తాం. ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి అందరం సమష్టిగా ముందుకు వెళ్తాం. గెలిచిన వారందరికీ సభ్యులందరి మద్దతు ఉంటుంది' అని సి.కల్యాణ్ అన్నారు. జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'ఛాంబర్ అంతా ఓ కుటుంబం. ఇండస్ట్రీలోని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అందరం కలసి చర్చిస్తాం. దేశంలోని ఇతర సినీ ఇండస్ట్రీని ఒకతాటి పైకి తీసుకొచ్చి ముందుకెళ్తాం' అని చెప్పుకొచ్చారు.ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు భరత్ భూషణ్ మాట్లాడుతూ.. 'నా విజయానికి సహకరించిన ఈసీ సభ్యులకు, మిత్రులకు పేరు పేరునా కృతజ్ఞతలు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను' అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: నా కూతురును ట్రోల్ చేశారు.. నాన్న సూసైడ్ అని పెట్టారు: రాజీవ్ కనకాల) -
తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్
హైదరాబాద్: తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా అశోక్ కుమార్ గెలిచారు. ఆదివారం ఉదయం జరిగిన ఫిలిం ఛాంబర్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికల్లో మొత్తం 48 మంది సభ్యులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా అధ్యక్ష బరిలో ఉన్న భరత్ భూషణ్‌కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్ష బరిలో ఉన్న అశోక్ కుమార్‌కు 28 ఓట్లు, వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు వచ్చాయి.కాగా గతేడాది నిర్మాతల విభాగం నుంచి దిల్ రాజు టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఆయన పదవీకాలం ముగియడంతో నేడు మళ్లీ ఎలక్షన్స్ నిర్వహించారు. అయితే ఈసారి డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి ఠాగూర్ మధు (నెల్లూరు), భరత్ భూషణ్ (విశాఖపట్టణం) బరిలో నిలిచారు. ఉపాధ్యక్ష పదవికి మాత్రం నిర్మాతలైన అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి పోటీపడ్డారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు వంటి నాలుగు సెక్టార్స్‌లోని సభ్యులు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.చదవండి: నేను, మహేశ్‌బాబు హీరోయిన్ను ఏడిపించాం: సుధ -
ఆదర్శ జీవితానికి కొలమానం
సుప్రసిద్ధ ఫొటో జర్నలిస్టుగా, ప్రజల జీవనాన్ని, వారి సంస్కృతిని జీవితాంతం తన కెమెరాకన్నులో బంధించి పేద ప్రజల బతుకు చిత్రాన్ని అక్షర సత్యంగా నాలుగు దశాబ్దాలకు పైగా అందిస్తూ వచ్చిన ప్రజా కళాకారుడు భరత్ భూషణ్. ఆయన నిజ జీవితంలో కూడా తిరుగులేని ఒక ఆదర్శ శిఖరం! భరత్ దశాబ్దాలుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ కూడా తన కెమెరా కన్నుకు క్షణం విశ్రాంతి నివ్వలేదు. విద్యావంతురాలైన పేదింటి మహిళా రత్నం సుభద్రను ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత రెండు కుటుంబాలకు కనపడకుండా నెలల తరబడి కాదు, కొన్నేళ్లపాటు అజ్ఞాత జీవితాన్ని కూడా గడుపుతూ ఆమె జీవితాన్ని తీర్చిదిద్దాడు. ఈ జంటను కాపాడుకుంటూ వారి ఆదర్శానికి ఒక దిక్సూచిగా నిలబడవలసిన ధర్మం నాకూ, నా భార్య సుధారాణిపైన పడింది. అలా వారి అజ్ఞాత దాంపత్యం కొత్త చిగుళ్లు తొడిగింది. కలవారి కుటుంబంలో పుట్టిన భరత్, పేద కుటుంబంలో పుట్టిన విద్యావంతురాలైన సుభద్రను చేసుకోవడంతో ఎదురైన కొత్త కష్టాలను ధైర్యంతో, మనో నిబ్బరంతో ఎదు ర్కొంటూ వచ్చాడు. ‘ఉదయం’ దినపత్రిక ద్వారా (1984–86) మొదలైన మా స్నేహం వయోభేదంతో నిమిత్తం లేకుండా, ప్రాంతా లతో సంబంధం లేకుండా ఎదుగుతూ వచ్చింది. అందు వల్ల భరత్ భౌతికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన తెలంగాణకు చెందినా, ఏ కోశానా ప్రాంతాల స్పృహ లేకుండా తెలుగువాళ్లుగా స్నేహ బాంధవ్యం పెరిగి బలపడుతూ వచ్చింది. ఈ బంధం, ఆత్మీయతల అనుబంధంగా పెరుగుతూ వచ్చింది కనుకనే హైదరాబాద్ లోని మా ఇల్లు భూషణ్ దంపతుల సొంతిల్లుగానే మారిపోయింది. ఈ చరిత్ర మన జర్నలిస్టు మిత్రులలో చాలా కొద్దిమందికే తెలుసు. మొన్న భరత్ పేద ప్రజా జీవితాలకు అంకితమైన ఫొటో జర్నలిస్టుగా కన్నుమూసే వరకూ మా కుటుంబాల ఆత్మీయతలు ఎక్కువ మందికి తెలియవు. మొన్నమొన్న భరత్ కన్నుమూసే వరకు, చివరి క్షణాల వరకూ భరత్, సుభద్రలు, వారి కుమార్తె అనుప్రియ, కొడుకు అభినవ్ నాతో భరత్ ఆరోగ్య విషయాల గురించి చెబుతూనే ఉన్నారు. వృద్ధాప్యం వల్ల నేను ఎక్కువసార్లు భరత్ ఇంటికి వెళ్లి ఇంతకు ముందులా అతడిని పరామర్శిస్తూ ముచ్చటలాడటం కుదరలేదు. అందువల్ల కేవలం ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఉండేవాడిని. తను ఏ చిన్న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్నా విధిగా నాకు ఫోన్ చేస్తూ మీరు కూడా వస్తే ‘నాకు దండి’గా ఉంటుందని చెప్పేవాడు. కానీ నా ఆరోగ్య పరిస్థితి, వృద్ధాప్య దశవల్ల నేను వాటిలో కొన్నింటికీ వెళ్లేవాడిని కాదు. ఐనా విధిగా సమాచారం మాత్రం భరత్ అందిస్తూనే ఉండేవాడు. అరుదైన ప్రజల, పేదసాదల ఫొటో జర్నలిస్టుగా, కళాకారుల్లో అరుదైన సమాజ స్పృహ తీవరించి ఉన్న వ్యక్తిగా భరత్‌ను నేను పరిగణిస్తాను. అంతేగాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తరువాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా తెలంగాణ వాసి అయిన భరత్‌కు తెలిసినంత లోతుగా తెలంగాణ సంస్కృతీ వైభవానికి చెందిన అనంతమైన పార్వ్శాలు మిగతా తెలంగాణ కళాకారులకు తెలియ వంటే ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజా జీవితానికి చెందిన అనేక కోణాలను, చివరికి ఇళ్ల తలుపు చెక్కల సొగసుల్ని, వంటింటి సామాన్ల తీరు తెన్నుల్ని అక్షరబద్ధమూ, చిత్రాక్షర బద్దమూ చేసి చూపరుల్ని ఆశ్చర్యచకితులను చేశాడు భరత్. (క్లిక్: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!) అందుకే ఏ తెలంగాణ చిత్రకారునికన్నా, ఫొటో జర్నలిస్టుకన్నా లోతైన అవగాహనతో భరత్ తెలంగాణ ప్రజా జీవన చిత్రాలను ప్రాణావశిష్టంగా మలిచారని చెబితే అతిశయోక్తి కాదు. భరత్ కుంచెలోనూ, కలం లోనూ విలక్షణమైన ఈ శక్తియుక్తులను పెంచి పోషించింది అభ్యుదయ భావ సంప్రదాయాలేనని మనం గుర్తించాలి. సబ్బు ముక్క, తలుపు చెక్క కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే తెలంగాణ పల్లెపట్టుల్లో తలుపు చెక్కల సౌందర్యాన్ని ఫొటో జర్నలిజం ద్వారా చిత్రబద్ధం చేశాడు భరత్. మహాకవి కాళోజి అన్నట్లు ‘‘చావు నీది, పుట్టుక నీది/ బతుకంతా దేశానిది’’. ఈ సత్యాన్ని ఎన్నటికీ మరవకండి! అందులోనే నిజం ఉంది, నిజాయితీ ఉంది!! (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!
భరత్ భూషణ్ (బి.బి)... ఆ పేరు చెప్పగానే ముఖం మీద ఓ చిన్న నవ్వు, మెడల వరకూ పొడవాటి జుట్టు, భుజానికి కెమెరా గుర్తు కొస్తాయి. కానీ, ఆ చిరునవ్వు వెనుక ఎన్నో ఒడుదొడుకులు, కష్టాలు, కన్నీళ్ళు. వాటన్నిటినీ దిగమింగుకొని పైకి మాత్రం అదే నవ్వుతో పలకరిస్తూ ఉండే వాడు. క్యాన్సర్ ఆపరేషన్ అయ్యాక తన మెడ మీద మచ్చ ఏర్పడింది. ఆ మచ్చ, క్యాన్సర్ తాలూకు బాధ ఎవరికీ కనపడకుండా దాచాలని తను జుట్టు పొడుగ్గా పెంచాడు. భూషణ్ స్వతహాగా మిత భాషి. జర్నలిస్టు, ఫోటో గ్రాఫర్ సహచరులు ఏ అసైన్ మెంట్లో కనపడినా, ‘ఎలా ఉన్నావు మిత్రమా’ అన్న పిలుపు, పలకరింపు. ‘ఏం కొత్త కెమేరాలు కొన్నారు’ అనే స్టాండర్డ్ ప్రశ్న. అలా 1984లో ‘ఉదయం’ రోజుల నుంచి పరిచయం. భూషణ్ ఎక్కువగా వామపక్ష (సీపీఐ, సీపీఎం, ఎంఎల్) ప్రోగ్రామ్స్ కవర్ చేసేవారు. అవి జరిగే ముఖ్దూమ్ భవన్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లాంటి చోట్ల కెమేరాతో ప్రత్యక్ష మయ్యేవాడు. అప్పట్లో పేపర్లలో ఎవరైనా మావోయిస్టుల ఫొటోలు కావాలన్నా, సీపీఐ, సీపీఎం లీడర్ల క్లోజప్ ఫొటోలు కావాలన్నా తననే అడిగేవాళ్లం. ఆ ఫొటోలకు తను ఫేమస్. ఫొటోలలో ఎవరు ఏది అడిగినా ప్రింట్ చేసి, ఇచ్చేవాడు. కాల క్రమేణా ఫొటో ప్రింట్స్, డిజిటల్‌గా మార డంతో కొంత ఇబ్బంది పడ్డాడు. ఫొటోగ్రాఫర్ వృత్తిని కొన్ని రోజులు పక్కనపెట్టి కార్టూన్స్, పెయింటింగ్స్ సాన బెట్టాడు. అప్పుడప్పుడు పిలిచి మరీ చూపించేవాడు. ఆ సమయంలోనూ ఫొటో గ్రాఫర్లకు గుర్తింపు లేదని బాధపడేవాడు. (చదవండి: నాన్న చూపిన ఉద్యమ పథం...) అనారోగ్యం, ఆర్థిక కష్టాలు, కుటుంబ బాధ్యతలు మానసికంగా కుంగదీశాయి. అయినా ఎక్కడా బాధపడేవాడు కాదు. ఎప్పుడూ తెలంగాణ గురించి, సంస్కృతి గురించి మాట్లాడేవాడు. అప్పుడే ప్రత్యేక తెలంగాణ గురించి తన ఆలోచనకు పదును పెట్టాడని చెప్పవచ్చు. ‘రంగుల కల’ లాంటి కొన్ని ఆర్ట్ సినిమాలకూ పనిచేశాడు. కొత్త రాష్ట్రం వచ్చాక బతుకమ్మ, తెలంగాణ సంస్కృతిపై ఎగ్జిబిషన్ పెట్టడం అతనికి సంతోషాన్నిచ్చింది. తనకు బ్లూ కలర్ ఇష్టం. వేసుకొనే టీ షర్ట్లు, రాసుకొనే పెన్ను, ఆఖరికి తను వాడే వస్తువులు, ఇంట్లో కూడా అంతా ‘బ్లూ’ కలరే. ఆయన తీసిన ఫొటోలలో బ్లాక్ అండ్ వైట్, బ్లూ, రెడ్, గ్రీన్, ఆరెంజ్ రంగులు కనపడేవి. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) గజ్జెల మల్లారెడ్డి, ఏబీకే ప్రసాద్, వి. మురళి, కె. శ్రీనివాస్ లాంటి ఎడిటర్లందరికీ ఇష్టమైన ఫొటో జర్నలిస్టుల్లో బి.బి. ఒకడు. ఇటీవల క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టినప్పుడు ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ వ్యక్తిగతంగా సాయపడింది. ప్రెస్ అకాడమీతో ప్రస్తుత తెలంగాణ సర్కార్ ఆర్థికంగా సాయపడింది. అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా అసోసియేషన్ మీటింగంటే, ఓపిక చేసుకొని, తోటి ఫొటోగ్రాఫర్ల బండి మీద వచ్చి, వెళ్ళేవాడు. అందరితో కలవడం అతని కెమేరాకి కొత్త రీఛార్జ్. రోజుకో ఉద్యోగం మారే రోజుల్లో దశాబ్దాల తరబడి నమ్ము కున్న వృత్తిలోనే నిబద్ధతతో పని చేసినవాడు... పని తప్ప బతకడం తెలీనివాడు.. ఫోటోనే ప్రేమించిన వాడు భూషణ్. పాతికేళ్ళుగా క్యాన్సర్‌పై పోరాడిన అతనొక సైనికుడు. చేతిలోని కెమేరానే కన్ను, గన్ను. ఆఖరి వరకూ అలాగే నిలిచాడు. ప్రాణం పోయినా, పోరాటస్ఫూర్తిలో గెలిచాడు. సెల్యూట్ మై ఫ్రెండ్! – కె. రవికాంత్ రెడ్డి ఫొటో ఎడిటర్, సాక్షి -
ప్రముఖ ఫోటో జర్నలిస్టు భరత్ భూషణ్ ఇక లేరు
ప్రముఖ సీనియర్ ఫోటో జర్నలిస్టు గుడిమల్ల భరత్ భూషణ్ ఇకలేరు. అనారోగ్యంతో పోరాడుతూ ఆయన ఆదివారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. తెలంగాణా బతుకమ్మ చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన భరత్ భూషణ్ అస్తమయం సాహితీ లోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణ సాంఘిక సాస్కృతిక జీవితాన్ని అపురూపంగా చిత్రించిన ఆయన మరణం తీరని లోటంటూ పలువరు నివాళులర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ ఫొటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుడిమల్ల అనసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు వరంగల్‌లో ఆయన జన్మించారు. నిజానికి బాల్యం నుంచి ఆయనకు చిత్రకళ అంటే ఆసక్తి ఉండేది. అలా కాల క్రమంలో ఫొటోగ్రఫీపై ఆసక్తిని పెంచుకున్న తన అద్భుతమైన ఫోటోలతో గొప్ప ఫోటోగ్రాఫర్‌గా పాపులర్ అయ్యారు. అనారోగ్యం కారణంగా మళ్లీ తన కుంచెకు పని చెప్పారు. ప్రజల జీవన శైలిని, చారిత్రక ఘట్టాలను, సంస్కృతిని తన ఛాయా చిత్రాల్లో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా ఫోటోల ద్వారా బతుకమ్మ సంస్కృతి ప్రపంచానికి తెలియజేసి కల్చరల్ అంబాసడర్ ఆఫ్ తెలంగాణగా ఎదిగారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణపల్లె జీవనం , పల్లె దర్వాజా, బొడ్డెమ్మ, బతుకమ్మ, తెలంగాణా మహిళలు ఫోటోలు సహా తెలంగాణ బతుకు చిత్రాన్ని తన ఫోటోలలో చిత్రీకరించిన ఘనుడు భరత్ భూషణ్. పల్లె ప్రజల జీవన వైవిద్యాన్ని ఆయన ఫోటోలు మనకు అర్థం చేయిస్తాయి. కలర్ ఫుల్ దర్వాజాలు, గోడలపై చిలికిన వెల్ల, గొళ్లాలు, కూలిన గోడలు, దర్వాజాలు, ముగ్గులు, వంటింటి వస్తువుల సౌందర్యాన్ని మన కళ్ల ముందుంచుతూ తెలంగాణ పల్లె జీవితం ఆవిష్కరించిన తీరు అద్భుతం. దైనందిన జీవితమే కాదు, పండుగలను పబ్బాలు, జాతర వైభవాన్ని కూడా ఆయన కెమెరా కన్ను అద్భుతంగా మలిచింది. అలాగే చిందుఎల్లమ్మ తొలి చిత్రాన్ని, చాకలి ఐలమ్మ ఫోటోలను ఎలా మర్చిపోగలం. కవి శివ సాగర్, నల్ల కలువ టీ.ఎన్.సదాలక్ష్మి, జానపద పితామహులు బిరుదురాజు రామరాజు వంటి వారి ఫొటోలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతేనా తెలంగాణా కవి కాళోజి ఛాయాచిత్రాలు తీసిన ఘనతకూడా భరత్ భూషణ్‌దే. భరత్ భూషణ్ సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు. హరిజన్, కాంచన సీత, రంగులకల వంటి మూవీలకు ఫొటోగ్రఫీ చేశారు. మెగాస్టార్ చిరంజీవిగా కరియర్ ఆరంభంలో పత్రికలకోసం చక్కటి ఫోటోలను తీసింది కూడా ఆయననే చెప్పుకుంటారు. వీటన్నింటికి తోడు భరత్ భూషణ్ ఫోటో జర్నలిస్టు మాత్రమే కాదు జానపద కళలపై, కుల వృత్తులపై వ్యాసాలు రాసిన రైటర్ కూడా. ఒకసారి కేన్సర్‌బారిన పడి కోలుకున్నప్పటికి దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత ఇటీవల క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టింది. దీనికి తోడు ఇతర ఆనారోగ్య సమస్యలు కూడా తీవ్రం కావడంతో శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. దీంతో ఆపై లోకంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడానికి మన భరత్ భూషణ్ తరలిపోయాడంటూ పలువురు ఫోటోగ్రాఫర్లు, రచయితలు కన్నీటి నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా దశాబ్దాల పాటు ఫోటోగ్రఫీ రంగంలో ఆయన చేసిన కృషి గొప్పదని కొనియాడారు. ఇటీవల కవి ఎండ్లూరి సుధాకర్ వెళ్లిపోయిన విషాదం నుంచికోలుకోకముందే మరో దెబ్బ తగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అనేక సందర్భాల్లో ఆయనకు తమకు అందంగా తీసిచ్చిన అద్భుతమైన ఫోటోలను గుండెలకు హత్తుకుని పలువురు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే తన జీవితకథను గ్రంథస్థం చేయాలనుకున్న కల తీరకుండానే వెళ్లిపోయారంటూ సాహితీ మిత్రులు శోకసంద్రమయ్యారు. మరోవైపు భరత్ మరణంతో తెలంగాణ అరుదైన ఫొటో జర్నలిస్టును, చిత్రకారుడిని కోల్పోయిందంటూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
ఆరోపణలపై స్పందించిన సీఐ బంగార్రాజు
ఏలూరు : తనపై వచ్చిన ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టూ టౌన్ సీఐ బంగార్రాజు స్పందించారు. తాను ఎవరినీ వేధించలేదని, చట్టప్రకారమే వ్యవహరించినట్లు ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ఆ అమ్మాయి కావాలనే తనపై ఆరోపణలు చేస్తోందని సీఐ అన్నారు. యువతి ఫిర్యాదు మేరకు మోసం చేసిన యువకుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేశామన్నారు. కాగా కేసు పెడితే న్యాయం చేయకుండా సీఐ తనను ఇంటికి రమ్మంటున్నారని ఓ యువతి జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్‌కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన మేనకోడలికి న్యాయం చేయకపోతే బుధవారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని బాధితురాలి మేనమామ హెచ్చరించారు. చదవండి...(సీఐ నన్ను ఇంటికి రమ్మన్నారు) -
‘సీఐ తన ఇంటికి రమ్మన్నారు’
-
‘సీఐ తన ఇంటికి రమ్మన్నారు’
ఎస్పీకి ఫిర్యాదు చేసిన యువతి న్యాయం జరగకపోతే ఆమరణ దీక్ష చేస్తానంటున్న మేనమామ వివాదంలో ఏలూరు టూ టౌన్ సీఐ ఏలూరు : కేసు పెడితే న్యాయం చేయకుండా సీఐ తనను ఇంటికి రమ్మంటున్నారని ఒక యువతి జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్‌కి ఫిర్యాదు చేసింది. తన మేనకోడలికి న్యాయం చేయకపోతే బుధవారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని ఆ యువతి మేనమామ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరానికి చెందిన ఒక యువతిని ఫత్తేబాద్కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమపేరుతో వలలో వేసుకున్నాడు. అమ్మ, నాన్న చిన్నతనంలోనే చనిపోవడంతో ఆ యువతి అమ్మమ్మ, తాత, మేనమామల వద్ద ఉంటోంది. పదో తరగతి చదివిన ఆ యువకుడు తాను ఎంబీఏనంటూ ఆ యువతిని మోసం చేశాడు. వివిధ కారణాలు చెబుతూ ఆ యువతి నుంచి రూ.మూడు లక్షల వరకూ వసూలు చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఏప్రిల్‌లో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత యువకుడు వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తర్వాత మళ్లీ ఆ యువకుడితో పెళ్లి చేయించాలంటూ స్టేషన్ ముందు ఆందోళన చేసింది. దీనిపై టూటౌన్ సీఐ బంగార్రాజు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత యువకుడిపై కేసు పెడితే ఉద్యోగం పోతుందని అతని స్నేహితుడు అమ్మాయి వద్ద డబ్బులు వసూలు చేశాడు. ఈ విషయంపై కూడా ఆ యువతి ఫిర్యాదు చేయడంతోపాటు తనకు న్యాయం జరగడం లేదంటూ ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆ యువకుడిపై ఈవ్‌టీజింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విషయంలో సీఐ తనను ఇంటికి పిలిపించి కౌన్సెలింగ్ పేరుతో అసభ్యంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఆ యువతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై సీఐ బంగార్రాజు వివరణ ఇస్తూ ఇప్పటికే ఆ అమ్మాయి మూడుసార్లు ప్రేమించిన యువకుడి కోసం ఆత్మహత్యాయత్నం చేసిందని, అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు. తాను అమ్మాయికి ఫోన్ చేసినట్టు ఏ ఆధారాలు ఉన్నా చూపించాలని కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
భరత్ భూషణ్, మిలన్, రీతు, చాచా పతుంతిప్ (బ్యాంకాక్) ముఖ్య తారలుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో టి. చలపతి నిర్మించిన చిత్రం ‘బూమ్ బూమ్’. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. టి.ప్రసన్నకుమార్ ఆడియో సీడీని ఆవిష్కరించి తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు. ఈ సందర్భంగా నగేష్ నారదాసి మాట్లాడుతూ - ‘‘యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. కథానుసారం షూటింగ్ బ్యాంకాక్‌లోనే చేశాం’’ అన్నారు. పాటలు బాగా కుదిరాయనీ, సినిమా కూడా బాగా వచ్చిందని చలపతి చెప్పారు. కథ బాగుండటంతో మంచి పాటలివ్వడానికి కుదిరిందని సుభాష్ ఆనంద్ తెలిపారు. చిత్రం విజయం సాధించి, యూనిట్ అందరికీ మంచి పేరొస్తుందనే నమ్మకం ఉందని భరత్ భూషణ్ అన్నారు. -
ఆకాశమంత.. భరత్ భూషణ్
తెలంగాణ ఆర్ట్ అండ్ లైఫ్‌ని ఫోకస్ చేసి.. ఆ షాడోలో ఓ జాడగా మిగిలిపోయిన ఛాయాగ్రహకుడు భరత్‌భూషణ్! మొండిగోడలు.. జాజిపూతలు.. ముత్యాల ముగ్గులు.. బంతి పూల బతుకమ్మలు ఆయన కెమెరా కన్ను చిత్రించిన జీవన దృశ్యాలు.. కళాత్మక కావ్యాలు! ఫొటోగ్రఫీని భూషణంగా చేసుకున్న భరత్ ఆ కళకే వన్నె తెచ్చాడు. ఈ కెమెరామన్ లెన్స్‌లో క్లిక్ అయిన ఓ లైఫ్ గురించి ఆయన మాటల్లోనే... నాకు రూరల్, ఆర్ట్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఇష్యూబేస్డ్గా పనిచేశా. అలాంటిదే ఈ ఫోటో. 90వ దశకం తొలినాళ్లది. నల్లగొండ జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ ఏరియాలో ఉన్న రాచకొండ గుట్టల్లో తీసింది ఈ ఫొటో. ఆ టైమ్‌లో అక్కడ ఆర్మీవాళ్ల ఫైరింగ్ జరుగుతుంటే ఆపేయమని ప్రొటెస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఫొటో కోసమని అక్కడికి వెళ్లాను. అప్పటిదే ఈ ఫొటో..! అన్నల దారిలో.. విమలక్క, మల్లెపల్లి లక్ష్మయ్య, నేను.. ఇంకొంత మంది కలసి సంస్థాన్ నారాయణపూర్ బయలుదేరాం. అయితే విమలక్క, మల్లెపల్లి లక్ష్మయ్య వాళ్లు పనిమీద అక్కడే ఆగిపోవడంతో సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ గులాంరసూల్తో రాచకొండ గుట్టలకు వెళ్దామనుకున్నాను. అయితే ఆయనకు అక్కడ పంచాయితీ ఉందని త్వరగా వెళ్లిపోయాడు. దాంతో నేను, సుప్రభాతం రిపోర్టర్ ఇద్దరం గులాం రసూల్ అనుచరులతో కలసి రాచకొండ గుట్టల బాట పట్టాను. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతమది. ఇంకోవైపు ఆర్మీ ఫైరింగ్.. దాంతో చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి వచ్చింది. క్యాండిడ్ షాట్ గుట్టల వరకే స్కూటర్.. అక్కడి నుంచి అంతా కాలినడకే. ఎప్పుడో ఉదయం పదకొండు గంటలకు బయలుదేరితే, మేం అనుకున్న చోటికి వెళ్లేసరికి దాదాపు సూర్యాస్తమయం అయింది. అక్కడికి చేరుకోగానే నాకు కనిపించిన సన్నివేశం ఇదే! వెంటనే కెమెరాలో బంధించాను. క్యాండిడ్ షాట్ (ఫొటో తీస్తున్నామనే విషయం వారికి తెలియకుండా) అన్నమాట. క్షణం ఆలస్యం.. భార్యాభర్తల పంచాయితీ అది. భార్య తన గోడేదో వెళ్లబోసుకుంటోంది. అక్కడున్న వారంతా ఆమె చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. వాళ్లకు కొంచెం దూరంలోనే ఉన్న నన్ను ఏమాత్రం గుర్తించనంతగా లీనమయ్యారు. అందుకే ఈ ఫొటో అంత లైవ్లీగా వచ్చింది. ఎవరికీ కెమెరా కాన్షస్ లేదు. క్షణం ఆలస్యమైనా.. సూర్యాస్తమయం అయ్యేది. ఈ ఫొటోలో సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ గులాంరసూల్ కూడా ఉన్నాడు. టెక్నికల్‌గా.. టెక్నికల్‌గా ఇది వన్ థర్డ్ కంపోజిషన్. నిజానికి ఏ ఫొటో అయినా పైన భాగం తక్కువుండి కింది భాగం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఫొటోలో ఆకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అప్పుడప్పుడే తగ్గిపోతున్న లైట్.. ఆకాశంలో నల్లటి మబ్బులు.. మధ్యమధ్యలో తెల్లని ప్యాచెస్.. ఫొటోకి జీవాన్నిస్తున్నాయి. లంబాడా లైఫ్ స్టయిల్.. చీకటి పడటంతో ఆ రాత్రికి అక్కడే ఉన్న తండాలో బస చేశాం. కరెంటు లేదు. చిమ్మచీకటి. తండావాసులు చూపించిన చోట నిద్రపోయాను. తెల్లవారుజామున నాలుగింటప్పుడనుకుంటా.. అన్నలొచ్చి లేపారు. ‘ఎవరు నువ్వు?’ అని అడిగారు. ఫలానా అని చెప్తే ‘సరే సరే’ అని వెళ్లిపోయారు. మళ్లీ పడుకొని లేచేసరికి లంబాడా లైఫ్ స్టయిల్ నా కెమెరాకు చాలా పని చెప్పింది. రోట్లో పచ్చడి నూరుతున్న ఆడవాళ్లు, చింత చెట్టు కింద నుంచి నీటి కుండలను నెత్తిన మోసుకొస్తున్న ఇంకొందరు.. నా ఫొటోగ్రఫీకి జీవం పోశారు. వేడివేడిగా జొన్నరొట్టెలు పెట్టారు. తినేసి తిరుగు ప్రయాణమయ్యాం. వన్ ఆఫ్ ది బెస్ట్స్.. అలా రాచకొండ గుట్టల్లో నేను తీసిన ఈ ఫొటోతో సహా మిగిలినవన్నీ నా కేరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్స్‌గా నిలిచాయి. ఈ ఫొటో చూసినప్పుడల్లా నాటి జ్ఞాపకాలను వెంటాడుతూనే ఉంటాయి! అదీ ఈ ఫోటో కథ! -
విదేశీ నేపథ్యంతో...
స్వార్థం కోసం కొంతమంది వ్యక్తులు ఎలా మారిపోతున్నారు అనే ఇతివృత్తంతో నగేష్ నారదాశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బూమ్ బూమ్’. భరత్ భూషణ్, రీతూ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టి. చలపతి నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘విదేశీ నేపథ్యంలో సాగే కథ ఇది. స్క్రీన్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్. ప్రధానంగా యువతను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు ఓ హైలైట్. వచ్చే నెలలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. -
బూమ్ బూమ్ మూవీ స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్