‘సీఐ తన ఇంటికి రమ్మన్నారు’ | woman compliant to west godavari sp on ci bangaru raju | Sakshi
Sakshi News home page

‘సీఐ తన ఇంటికి రమ్మన్నారు’

Published Tue, Jul 19 2016 9:40 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

‘సీఐ తన ఇంటికి రమ్మన్నారు’

‘సీఐ తన ఇంటికి రమ్మన్నారు’

  • ఎస్పీకి ఫిర్యాదు చేసిన యువతి
  • న్యాయం జరగకపోతే ఆమరణ దీక్ష చేస్తానంటున్న మేనమామ
  • వివాదంలో ఏలూరు టూ టౌన్ సీఐ
  • ఏలూరు : కేసు పెడితే న్యాయం చేయకుండా సీఐ తనను ఇంటికి రమ్మంటున్నారని ఒక యువతి జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్‌కి ఫిర్యాదు చేసింది. తన మేనకోడలికి న్యాయం చేయకపోతే బుధవారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని ఆ యువతి మేనమామ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరానికి చెందిన ఒక యువతిని ఫత్తేబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమపేరుతో వలలో వేసుకున్నాడు. అమ్మ, నాన్న చిన్నతనంలోనే చనిపోవడంతో ఆ యువతి అమ్మమ్మ, తాత, మేనమామల వద్ద ఉంటోంది.
     
     పదో తరగతి చదివిన ఆ యువకుడు తాను ఎంబీఏనంటూ ఆ యువతిని మోసం చేశాడు. వివిధ కారణాలు చెబుతూ ఆ యువతి నుంచి రూ.మూడు లక్షల వరకూ వసూలు చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఏప్రిల్‌లో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత  యువకుడు వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తర్వాత మళ్లీ ఆ యువకుడితో పెళ్లి చేయించాలంటూ స్టేషన్ ముందు ఆందోళన చేసింది.
     
    దీనిపై టూటౌన్ సీఐ బంగార్రాజు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత యువకుడిపై కేసు పెడితే ఉద్యోగం పోతుందని అతని స్నేహితుడు అమ్మాయి వద్ద డబ్బులు వసూలు చేశాడు. ఈ విషయంపై కూడా ఆ యువతి ఫిర్యాదు చేయడంతోపాటు తనకు న్యాయం జరగడం లేదంటూ ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆ యువకుడిపై ఈవ్‌టీజింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు.
     
    అయితే ఈ కేసు విషయంలో సీఐ తనను ఇంటికి పిలిపించి కౌన్సెలింగ్ పేరుతో అసభ్యంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఆ యువతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై సీఐ బంగార్రాజు వివరణ ఇస్తూ ఇప్పటికే ఆ అమ్మాయి మూడుసార్లు ప్రేమించిన యువకుడి కోసం ఆత్మహత్యాయత్నం చేసిందని, అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు. తాను అమ్మాయికి ఫోన్ చేసినట్టు ఏ ఆధారాలు ఉన్నా చూపించాలని కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement