ఏలూరు : తనపై వచ్చిన ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టూ టౌన్ సీఐ బంగార్రాజు స్పందించారు. తాను ఎవరినీ వేధించలేదని, చట్టప్రకారమే వ్యవహరించినట్లు ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ఆ అమ్మాయి కావాలనే తనపై ఆరోపణలు చేస్తోందని సీఐ అన్నారు. యువతి ఫిర్యాదు మేరకు మోసం చేసిన యువకుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేశామన్నారు.
కాగా కేసు పెడితే న్యాయం చేయకుండా సీఐ తనను ఇంటికి రమ్మంటున్నారని ఓ యువతి జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్‌కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన మేనకోడలికి న్యాయం చేయకపోతే బుధవారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని బాధితురాలి మేనమామ హెచ్చరించారు. చదవండి...(సీఐ నన్ను ఇంటికి రమ్మన్నారు)