![Film Chamber Elections 2024 Latest New President Bharat Bhushan](/styles/webp/s3/article_images/2024/07/28/telugu-film-chamber.jpg.webp?itok=KPn5uThA)
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు పనిచేసిన దిల్ రాజు పదవీకాలం పూర్తవగా.. తాజాగా ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఇకపోతే ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం తర్వాత భరత్ భూషణ్ తోపాటు సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)
'ఈ రోజు గెలిచిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరూ మాటకు కట్టుబడి ఉంటారు. అందరు కలసి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తాం. ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి అందరం సమష్టిగా ముందుకు వెళ్తాం. గెలిచిన వారందరికీ సభ్యులందరి మద్దతు ఉంటుంది' అని సి.కల్యాణ్ అన్నారు. జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'ఛాంబర్ అంతా ఓ కుటుంబం. ఇండస్ట్రీలోని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అందరం కలసి చర్చిస్తాం. దేశంలోని ఇతర సినీ ఇండస్ట్రీని ఒకతాటి పైకి తీసుకొచ్చి ముందుకెళ్తాం' అని చెప్పుకొచ్చారు.
ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు భరత్ భూషణ్ మాట్లాడుతూ.. 'నా విజయానికి సహకరించిన ఈసీ సభ్యులకు, మిత్రులకు పేరు పేరునా కృతజ్ఞతలు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను' అని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: నా కూతురును ట్రోల్ చేశారు.. నాన్న సూసైడ్ అని పెట్టారు: రాజీవ్ కనకాల)
Comments
Please login to add a commentAdd a comment