సోషల్ మీడియాలో సినీ ప్రముఖులపై ట్రోలింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. సినిమాల పరంగానే కాకుండా పర్సనల్ విషయాలపై కూడా అసత్యాలను ప్రచారం చేస్తూ ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అలా ట్రోల్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. సినీ సెలబ్రిటీలు, వారి ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్న చానాళ్లపై స్ట్రైక్స్ వేసి, వాటిని తొలగిస్తున్నారు. అయితే ఇది బెదిరింపు కాదని.. రెక్వెస్ట్ అని అంటున్నాడు నటుడు రాజీవ్ కనకాల. ట్రోల్ చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందని..అది దాటి ప్రవర్తించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ య్యూటూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి, వాటి వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి వివరించాడు.
(చదవండి: చిన్న పిల్లలతో లిప్ కిస్‌లా.. యాంకర్‌పై చిన్మయి ఫైర్!)
‘ఓసారి నేను ఓ యూట్యూబ్ చానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మా నాన్న గురించి మాట్లాడుతూ..ఒకానొక దశలో ఆయన సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు అని చెప్పాను. వాళ్లు ఆ ఇంటర్వ్యూని చక్కగా ఎడిట్ చేసి పబ్లీష్ చేశారు. కానీ దాని అనుబంధ చానల్ మాత్రం..నా ఇంటర్వ్యూలు ముక్కలు ముక్కలుగా చేసి ఇష్టం వచ్చినట్లు పోస్ట్ చేసింది. ఆ ముక్కల్లో ఓవీడియోకి ‘సూసైడ్ చేసుకొని చనిపోయిన దేవదాస్ కనకాల’అని థంబ్ పెట్టారు. ఆ థంబ్ చూడగానే నాకు చాలా కోపం వచ్చింది.
వెంటనే ఆ రిపోర్టర్‌కి ఫోన్ చేస్తే.. అతను సారీ చెప్పి ఆ థంబ్‌ని మార్చేశారు. అంతేకాకుండా నా భార్య సమతో నేను విడాకులు తీసుకున్నానని తప్పుడు ప్రచారం చేశారు. యూట్యూబ్‌లో వచ్చిన థంబ్ నేయిల్స్ చూసి..నిజంగానే మేము విడాకులు తీసుకున్నామని అందరూ భావించారు. ఓ షోకి మళ్లీ సుమతో కలిసి వెళ్తే.. ‘వీరు విడాకులు తీసుకున్నారు కదా..మళ్లీ కలిసిపోయారా?’ అని కామెంట్స్ వచ్చాయి. అంతలా నమ్మేశారు జనాలు. ఒకనొక సమయంలో నా కూతురుని కూడా ట్రోల్ చేశారు. తను ఓ ఫంక్షన్‌కి వెళ్తే..లేనిపోని వార్తలు రాసి బాధపడేలా చేశారు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ రాయకండి’అని రాజీవ్ విజ్ఞప్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment