Telugu Film Chamber
-
టాలీవుడ్లో చాలా సమస్యలు ఉన్నాయి.. సి.కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు పనిచేసిన దిల్ రాజు పదవీకాలం పూర్తవగా.. తాజాగా ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఇకపోతే ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం తర్వాత భరత్ భూషణ్ తోపాటు సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)'ఈ రోజు గెలిచిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరూ మాటకు కట్టుబడి ఉంటారు. అందరు కలసి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తాం. ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి అందరం సమష్టిగా ముందుకు వెళ్తాం. గెలిచిన వారందరికీ సభ్యులందరి మద్దతు ఉంటుంది' అని సి.కల్యాణ్ అన్నారు. జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'ఛాంబర్ అంతా ఓ కుటుంబం. ఇండస్ట్రీలోని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అందరం కలసి చర్చిస్తాం. దేశంలోని ఇతర సినీ ఇండస్ట్రీని ఒకతాటి పైకి తీసుకొచ్చి ముందుకెళ్తాం' అని చెప్పుకొచ్చారు.ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు భరత్ భూషణ్ మాట్లాడుతూ.. 'నా విజయానికి సహకరించిన ఈసీ సభ్యులకు, మిత్రులకు పేరు పేరునా కృతజ్ఞతలు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను' అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: నా కూతురును ట్రోల్ చేశారు.. నాన్న సూసైడ్ అని పెట్టారు: రాజీవ్ కనకాల) -
సంక్రాంతి సినిమాల గొడవ.. ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రకటన
ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏం చూడాలనేది ప్రేక్షకులు డిసైడ్ అవుతారు. ప్రతిసారి ఇదే జరిగేది. కానీ ఈసారి మాత్రం అంతకు మించి అనేలా పరిస్థితి తయారైంది. కొందరు నిర్మాతలు కావాలనే కొన్ని సినిమాల్ని తొక్కేస్తున్నారని సోషల్ మీడియాలో నానా హంగామా నడించింది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇక లాభం లేదనుకుని స్వయంగా ఫిల్మ్ ఛాంబర్ ఈ గొడవపై స్పందించింది. కీలక ప్రకటన రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి) 'సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు థియేటర్ల వివాదాలపై తెలుగు చిత్రాలకి సంబంధించి మా మూడు సంస్థలు 15 రోజుల క్రితం ఓ మీటింగ్ పెట్టి సంక్రాంతి బరిలో ఉన్న ఐదుగురు ప్రొడ్యూసర్లని పిలిచి గ్రౌండ్ రియాలిటీ వివరించి సహకరించమని కోరాం. సంక్రాంతి బరిలో ప్రతి ఏటా సినిమాల పోటీ ఉంటుంది. అలానే ఈసారి ఐదు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. హనుమాన్, ఈగల్, సైంధవ్, గుంటూరు కారం, నా సామి రంగ. ఛాంబర్ వినతిని మన్నించి సంక్రాంతి బరి నుంచి 'ఈగల్' రిలీజ్ డేట్ ఫిబ్రవరి 9కి మార్చారు' 'సంక్రాంతి అంటే సినిమాల మధ్య మంచి పోటీ వాతావరణం ఉంటుంది. తెలుగు సినిమాకి సంబంధించి మా మూడు సంస్థలు కలిపి ఏ హీరోకి ప్రొడ్యూసర్ కి దర్శకుడు కి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుండి నడిపిస్తున్నాం. కానీ కొన్ని సైట్ల వాళ్లు ఫ్యాన్స్, హీరోలు, ప్రొడ్యూసర్ల మధ్య ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజాన్ని తెలుసుకుని వార్తలని రాయాల్సిందిగా కోరుతున్నాం. ఇకనుంచి సోషల్ మీడియా, ఇతర మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టే రాతలు రాస్తే మాత్రం తగిన చర్యలు తీసుకుంటాం' అని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటనలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
హోరాహోరీగా సాగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు.. ఓటేసింది వీళ్లే (ఫోటోలు)
-
జులై 30న తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్
-
విశ్వక్ సేన్- అర్జున్ వివాదం..యంగ్ హీరోపై చర్యలు తప్పవా?
యంగ్ హీరో విశ్వక్సేన్- యాక్షన్ కింగ్ అర్జున్‌ల మధ్య వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన కూతుర్ని టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. అర్జున్ డైరెక్షన్లో రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇలాంటి సమయంలో విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై అర్జున్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. షూటింగ్‌కి సమయానికి రాకుండా ఇబ్బందులు పెట్టాడని, విశ్వక్ కమిట్మెంట్ లేని యాక్టర్ అంటూ అర్జున్ దుయ్యబట్టారు. 'షూటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు రాలేను అని మెసేజ్ పెడతాడు. అయినా సరే అతనికి నచ్చినట్లే క్యాన్సిల్ చేశాం. కానీ ప్రతిసారి షూటింగ్ వస్తానని చెప్పి డుమ్మా కొడతాడు. అతని వళ్ల సీనియర్ హీరోల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో టీమ్ వర్క్ ప్రధానం. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయిలో ఉంది. ఇప్పటివరకు తాను ఏ యాక్టర్, టెక్నీషియన్‌కు చేయలేనన్ని కాల్స్ విశ్వక్‌కి చేశాను. రెమ్యూనరేషన్ కింద అడ్వాన్స్ కూడా ఇచ్చాను, అయినప్పటికీ విశ్వక్ ఇలా షూటింగ్ ఎగ్గొట్టడం సమంజసం కాదు. ఈ విషయంపై ప్రొడ్యూసర్ గిల్ట్‌కు ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో 100కోట్లు వచ్చినా విశ్వక్‌తో సినిమా చేసేది లేదు' అంటూ అర్జున్ తెగేసి చెప్పారు. ఈ క్రమంలో గతంలో ఇలా అగ్రిమెంట్ కమిట్మెంట్ అయ్యాక అనుకోని పరిస్థిత్లులో దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తే ప్రొడ్యూసర్ గిల్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో బిగ్‌బాస్ ఫేమ్ అలీరెజా, నిర్మాతలకు విభేదాలు వస్తే.. ప్రొడ్యూసర్ గిల్డ్ అతన్ని రెండేళ్లు బ్యాన్ చేసింది. ‘బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలో ఓ సినిమా విషయంలో చిన్న మిస్టేక్ చేశా. నిర్మాతలు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశారు. దీంతో నన్ను రెండేళ్ల పాటు బ్యాన్ చేశారు’ అని అలీ రెజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సమయానికి షూటింగ్‌కి రావట్లేదంటూ ప్రకాశ్ రాజ్‌ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కొన్నాళ్ల పాటు బ్యాన్ చేసింది. తర్వాత ప్రకాశ్ రాజ్ వచ్చి వివరణ ఇవ్వడంతో నిషేధం ఎత్తేశారు. వీరితో పాటు పలువురు నటీనటులు ఇచ్చిన కమిట్మెంట్ను బ్రేక్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్లపై ప్రొడ్యూసర్ గిల్ట్ చర్యలు తీసుకుంది. మరి విశ్వక్సేన్ను కూడా కొన్నాళ్లపాటు బ్యాన్ చేస్తారా? అతడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అర్జున్ మాత్రం గొడవ పెట్టుకోవడానికి మీడియా ముందుకు రాలేదని, మరో నిర్మాతకు ఇలాంటి సమస్యలు రావొద్దనే ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేయబోతున్నానని తెలిపాడు. -
సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతల మండలి కీలక ప్రకటన
సినీ కార్మికుల వేతనాల పెంపుకు చలన చిత్ర నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్మికుల డిమాండ్ మేరకు వేతనాలను 30 శాతం పెంచుతున్నట్లు తాజాగా ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి, ఫలిం ఫెడరేషన్ సంయుక్తంగా అధికారిక ప్రకటన ఇచ్చింది. పెద్ద సినిమాలకు 30 శాతం, చిన్న సినిమాలకు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చాయి. ఇక ఏది చిన్న సినిమా, ఏది పెద్ద సినిమా అనేది ఫిలిం చాంబర్, ఫెడరేషన్ కలిసి నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఈ తాజా వేతనాల పెంపు సవరణ అనేది 01-07-2022 నుంచి 30-06-2025 వరకు అమలవుందని నిర్మతల మండలి స్పష్టం చేసింది. కాగా ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్మాతలు జాప్యం చేస్తూ వచ్చారని, ఈ సారి వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిం ఫెడరేషన్ సెప్టెంబర్ 1న నిర్మాతల మండలికి నోటిసులు ఇచ్చింది. అంతేకాదు తమ డిమాండ్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 16న మరోసారి సమ్మెకు వెళతామని హెచ్చరించింది. దీంతో నిర్మాతల మండలి.. వేతన కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కార్మికుల వేతనాలను 30 శాతం విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది. Telugu Film Industry PRESS NOTE#TFPC #TELUGUFILMPRODUCERSCOUNCIL #TFCC #TFI pic.twitter.com/7XBs9feYkp — Telugu Film Producers Council (@tfpcin) September 15, 2022 చదవండి: అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రవి ప్రసాద్ మృతి -
షూటింగ్ బంద్‌ను ఒక మహాయజ్ఞంలా ప్రారంభించాం: సి. కల్యాణ్
C Kalyan Dil Raju Comments After Telugu Film Chamber Of Commerce Meeting: సినిమా షూటింగ్‌లు బంద్ అయిన నేపథ్యంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గురవారం (ఆగస్టు 4) భేటీ అయింది. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. అనంతరం తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘సినిమా షూటింగ్‌ల బంద్ విషయంలో నిర్మాతల మధ్య భేదాభిప్రాయాలు లేవు. సమస్యల పరిష్కారం కోసమే చిత్రీకరణలు ఆపాం. సమస్యల పరిష్కారం కోసం షూటింగ్‌ల బంద్‌ని ఒక మహాయజ్ఞంలాగా ప్రారంభించాం. అయితే బయట అందరూ ఏవేవో చెబుతుంటారు.. వాటిని నిర్మాతలు పట్టించుకోవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం. సమస్యలు పరిష్కరించుకుందాం. ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ, కౌన్సిల్ జనరల్ సెక్రటరీల ఆధ్వర్యంలో పనులు డివైడ్ చేసుకొని ముందుకు వెళుతున్నాం. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయి’’ అని తెలిపారు. ‘‘ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నాలుగు కమిటీలు వేసి, చర్చిస్తున్నాం. వాటిలో సినిమాలు రిలీజ్ అయిన ఎన్ని వారాలకు ఓటీటీకి వెళితే ఇండస్ట్రీకి మంచిది అని చర్చించేందుకు ఓ కమిటీ వేసుకున్నాం. థియేటర్స్‌లో వీపీఎఫ్ చార్జీలు, పర్సెంటేజ్‌లు ఎలా ఉండాలన్నదానిపై మరో కమిటీ వేశాం. ఫెడరేషన్ వేజెస్, వర్కింగ్ కండిషన్స్‌పై కూడా ఓ కమిటీ వేశాం. ప్రొడక్షన్లో వృథా ఖర్చు తగ్గింపు, వర్కింగ్ కండీషన్స్, షూటింగ్ ఎన్ని గంటలు చేయాలనేదానిపై చర్చించేందుకూ మరో కమిటీ వేశాం. మా అందరికీ నెలల తరబడి షూటింగ్స్ ఆపాలన్న ఉద్దేశం లేదు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం’’ అని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''కొవిడ్ పాండమిక్ తరువాత సినిమా పరిశ్రమ వర్కింగ్ కండిషన్లో చాలా మార్పులు వచ్చాయి. దానివల్ల ప్రొడ్యూసర్స్ కు ఎక్కువ నష్టం వచ్చింది. కాబట్టి తెలుగు ఫిలిం ఛాంబర్ తరుపున నిర్మాతలకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. కానీ మీడియాలో మాత్రం చాలా వేరే విధంగా రాస్తున్నారు. కాబట్టి ఛాంబర్ తరుపున ఏదైతే బులెటిన్ ఇస్తామో అదే రాయండి'' అని తెలిపారు. మండలి కార్యదర్శి శ్రీ. టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ''ఇవాళ ప్రేక్షకులు థియేటర్‌కు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో పరిశ్రమను ఓక తాటిపై ఇండస్ట్రీ ను కాపాడుకోవాలనే ఉద్దేశ్యం తో ఓటీటీకి సినిమా ఎప్పుడు ఇవ్వాలి? సామాన్యుడు థియేటర్ కు రప్పించడానికి టికెట్ రేట్స్ ను రీదనేబుల్గా తగ్గించలానే విషయాలపై కృషి చేస్తున్నాం. ఆ తరువాత వర్కర్స్ వేజేస్ విషయమై ఫెడరేషన్ తోను, కాస్ట్ ప్రొడక్షన్ విషయమై దర్శకులు మీటింగుల్లోనూ, ఆర్టిస్టుల సహకారం కొరకు మా అసోసియేషన్ తోను, సంప్రదింపులు చేస్తున్నాం. గతంలో ఎన్టీరామారావు గారు, అక్కినేని నాగేశ్వర్ రావు గారు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే రోజుల్లోనే రూ. 10 వేలు తీసుకొని తెలుగు చలన చిత్ర పరిశ్రమను కాపాడారు. రెండోది డిజిటల్ ఛార్జీలు నిర్మాతలకు చాలా భారంగా ఉంది. ఈ సమస్య నుంచి బయటపడాలి. పర్సంటేజ్ సిస్టమ్‌లో చిన్న సినిమాకు, ఒక పర్సంటేజ్ అని, పెద్ద సినిమాకు ఒక పర్సంటేజ్ అని ఎక్జిబిటర్స్ అడుగుతున్నారు. ఈ సమ్యసలన్నీ చర్చించడం కోసం సినిమాల షూటింగ్‌లు వాయిదా వేయడం జరిగింది. దీన్ని మీరు స్ట్రైక్ అనొద్దు. బంద్ అనొద్దు. ఇండస్ట్రీకు పూర్వ వైభోవం తీసుకొని రావడానికి మేము అందరం పని చేస్తున్నాము. దయచేసి మీడియా వారికీ ఒక చిన్న విన్నపం గిల్డ్ మీటింగ్ అని రాయకండి, కేవలం తెలుగు ఫిలిం ఛాంబర్ మాత్రమే పేరెంట్ బాడీ, కాబట్టి మీటింగులు అన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కాబట్టి ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కలిసికట్టుగా పని చేస్తూ.. ఎవ్వరిని ఇబ్బంది పెట్టడము, నష్టపరచడము మా ఉద్దేశ్యము కాదు. కరోనా లాంటి కష్ట కాలంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి శతధా ధన్యవాదాలు. వాళ్ల ఆదరణ మూలంగా ప్రపంచంలోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గొప్పగా ఉందని చెప్పుకొంటున్నాం. అలాంటి ప్రేక్షకులకు పాదాభివందనం చేస్తున్నాము. అలాంటి ప్రేక్షకులకు టికెట్ రేట్స్ భారంగా ఉండకూడదని టికెట్ రేట్స్ తగ్గిస్తున్నాము. ఈ సమావేశం తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్ లతోను సంప్రదింపులు జరుగుతాయి'' అని తెలిపారు. -
చర్చలు జరుగుతున్నాయి..త్వరలోనే నిర్ణయాలు తెలియజేస్తాం: దిల్ రాజు
సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించామని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. కార్మికుల వేతనాల సమస్యపై ఏర్పాటైన కమిటీకి అధ్యక్షత వహిస్తున్న దిల్ రాజు శుక్రవారం తెలుగు ఫిలించాంబర్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చర్చలు వరుసగా జరుగుతాయని, ఏ రోజుకారోజు చర్చల తర్వాత అన్నీ క్రోడికరించి చివరి రోజున మీడియా ద్వారా నిర్ణయాలను తెలియజేస్తామని చెప్పారు. శుక్రవారం నుంచి అని సినిమా షూటింగ్‌లు ప్రారంభమయ్యాయన్నారు. కార్మికుల ప్రతీ సమస్య గురించి చర్చిస్తామని ఆయన తెలిపారు. -
టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా కొల్లి రామకృష్ణ.. అప్పటివరకు పదవిలో..
Kolli Ramakrishna Elected To Telugu Film Chamber President: తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) నూతన అధ్యక్షునిగా కొల్లి రామకృష్ణ ఎన్నికయ్యారు. టీఎఫ్‌సీసీ అధ్యక్షునిగా ఉన్న నారాయణ్ దాస్ నారంగ్ అనారోగ్యంతో ఈ నెల 19న మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం జరిగిన ‘టీఎఫ్‌సీసీ’ కార్యవర్గ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నియమ నిబంధనలు అనుసరించి ఉపాధ్యక్షుడైన కొల్లి రామకృష్ణ (మెసర్స్ రిథమ్ డిజిటల్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్)ను తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ ఏడాది జూలై 31వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 1946 జులై 27న జన్మించిన నారాయణ దాస్ నారంగ్ (76) ఏప్రిల్ 19, 2022న మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఏషియన్ మల్టీప్లెక్స్ , ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఉన్న ఆయన.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చదవండి: ఏషియన్ థియేటర్స్ అధినేత కన్నుమూత చదవండి: బర్త్‌డే గర్ల్ సమంత వద్ద ఉన్న ఈ కాస్ట్లీ వస్తువులు తెలుసా ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టాలీవుడ్ మీటింగ్, హాజరైన రాజమౌళి!
సాక్షి, హైదరాబాద్: సినీపరిశ్రమల సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో ఆది శేషగిరిరావు అధ్యక్షతన మొదలైన ఈ సమావేశానికి 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు.. ఇలా అన్ని రంగాల నుంచి ఆయా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'సినీ పరిశ్రమ అంతర్గత సమస్యలపై చర్చించనున్నాం. పరిశ్రమలోని అన్ని వ్యవస్థల సభ్యులను ఆహ్వానించాం. గత రెండేళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటన్నింటిపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గంటన్నర పాటు అన్ని విషయాలపై చర్చించుకోనున్నాం. ఇది చిత్ర పరిశ్రమ మంచి కోసం ఏర్పాటు చేసిన భేటీ' అని పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. 'క్యూబ్, టికెట్ రేట్లు, చిత్ర పరిశ్రమ అంతర్గత విషయాలు చర్చకు వస్తాయి. ఏపీ ప్రభుత్వంతో జరిగిన మీటింగ్ విషయాలను సైతం చర్చిస్తాము. పూర్తి వివాదరహితంగా సమావేశం ఉంటుందని ఆశిస్తున్నాము' అన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేసే విషయాలపై చర్చించనున్నాం. వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని కలిసినా, ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగేదే ఇండస్ట్రీ సమావేశం' అని తెలిపారు. ఎస్ఎస్ రాజమౌళి, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, మైత్రీ మూవీస్ రవి, నవీన్, బివిఎస్ఎసన్ ప్రసాద్ , స్రవంతి రవికిషోర్ , తమ్మారెడ్డి భరధ్వాజ, ముత్యాల రాందాస్ ,మాదాల రవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై ఇండస్ట్రీ సమస్యలను చర్చించిన విషయం తెలిసిందే! ఈ సమావేశం జరిగిన కొద్ది రోజులకే టాలీవుడ్ ప్రతినిధులు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సినిమా టికెట్ల ఆన్లైన్ విధానంపై ఏకాభిప్రాయం
-
సినిమా టికెట్ల ఆన్లైన్ విధానంపై ఏకాభిప్రాయం
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయంపై సినీ పరిశ్రమ ఏకాభిప్రాయం వ్యక్తం చేసిందని సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. సోమవారం సచివాలయం నాలుగో బ్లాకులో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ఆన్లైన్ బుకింగ్ విధానం–2002 నుంచి అమలుకు నోచుకోలేదన్నారు. తమ ప్రభుత్వం దీనిపై వివిధ కమిటీలను నియమించి విస్తృతంగా అధ్యయనం చేస్తోందని వివరించారు. ఇందులో భాగంగానే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టేక్ హోల్డర్లతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నట్టు చెప్పారు. ఆన్లైన్ టికెట్ల విక్రయంపై అందరూ ఏకాభ్రిపాయం వ్యక్తం చేయడంతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారన్నారు. వారి విజ్ఞప్తులను పరిశీలించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి సమావేశంలో వివరించామని, వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సినిమాపై తమ ఇష్టాన్ని ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరల ప్రకారం ప్రజలకు వినోదం అందిస్తామన్నారు. చాలా వరకు థియేటర్లలో ఆన్లైన్ టికెట్ల విక్రయిస్తున్నారని, త్వరలో అన్ని థియేటర్లలో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. ఏపీ సినిమా చిత్రీకరణకు అవసరమైన మౌలిక వసతుల కల్పన విషయంలో ప్రతినిధుల బృందం ప్రభుత్వానికి చేసిన సూచనలను పరిశీలిస్తామన్నారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవం చిత్రరంగ సమస్యలను పరిష్కరించాలని మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విన్నవించిన విషయమై విలేకరులు ప్రశ్నించగా.. చిరంజీవి అంటే సీఎం జగన్ ఎంతో గౌరవం ఉందని, ఆయనను సోదరభావంతో చూస్తారని చెప్పారు. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు విజయచందర్, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ టి.విజయకుమార్‌రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సీఈవో వాసుదేవరెడ్డి, ఏపీ తెలుగు ఫిల్మ్ చాంబర్‌కు చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సంఘాల ప్రతినిధులు సి.కల్యాణ్, దిల్ రాజు, జి.ఆదిశేషగిరిరావు, వంశీ, డీఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు చిత్ర సీమ సంతోషంగా ఉంది: సి.కల్యాణ్ సమావేశం అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భరోసాతో తెలుగు చిత్రసీమ చాలా సంతోషంగా ఉందన్నారు. టికెట్ రేట్ల సవరణ, వంద శాతం ఆక్యుపెన్సీ, రోజుకు నాలుగు షోలు, విద్యుత్ బిల్లులు తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. సినీ పరిశ్రమలో పారదర్శకత కోసం ఆన్లైన్ టికెట్ల విక్రయ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని తామే కోరినట్టు చెప్పారు. థియేటర్ వ్యవస్థను ఆదుకోవాలని కోరాం.. మరో నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. ‘2006లో ఆన్లైన్ టికెట్ విధానం ఐచ్చికంగా ఉండేది. ఇప్పుడు తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. పారదర్శకత కోసం గవర్నమెంట్ పోర్టల్ ఉండాలి. ఒకప్పుడు 1,800 థియేటర్లు ఉంటే ఇప్పుడు 1,200కు తగ్గిపోయాయి. వాటిలో ఐదారొందల థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. వాటిని విద్యుత్ టారిఫ్ సమస్య వేధిస్తోంది. జీతాలు, డీజిల్ రేట్లు పెరిగాయి. ఈ మేరకు రేట్లు సవరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా సానుకూల స్పందన లభించింది’ అన్నారు. నిర్మాత డీఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ సినీ పరిశమ్ర సమస్యలపై ప్రభుత్వ సానుకూల స్పందన తెలుగు చిత్రసీమకు ఊరటనిచ్చిందన్నారు. -
ఆ తర్వాతే కొత్త సినిమాలు.. ఫిలించాంబర్ కీలక నిర్ణయం
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సినిమా చిత్రీకరణలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షూటింగ్స్ ఆరంభమవుతున్న నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు పాటిస్తే బాగుంటుందనే విషయంపై చర్చించేందుకు ‘తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఓ సమావేశం నిర్వహించాయి. ఆ సమావేశంలో తీర్మానించిన అంశాలను ‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’(టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు నారాయణ్ దాస్ కె. నారంగ్, గౌరవ కార్యదర్శులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ఎం.రమేష్ ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఆ నిబంధనలు ఈ విధంగా.... ►కోవిడ్‌కి సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. గతంలో షూటింగ్ చేస్తూ ఆగిపోయిన చిత్రాలకే నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ప్రాముఖ్యత ఇచ్చి పూర్తి చేయాలి. ఆ తర్వాతే కొత్త సినిమాలు చేయాలి. దర్శకులు కూడా షెడ్యూల్స్‌ని కుదించుకుని తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలి. ►సినిమా నిర్మించే ప్రొడక్షన్ హౌస్ ఆయా నటీనటులు, సాంకేతిక నిపుణుల నుండి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలి. షూటింగ్స్‌కు హాజరైన ప్రతి యూనియన్ సభ్యుడు మొదటి డోస్ వ్యాక్సినేషన్ కచ్చితంగా తీసుకొని ఉండాలి. ఫెడరేషన్‌లోని 24 విభాగాల సభ్యులందరికీ జీవిత భీమా చేయించాలి. ఆ బాధ్యతను ఫెడరేషన్, ఆయా యూనియన్ వారు తీసుకోవాలి. ►పై తీర్మానాలకు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వారు తమ సమ్మతిని తెలియజేశారు. ఈ విషయాలపై ఏవైనా సలహాలు, ఫిర్యాదులు ఉన్నా, నిబంధనలు పాటించకున్నా తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటాం. -
అందుకే రాజీనామా చేస్తున్నా
తెలుగు ఫిల్మ్ చాంబర్ జాయింట్ సెక్రటరీ పదవికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవికి దర్శక–నిర్మాత నట్టి కుమార్ శనివారం రాజీనామా చేశారు. ‘‘చిన్న నిర్మాతల సినిమాలను విడుదల చేయనీకుండా కొంతమంది అడ్డుకుంటు న్నారు.. దానికి నిరసనగానే రాజీనామా చేశా. ఏప్రిల్ వరకు పెద్ద సినిమాలు విడుదల కావు కాబట్టి ఐదుగురు పెద్ద వ్యక్తులు థియేటర్లని మార్చి వరకూ ఓపెన్ చేయకూడదని అనుకుంటున్నారు. థియేటర్స్‌ని నడిపించకపోతే థియేటర్ లీజ్ ఓనర్స్ అయిన నిర్మాతల ఇంటి ముందు ధర్నా చేస్తా’’ అన్నారు నట్టి కుమార్. -
చిన్న నిర్మాతలకు అన్యాయం చేశారు
‘‘తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి వరాలు కురిపించిందని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. కానీ చిన్న చిత్రాలకు న్యాయం జరిగినట్లు అనిపించడంలేదు’’ అన్నారు ‘తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్’ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి. శుక్రవారం ఆయన మాట్లాడుతూ– ‘‘ఓ ఏడాదిలో వచ్చే 200 సినిమాల్లో పెద్ద సినిమాలు 20 నుంచి 30 వరకు ఉంటాయి. మిగిలినవి చిన్నవే. కొత్త నటీనటుల్ని, సాంకేతిక నిపుణులను తీసుకువచ్చేది, సామాజిక స్పృహ ఉన్న చిత్రాలని తీసేది చిన్న నిర్మాతలే. 30 వేల మంది కార్మికులకు పని ఇచ్చేది ఈ నిర్మాతలే. థియేటర్స్‌లో మధ్యాహ్నం 2 గంటల షో కచ్చితంగా చిన్న సినిమా ప్రదర్శించాలని, షూటింగ్‌కి ఫ్రీగా లొకేషన్స్ ఇవ్వమని అడిగాం. థియేటర్స్‌లో సినిమా ప్రదర్శనకు డిజిటల్ ప్రొవైడర్స్ అన్యాయంగా వారానికి 12,000 వేలు వసూలు చేస్తున్నారు. మేమడిగిన ఈ మూడే మూడు డిమాండ్లను పక్కన పడేశారు. సంవత్సరంలో 180 చిత్రాలను తీస్తున్న చిన్న నిర్మాతలకి అన్యాయం చేశారు’’ అన్నారు. -
సినిమా హాళ్లు తెరవలేం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అన్‌లాక్‌లో భాగంగా కేంద్రం వెసులుబాటు కల్పించినా..యాభై శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమని, అందువల్ల తాము సినిమా హాళ్లు తెరవబోమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. బుధవారం విజయవాడలోని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో 13 జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా హాళ్లు నడవాలంటే రూ.లక్షల్లో అదనంగా ఖర్చవుతుందని ప్రతినిధులు వెల్లడించారు. కేంద్రం ప్రకటించిన 24 నిబంధనల ప్రకారం థియేటర్లు నడపాలంటే ఒక్కో ప్రేక్షకుడిపై రూ.25 అదనపు భారం పడనుందని వివరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఫిక్స్డ్ చార్జీల రద్దు, ఇతర రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలు చేసినట్లయితే సినిమా హాళ్లు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నారాయణబాబు, రామా టాకీస్ సాయి, రమేష్, ప్రసాద్, రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సినిమా మీద ప్రేమ తగ్గదు
‘‘ముప్పై ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీతో నాకు అనుబంధం ఉంది. చిత్రపరిశ్రమ నాకు తల్లిలాంటిది. ఈ పరిశ్రమ నాపై కొన్ని బాధ్యతలు పెట్టింది. వాటిని సక్రమంగా నెరవేర్చేందుకు కృషి చేస్తాను’’ అని నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ అన్నారు. ఏషియన్ సినిమాస్ సంస్థను ప్రారంభించి 30 ఏళ్లుగా చిత్ర పంపిణీ రంగంలో కొనసాగుతున్న నారాయణదాస్ నారంగ్ పుట్టినరోజు నేడు (జూలై 27). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటిదాకా దాదాపు 650 చిత్రాలను పంపిణీ చేశాను. అందులో చిత్ర పరిశ్రమ గర్వించే ‘బాహుబలి, బాహుబలి 2’ చిత్రాలు ఉండటం విశేషం. సినిమా మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. మహేశ్‌బాబుతో కలిసి ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాను. ఎమిగోస్ క్రియేష¯Œ్స, పి. రామ్మోహన్ రావుతో కలిసి ‘లవ్ స్టోరీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా 15 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. మా తర్వాతి సినిమా కూడా శేఖర్ కమ్ములతోనే చేయబోతున్నాం. ఇందులో ఒక పెద్ద హీరో నటిస్తారు’’ అన్నారు. -
మార్చి1నుంచి సినిమా థియేటర్లు బంద్..!
డిజిటల్ ప్రొవైడర్ల విధానాల కారణంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్స్ మండిపడింది. కేవలం తమ లాభాలనే దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలు సినీ పరిశ్రమలో అందరికీ నష్టాలను మిగులుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన చార్జీలను వసూలు చేయాలని దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్స్ పలుసార్లు డిజిటల్ ప్రొవైడర్లను కోరినా ఎలాంటి స్పందన రాకపోవడంతో థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయమై దక్షిణాది రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్ల పెద్దలు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలుగు నిర్మాతలు సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి. కిరణ్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె. మురళీ మోహన్, చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు ఎల్.సురేష్, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు విశాల్, కేరళ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సియాద్ కొక్కర్‌లు ఈసమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ ప్రొవైడర్లు అన్యాయంగా చార్జీలు వసూలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. తక్కువ ధరకే సేవలు అందించడానికి ముందుకు వస్తున్న డిజిటల్ ప్రొవైడర్లను సైతం అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయంపై మరో వారం రోజుల్లో రెండో సమావేశాన్ని నిర్వహించి ధరల తగ్గుదల, ఇతరత్రా విషయాలపై పరిష్కారానికి కృషి చేయాలని తీర్మానించారు. ఒకవేళ కుదరని పక్షంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మార్చి 1 నుండి థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. -
బోగస్ సంస్థలతో మోసపోవద్దు
‘‘తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందాయి. కొందరు వీటి అనుబంధ పేర్లతో బోగస్ సంస్థలు ఏర్పాటు చేసి కొత్త నిర్మాతలను మోసగిస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బోగస్ సంస్థల వలలో పడి మోసపోవద్దు’’ అని తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు సి.కల్యాణ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు రామ్మోహన్ రావు అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ – ‘‘బోగస్ సంస్థలపై నిఘా ఉంచేందుకు ‘అడ్‌హక్’ కమిటీ ఏర్పాటు చేశాం. కొత్త నిర్మాతలు ఎవరైనా తెలుగు ఫిలిం ఛాంబర్ లేదా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మాత్రమే సభ్యత్వం తీసుకోవాలి. ఎలాంటి గుర్తింపు లేని బోగస్ సంస్థల్లో సభ్యత్వం తీసుకుని, మోసపోతే న్యాయం చేయలేం. సినిమా అవార్డులన్నవి ప్రభుత్వాలు ఇస్తేనే బాగుంటుంది కానీ, సంస్థలు కాదు. ఇల్లీగల్ వ్యవహారాల్లో కౌన్సిల్ జోక్యం చేసుకోదు’’ అన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యదర్శి మురళీమోహన్, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరాం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ కొడాలి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.