విశ్వక్‌ సేన్‌- అర్జున్‌ వివాదం..యంగ్‌ హీరోపై చర్యలు తప్పవా? | Vishwak Sen And Arjun Sarja Controversy How Will Producer Guilt Will React | Sakshi
Sakshi News home page

Vishwak Sen- Arjun Sarja: విశ్వక్‌ సేన్‌- అర్జున్‌ వివాదం..యంగ్‌ హీరోపై చర్యలు తప్పవా?

Published Sun, Nov 6 2022 2:05 PM | Last Updated on Sun, Nov 6 2022 4:12 PM

Vishwak Sen And Arjun Sarja Controversy How Will Producer Guilt Will React - Sakshi

యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌- యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ల మధ్య వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన కూతుర్ని టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ అర్జున్‌ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. అర్జున్‌ డైరెక్షన్‌లో రెండు షెడ్యూళ్ల షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. ఇలాంటి సమయంలో విశ్వక్‌ ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై అర్జున్‌ సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. షూటింగ్‌కి సమయానికి రాకుండా ఇబ్బందులు పెట్టాడని, విశ్వక్‌ కమిట్‌మెంట్ లేని యాక్టర్ అంటూ అర్జున్‌ దుయ్యబట్టారు.

'షూటింగ్‌ మరికాసేపట్లో ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు రాలేను అని మెసేజ్‌ పెడతాడు. అయినా సరే అతనికి నచ్చినట్లే క్యాన్సిల్‌ చేశాం. కానీ ప్రతిసారి షూటింగ్‌ వస్తానని చెప్పి డుమ్మా కొడతాడు. అతని వళ్ల సీనియర్‌ హీరోల డేట్స్‌ కూడా వేస్ట్‌ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో టీమ్ వర్క్ ప్రధానం. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయిలో ఉంది. ఇప్పటివరకు తాను ఏ యాక్టర్‌, టెక్నీషియన్‌కు చేయలేనన్ని కాల్స్‌ విశ్వక్‌కి చేశాను.

రెమ్యూనరేషన్ కింద అడ్వాన్స్ కూడా ఇచ్చాను, అయినప్పటికీ విశ్వక్ ఇలా షూటింగ్ ఎగ్గొట్టడం సమంజసం కాదు. ఈ విషయంపై ప్రొడ్యూసర్‌ గిల్ట్‌కు ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో 100కోట్లు వచ్చినా విశ్వక్‌తో సినిమా చేసేది లేదు' అంటూ అర్జున్‌ తెగేసి చెప్పారు. ఈ క్రమంలో గతంలో ఇలా అగ్రిమెంట్‌ కమిట్‌మెంట్‌ అయ్యాక అనుకోని పరిస్థిత్లులో దాన్ని బ్రేక్‌ చేయాల్సి వస్తే ప్రొడ్యూసర్‌ గిల్ట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. 

గతంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీరెజా, నిర్మాతలకు విభేదాలు వస్తే.. ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ అతన్ని రెండేళ్లు బ్యాన్‌ చేసింది. ‘బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిన సమయంలో ఓ సినిమా విషయంలో చిన్న మిస్టేక్‌ చేశా. నిర్మాతలు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నన్ను రెండేళ్ల పాటు బ్యాన్‌ చేశారు’ అని అలీ రెజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సమయానికి షూటింగ్‌కి రావట్లేదంటూ ప్రకాశ్‌ రాజ్‌ని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) కొన్నాళ్ల పాటు బ్యాన్‌ చేసింది. తర్వాత ప్రకాశ్‌ రాజ్‌ వచ్చి వివరణ ఇవ్వడంతో నిషేధం ఎత్తేశారు. వీరితో పాటు పలువురు నటీనటులు ఇచ్చిన కమిట్‌మెంట్‌ను బ్రేక్‌ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్లపై ప్రొడ్యూసర్‌ గిల్ట్‌ చర్యలు తీసుకుంది. మరి విశ్వక్‌సేన్‌ను కూడా కొన్నాళ్లపాటు బ్యాన్‌ చేస్తారా? అతడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అర్జున్‌ మాత్రం గొడవ పెట్టుకోవడానికి మీడియా ముందుకు రాలేదని, మరో నిర్మాతకు ఇలాంటి సమస్యలు రావొద్దనే ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేయబోతున్నానని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement