యాక్షన్‌ హీరో డైరెక్షన్‌లో విశ్వక్ సేన్‌ మూవీ.. ఆసక్తికర విషయాలు | Vishwak Sen Movie With Aishwarya Arjun In Arjun Sarja Direction | Sakshi
Sakshi News home page

Vishwak Sen: యాక్షన్‌ హీరో డైరెక్షన్‌లో విశ్వక్ సేన్‌ మూవీ.. ఆసక్తికర విషయాలు

Published Sun, Jun 19 2022 9:14 PM | Last Updated on Sun, Jun 19 2022 9:19 PM

Vishwak Sen Movie With Aishwarya Arjun In Arjun Sarja Direction - Sakshi

Vishwak Sen Movie With Aishwarya Arjun In Arjun Sarja Direction: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్ తాజాగా న​టించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 6న విడుదలై సూపర్‌ హిట్‌ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఈ సినిమా హిట్‌తో మంచి జోష్‌ మీదు ఉన్నాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం విశ్వక్ సేన్‌ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో కొత్త ప్రాజెక్టులో విశ్వక్‌ సేన్‌ జాయిన్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాలో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మూవీకి యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది ఐశ్వర్య. శ్రీరామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్ పతాకంపై అర్జున్ నిర్మిస్తున్నఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది. రోడ్‌ ట్రిప్‌ కథాంశంగా సాగే ఈ మూవీలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 

చదవండి: 👇
సినిమా సెట్‌లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్‌
చెత్త ఏరిన స్టార్‌ హీరోయిన్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement