Arjun Sarja Meets Sharwanand Replacement For Vishwak Sen For His Directorial Film - Sakshi
Sakshi News home page

Arjun Sarja: అర్జున్‌ సర్జా-విశ్వక్‌ సేన్‌ వివాదం.. తెరపైకి మరో యంగ్‌ హీరో!

Published Wed, Nov 9 2022 3:10 PM | Last Updated on Wed, Nov 9 2022 4:55 PM

Arjun Sarja Meets Sharwanand Replacement For Vishwak Sen for His Directorial Film - Sakshi

గత కొద్ది రోజులుగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా-యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ల వివాదం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ అర్జున్‌ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. అర్జున్‌ డైరెక్షన్‌లో రెండు షెడ్యూళ్ల షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో సడెన్‌గా ఈ మూవీ షూటింగ్‌ని నిలిపివేశారు. విశ్వక్‌ సేన్‌ షూటింగ్‌కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్‌ సర్జా రీసెంట్‌గా ఆరోపణలు చేయగా.. తన అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, అందువల్లే షూటింగ్‌ ఆపమని అడిగానంటూ వివరణ ఇచ్చాడు విశ్వక్‌.  ప్రస్తుతం ఈ వివాదంపై సినీ పెద్దలు చర్చించుకుంటున్నారు.

చదవండి: బిగ్‌బాస్‌ 6: 9 వారాలకు గీతూ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ కోసం అర్జున్‌ మరో యంగ్‌ హీరోను తీసుకునే ఆలోచన ఉన్నారట. ఇది తెలుగులో తన కూతురు ఫస్టు సినిమా కావడంతో అర్జున్‌కి ఈ సినిమాని సెంటిమెంట్‌గా చూస్తున్నారట. అందువల్లే ఆయన ఈ సినిమాను ఆపేసే ఆలోచనలో లేరని తెలుస్తోంది. పైగా తాను పని ఇస్తానని చెప్పి తీసుకొచ్చిన ఏ టెక్నీషియన్ కూడా పని లేదని చెప్పి వెనక్కి పంపించడం తనకి అలవాటు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో సాధ్యమైనంత త్వరగా మరో హీరోతో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. అయితే ఈ కథకి శర్వానంద్ కరెక్టుగా సరిపోతాడని భావించిన ఆయన, ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ మొదటి నుంచి కూడా చాలా కూల్‌గా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. చాలా కాలం తరువాత ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో హిట్ అందుకున్నాడు శర్వానంద్‌.

చదవండి: పరిస్థితి మరింత దిగజారింది: రష్మిక ఎమోషనల్‌ పోస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement