Producer council complaints
-
థియేటర్ల ఇష్యూపై నిర్మాత సి కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
థియేటర్ల సమస్యపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి. కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా సి. కల్యాణ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమాని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలుగు సినిమాలకు కాకుండా.. కన్నడ, తమిళ చిత్రాలకు థియేటర్లు ఇవ్వడం సరికాదని, ఇలా చేస్తే బడాస్టార్ల సినిమాలకు కూడా థియేటర్లు దొరక్కపోవచ్చని అభిప్రాయపడ్డారు. అలా జరిగితే మన పరువు మనమే తీసుకన్న వాళ్లం అవుతామన్నారు. కన్నడ, తమళ్‌లో మొదట వాళ్ల సినిమాలకే ప్రాధాన్యత ఇస్తారని, ఆ తర్వాతే ఇతర భాషల సినిమాలకు థీయేటర్లు ఇస్తారని పేర్కొన్నారు. మనం కూడా మారాలని, డబ్బుకోసం కాకుండా.. సినిమాని బ్రతికించుకోవడం కోసం కష్టపడాలన్నారు. ఈ విషయంలో డైరెక్టర్‌గా చాంబర్ ఏం చేయలేదని, గిల్డ్ ఉన్నా పెద్దగా ఎలాంటి ఉపయోగం లేదని నిర్మాత సి కల్యాణ్ వ్యాఖ్యానించారు. చదవండి: షూటింగ్లో గాయం, పెను ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్ మాల్దీవుల్లో యాంకర్ రష్మీ రచ్చ.. వీడియో వైరల్ -
'వారీసు' వివాదం.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వ్యాఖ్యలు సరికాదు : నిర్మాత
‘‘ఈ మధ్య 30రోజులు షూటింగ్ ఆపడమనేది అట్టర్ ఫ్లాప్ షో. చిన్న చిత్రాల నిర్మాతలు రిలీజ్ రోజున సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారం దొరుకుతుందని సమ్మెకి సమ్మతించా. అయితే సమ్మె వల్ల ఏం జరగదని నాలుగు మీటింగ్స్‌లోనే అర్థమైంది. కొన్ని సమస్యలు, లోపాలు గుర్తించినా వాటి పరిష్కారం జరగలేదు. సినిమా పరిశ్రమ బతికుందంటే కొత్తగా వచ్చే నిర్మాతల వల్లే’’ అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. నేడు (శుక్రవారం) తన పుట్టినరోజుని పురస్కరించుకుని సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘చెన్నైలో సహాయ దర్శకుడిగా నా కెరీర్ ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ దాదాపు 200 కోట్లతో ‘కల్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్’ ప్రాజెక్ట్ చేయడం తమిళనాడు ప్రభుత్వం, దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. సదరన్ ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తూ గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కు మించి అవార్డ్స్‌ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వ్యాఖ్యలు సరికాదు. చిరంజీవిగారి సినిమా నిర్మాతలుగానీ, బాలకృష్ణగారి మూవీ నిర్మాతలుగానీ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేయలేదు.. అలాంటప్పుడు రిలీజ్ విషయంలో కౌన్సిల్ మాట్లాడటం వంద శాతం తప్పు. థియేటర్లు రెంటల్ వ్యవస్థ నుండి పర్సంటేజ్లోకి మారిస్తే బాగుంటుంది. కానీ, కొందరు పెద్దవాళ్లు మారనివ్వరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లాబ్ సిస్టం తెస్తే కానీ ఇది మారదు. సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ రెండో ఊరు అయిపోయింది. ఏదైనా సమస్య వస్తే అక్కడికి నలుగురు మాత్రమే వెళుతున్నారు.. ఆ రకంగా ఒక దూరం వచ్చేసింది. పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఇక్కడి సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉండరని భావిస్తాను. గతంలో కృష్ణా నుండే పది మంది పరిశ్రమలోకి వచ్చి అందులో ఎవరో ఒకరు సక్సెస్ అయ్యేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి మాత్రం ఏపీలో చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలని ఉంది. ప్రస్తుతం ఎస్వీ కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో నేను నిర్మించిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ సినిమా పూర్తయింది. అలాగే బాలకృష్ణగారితో ‘రామానుజాచార్య’ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. -
విశ్వక్ సేన్- అర్జున్ వివాదం..యంగ్ హీరోపై చర్యలు తప్పవా?
యంగ్ హీరో విశ్వక్సేన్- యాక్షన్ కింగ్ అర్జున్‌ల మధ్య వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన కూతుర్ని టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. అర్జున్ డైరెక్షన్లో రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇలాంటి సమయంలో విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై అర్జున్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. షూటింగ్‌కి సమయానికి రాకుండా ఇబ్బందులు పెట్టాడని, విశ్వక్ కమిట్మెంట్ లేని యాక్టర్ అంటూ అర్జున్ దుయ్యబట్టారు. 'షూటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు రాలేను అని మెసేజ్ పెడతాడు. అయినా సరే అతనికి నచ్చినట్లే క్యాన్సిల్ చేశాం. కానీ ప్రతిసారి షూటింగ్ వస్తానని చెప్పి డుమ్మా కొడతాడు. అతని వళ్ల సీనియర్ హీరోల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో టీమ్ వర్క్ ప్రధానం. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయిలో ఉంది. ఇప్పటివరకు తాను ఏ యాక్టర్, టెక్నీషియన్‌కు చేయలేనన్ని కాల్స్ విశ్వక్‌కి చేశాను. రెమ్యూనరేషన్ కింద అడ్వాన్స్ కూడా ఇచ్చాను, అయినప్పటికీ విశ్వక్ ఇలా షూటింగ్ ఎగ్గొట్టడం సమంజసం కాదు. ఈ విషయంపై ప్రొడ్యూసర్ గిల్ట్‌కు ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో 100కోట్లు వచ్చినా విశ్వక్‌తో సినిమా చేసేది లేదు' అంటూ అర్జున్ తెగేసి చెప్పారు. ఈ క్రమంలో గతంలో ఇలా అగ్రిమెంట్ కమిట్మెంట్ అయ్యాక అనుకోని పరిస్థిత్లులో దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తే ప్రొడ్యూసర్ గిల్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో బిగ్‌బాస్ ఫేమ్ అలీరెజా, నిర్మాతలకు విభేదాలు వస్తే.. ప్రొడ్యూసర్ గిల్డ్ అతన్ని రెండేళ్లు బ్యాన్ చేసింది. ‘బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలో ఓ సినిమా విషయంలో చిన్న మిస్టేక్ చేశా. నిర్మాతలు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశారు. దీంతో నన్ను రెండేళ్ల పాటు బ్యాన్ చేశారు’ అని అలీ రెజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సమయానికి షూటింగ్‌కి రావట్లేదంటూ ప్రకాశ్ రాజ్‌ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కొన్నాళ్ల పాటు బ్యాన్ చేసింది. తర్వాత ప్రకాశ్ రాజ్ వచ్చి వివరణ ఇవ్వడంతో నిషేధం ఎత్తేశారు. వీరితో పాటు పలువురు నటీనటులు ఇచ్చిన కమిట్మెంట్ను బ్రేక్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్లపై ప్రొడ్యూసర్ గిల్ట్ చర్యలు తీసుకుంది. మరి విశ్వక్సేన్ను కూడా కొన్నాళ్లపాటు బ్యాన్ చేస్తారా? అతడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అర్జున్ మాత్రం గొడవ పెట్టుకోవడానికి మీడియా ముందుకు రాలేదని, మరో నిర్మాతకు ఇలాంటి సమస్యలు రావొద్దనే ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేయబోతున్నానని తెలిపాడు. -
బిగ్‌బాస్ తర్వాత నన్ను రెండేళ్లు బ్యాన్ చేశారు: అలీ రెజా
అలీ రెజా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. అప్పటివరకు సీరియల్స్‌లో నటించినా రాని గుర్తింపు బిగ్‌బాస్ సీజన్-3తో సంపాదించుకున్నాడు. ఫిజికల్ టాస్కుల్లో తనదైన స్టైల్లో ఆడి ప్రేక్షకుల్ని మెప్పించిన అలీ బిగ్‌బాస్ అనంతరం బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు. తాజాగా ఓ షోలో పాల్గొన్న అలీ తెరపై కనిపించకుండా ఉండటం వెనకున్న బలమైన కారణాన్ని బయటపెట్టాడు. ఈ మధ్య టీవీల్లో కనిపించడం లేదేంటి అని హోస్ట్ అడగ్గా.. తనను బ్యాన్ చేశారని చెప్పి షాకిచ్చాడు. అప్పట్లో నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఆ టైంలో చిన్న మిస్టేక్ చేశా. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి రావాలని ఫోన్ చేశారు. నేను వెళ్లేసరకి అలీ రెజా రెండేళ్లు బ్యాన్ అన్నారు. ఆ మాట విని నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
మంత్రితో నిర్మాతల మండలి భేటీ
చెన్నై: రాష్ట్ర సమాచార శాఖ మంత్రి వెల్లై కోవిల్ స్వామినాథన్‌ను తమిళ నిర్మాతల మండలి కార్యవర్గం బుధవారం కలిసింది. ఈ సందర్భంగా నిర్మాతల సంక్షేమం కోసం డిమాండ్లతో కూడిన కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందించినట్లు మండలి అధ్యక్షుడు మురళి రామనారాయణన్ తెలిపారు. సమాచారశాఖ మంత్రిని కలిసిన వారిలో ఆయనతో పాటు.. కార్యదర్శులు ఆర్.రాధాకృష్ణన్, మన్నన్, ఇతర కార్యవర్గం సభ్యులు సౌందరరాజన్, విజయమురళి తదితరులు ఉన్నారు. చదవండి: Jaya Prada: బంగార్రాజుకు స్నేహితురాలా? -
నటుడు శింబుపై నిర్మాత ఫిర్యాదు
చెన్నై,టీ.నగర్: నటుడు శింబుపై నిర్మాత ఒకరు నిర్మాతల కౌన్సిల్లో సోమవారం ఫిర్యాదు చేశారు. టీ.రాజేందర్ కుమారుడు శింబు. కథానాయకుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా బహుముఖంగా రాణిస్తున్నారు. అలాగే, అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. కెట్టవన్, మన్మథన్, ఏఏఏ అనే పలు చిత్రాల గురించి శింబుపై అనేక ఫిర్యాదులందాయి. ఇతనికి రెడ్‌కార్డ్ సయితం ఇచ్చేందుకు నిర్మాతల సంఘం నుంచి నిర్ణయం తీసుకున్నారు. సింబు నటిస్తున్న కన్నడ మఫ్టీ చిత్రం రీమేక్ ప్రస్తుతం విడిచిపెట్టబడింది. దీనిద్వారా గత రెండేళ్లలో శింబుకు మూడో చిత్రం నిలిచిపోయింది. ఖాన్, మానాడు చిత్రాల కోవలో ఈ చిత్రం కూడా డ్రాప్ అయింది. కన్నడ చిత్రమైన మఫ్టీ రీమేక్ చేస్తున్న నిర్మాత జ్ఞానవేల్‌రాజా నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. అందులో శింబు సక్రమంగా షూటింగ్‌కు రాలేదని, దీంతో చిత్ర నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిందని తెలిపారు. మిగతా నటీనటుల షూటింగ్‌కు అంతరాయం కలిగిందని, వీరికి అనవసరంగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. మొదటి పదిరోజుల షూటింగే జరగలేదని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. -
విశాల్‌కు హైకోర్టులో చుక్కెదురు
పెరంబూరు: సాధారణంగా ఒక వ్యక్తి విషయంలో రెండు సంఘటనలు జరిగినప్పుడు అందులో ముందు గుడ్ న్యూస్ చెప్పమంటారా? బ్యాడ్ న్యూస్ చెప్పమంటారా? అని అడుగుతుంటారు. ఇప్పుడు కరెక్ట్‌గా నటుడు విశాల్ పరిస్థితి ఇలాంటిదే. ఆనందంతో పాటు అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. విశాల్ వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన సంఘటన చోటు చేసుకున్నా, వృత్తిపరంగా విచారకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కీడెంచి మేలెంచమన్న సామెతను పక్కన పెట్టి ముందు విశాల్‌కు సంబంధించిన మంచి వార్త గురించి చెప్పుకుందాం. మోస్ట్ బ్యాచిలర్ అయిన నటుడు విశాల్ పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన అనీషారెడ్డి అనే నటితో వివాహం నిశ్చయం అయిన విషయం విదితమే. ఆ మధ్య వివాహ నిశ్చితార్థం వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకున్నారు. అయితే వివాహ తేదీని మాత్రం వెల్లడించలేదు. తాజాగా తన పెళ్లి వేడుక అక్టోబర్ 9న జరగనుందని నటుడు విశాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. అయితే వివాహ వేదిక ఎక్కడన్నది ఇంకా నిర్ణయించలేదని ఆయన చెప్పారు. సమస్యలేంటంటే.. కాగా ఇక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నటుడు విశాల్ దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికల్లో విజయం సాధించి జోడు పదవుల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా వీటిలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మండలిలో అవినీతి, అవకతవకలు జరిగాయంటూ వ్యతిరేక వర్గం ఆరోపణలను గుప్పిస్తున్నారు. మండలి కార్యవర్గం ఏ విషయంలోనూ విధి, విధానాలు పాఠించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిణామాల్లో మండలిలో వ్యతిరేక వర్గం ఫిర్యాదు మేరకు ప్రభుత్వం మండలి నిర్వహణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. అందుకు ఎన్.శేఖర్ అనే రిజిస్ట్రార్‌ను ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఇది విశాల్ వర్గాన్ని షాక్‌కు గురిచేసింది. దీంతో ప్రభుత్వ చర్యల్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే ప్రభుత్వం విశాల్ వర్గానికి మరో షాక్ ఇచ్చింది. మండలికి ప్రత్యేక అధికారిగా నియమించిన ఎన్.శేఖర్‌కు సహాయ, సహకారాలను అందించే విధంగా తాత్కాలిక అడహాక్ కమిటీని నియమించింది. అందులో విశాల్ వ్యతిరేక వర్గానికి చెందిన దర్శకుడు భారతీరాజా, నటుడు కే.రాజన్, టీజే.త్యాగరాజన్ 9 మందిని సభ్యులుగా నియమించింది. దీన్ని వ్యతిరేకిస్తూ విశాల్ వర్గం మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ సారి హైకోర్టులో కూడా విశాల్ వర్గానికి చుక్కెదురైంది. శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్తానం అడహాక్ కమిటీని రద్దు చేయలేమని తీర్పులో పేర్కొంది. ప్రభుత్వం నియమించింది ప్రత్యేక అధికారికి తాత్కాలిక సలహా అడహాక్ కమిటీని నియమించిందని, దాన్ని రద్దు చేయడం వీలుకాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఈ అడహాక్ కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని పేర్కొన్నారు. ఈ తీర్పు కూడా విశాల్ వర్గానికి అవమానకరమైన విషయమే అవుతుంది. -
హైకోర్టును ఆశ్రయించిన హీరో విశాల్
సాక్షి, చెన్నై : నిర్మాతల మండలికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించడాన్ని వ్యతిరేకిస్తూ మండలి అధ్యక్షుడు విశాల్ సోమవారం చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాతల మండలిలో అవకతవకలు జరిగాయని, కార్యవర్గం నిబంధనల ప్రకారం ఏ విషయంలోనూ నడుచుకోలేదన్న ఆరోపణల నేపథ్యంలో... ప్రభుత్వం నిర్మాతల మండలిని తన చేతుల్లోకి తీసుకుని ఎన్.శేఖర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాతల మండలి ప్రత్యేక అధికారిని నియమించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి పూర్తి అయ్యిందని, మండలి ఆదాయ, వ్యయ వివరాలను సభ్యుల ముందు ప్రవేశ పెట్టి వారి ఆమోదం పొందడానికి మే 1వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నామని పిటిషన్లో పేర్కొన్నారు. సమావేశంలోనే తదుపరి ఎన్నకల తేదీ గురించి ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మండలికి ప్రత్యేక అధికారిగా ఎన్.శేఖర్‌ను నియమించడం సరైన నిర్ణయం కాదన్నారు. ఇది చట్ట విరుద్ధం... నిర్మాతల మండలిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అలాంటప్పుడు ప్రత్యేక అధికారిని నియమించడం చట్ట విరోధం పిటిషన్లో అని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనీ, ప్రతేక అధికారి నియామకంపై నిషేధం విధించాలనీ కోరారు. అదే విధంగా ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని కోరారు. అందుకు సమ్మతించిన న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరపనున్నట్లు తెలిపారు. -
నాపై ఫిర్యాదు తగదు
నాపై ఆ చిత్రాల నిర్మాతలు ఫిర్యాదు చేయడం సమంజసం కాదని యువ నటి శ్రీ దివ్య అంటున్నారు. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రంతో విజయబాట పట్టిన ఈ ఆరణాల తెలుగమ్మాయి కోలీవుడ్‌లో ఇప్పుడు బిజీ హీరోయిన్. ఇటీవల విడుదలైన జీవా చిత్రం కూడా ఈ బ్యూటీ హిట్ ఖాతాలో చేరింది. ప్రస్తుతం కాక్కిసట్టై, పెన్సిల్, వెళ్లక్కార దురై మొదలగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలకు ముందు కాట్టుమల్లి, నగర పురం చిత్రాలను అంగీకరించారు. ఆ సమయంలో ఈ ముద్దుగుమ్మ పారితోషికం వేల సంఖ్యలోనే ఉండేది. ప్రస్తుత అరకోటి వరకు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. చిత్ర నిర్మాణం పూర్తి కాని కాట్టుమల్లి, నగరపురం చిత్రాలను పూర్తి చేయడానికి ఈ అమ్మడు ప్రస్తుత పారితోషికం చెల్లిస్తేనే కాల్షీట్స్ కేటాయిస్తానని శ్రీదివ్య అంటున్నట్లు ఆ చిత్రాల నిర్మాతలు, తమిళ నిర్మాతలు మండలిలో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన శ్రీ దివ్య అన్ని చిత్రాలకు సహకరిస్తున్నానన్నారు. అలాంటిది తనపై ఫిర్యాదు చేయడం సమంజసం కాదన్నారు. ఇక కాట్టుమల్లి చిత్రం విషయానికొస్తే అది రెండేళ్ల క్రితం ఒప్పుకున్న చిత్రం అని వెల్లడించారు. అప్పుడు ప్రారంభమైన ఆ చిత్ర షూటింగ్ అనూహ్యంగా ఆగిపోయిందని తెలిపారు. అందుకు చిత్ర యూనిట్లో నెలకొన్న అయోమయ పరిస్థితినే కారణమన్నారు. తనకు నిర్మాతల తరపు నుంచి ఎలాంటి సమాచారం అందలేదని అందువల్లనే ఆ చిత్ర కాల్షీట్స్ను ఆ చిత్ర దర్శక, నిర్మాతలు ఫిర్యాదు చేశారని శ్రీ దివ్య అంటున్నారు.