చెన్నై,టీ.నగర్: నటుడు శింబుపై నిర్మాత ఒకరు నిర్మాతల కౌన్సిల్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. టీ.రాజేందర్ కుమారుడు శింబు. కథానాయకుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా బహుముఖంగా రాణిస్తున్నారు. అలాగే, అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. కెట్టవన్, మన్మథన్, ఏఏఏ అనే పలు చిత్రాల గురించి శింబుపై అనేక ఫిర్యాదులందాయి. ఇతనికి రెడ్‌కార్డ్ సయితం ఇచ్చేందుకు నిర్మాతల సంఘం నుంచి నిర్ణయం తీసుకున్నారు. సింబు నటిస్తున్న కన్నడ మఫ్టీ చిత్రం రీమేక్ ప్రస్తుతం విడిచిపెట్టబడింది. దీనిద్వారా గత రెండేళ్లలో శింబుకు మూడో చిత్రం నిలిచిపోయింది. ఖాన్, మానాడు చిత్రాల కోవలో ఈ చిత్రం కూడా డ్రాప్ అయింది. కన్నడ చిత్రమైన మఫ్టీ రీమేక్ చేస్తున్న నిర్మాత జ్ఞానవేల్‌రాజా నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. అందులో శింబు సక్రమంగా షూటింగ్‌కు రాలేదని, దీంతో చిత్ర నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిందని తెలిపారు. మిగతా నటీనటుల షూటింగ్‌కు అంతరాయం కలిగిందని, వీరికి అనవసరంగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. మొదటి పదిరోజుల షూటింగే జరగలేదని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment