Bigg Boss Fame Ali Reza Said He Was Banned By Producer Council For 2 Years Check Inside - Sakshi
Sakshi News home page

Ali Reza: 'బ్యాన్‌ చేశారు.. వాళ్లు అన్న మాటలకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది'

Published Tue, Mar 29 2022 9:14 PM | Last Updated on Wed, Mar 30 2022 9:33 AM

Bigg Boss Fame Ali Reza Said He Was Banned By Producer Council - Sakshi

అలీ రెజా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. అప్పటివరకు సీరియల్స్‌లో నటించినా రాని గుర్తింపు బిగ్‌బాస్‌ సీజన్‌-3తో సంపాదించుకున్నాడు. ఫిజికల్‌ టాస్కుల్లో తనదైన స్టైల్‌లో ఆడి ప్రేక్షకుల్ని మెప్పించిన అలీ బిగ్‌బాస్‌ అనంతరం బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు. తాజాగా ఓ షోలో పాల్గొన్న అలీ తెరపై కనిపించకుండా ఉండటం వెనకున్న బలమైన కారణాన్ని బయటపెట్టాడు.

ఈ మధ్య టీవీల్లో కనిపించడం లేదేంటి అని హోస్ట్‌ అడగ్గా.. తనను బ్యాన్‌ చేశారని చెప్పి షాకిచ్చాడు. అప్పట్లో నాకు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చింది. ఆ టైంలో చిన్న మిస్టేక్‌ చేశా. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌కి రావాలని ఫోన్‌ చేశారు. నేను వెళ్లేసరకి అలీ రెజా రెండేళ్లు బ్యాన్‌ అన్నారు. ఆ మాట విని నాకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చినంత పనైంది అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement