
తెలుగు ఫిల్మ్ చాంబర్ జాయింట్ సెక్రటరీ పదవికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవికి దర్శక–నిర్మాత నట్టి కుమార్ శనివారం రాజీనామా చేశారు. ‘‘చిన్న నిర్మాతల సినిమాలను విడుదల చేయనీకుండా కొంతమంది అడ్డుకుంటు న్నారు.. దానికి నిరసనగానే రాజీనామా చేశా. ఏప్రిల్ వరకు పెద్ద సినిమాలు విడుదల కావు కాబట్టి ఐదుగురు పెద్ద వ్యక్తులు థియేటర్లని మార్చి వరకూ ఓపెన్ చేయకూడదని అనుకుంటున్నారు. థియేటర్స్‌ని నడిపించకపోతే థియేటర్ లీజ్ ఓనర్స్ అయిన నిర్మాతల ఇంటి ముందు ధర్నా చేస్తా’’ అన్నారు నట్టి కుమార్.