ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏం చూడాలనేది ప్రేక్షకులు డిసైడ్ అవుతారు. ప్రతిసారి ఇదే జరిగేది. కానీ ఈసారి మాత్రం అంతకు మించి అనేలా పరిస్థితి తయారైంది. కొందరు నిర్మాతలు కావాలనే కొన్ని సినిమాల్ని తొక్కేస్తున్నారని సోషల్ మీడియాలో నానా హంగామా నడించింది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇక లాభం లేదనుకుని స్వయంగా ఫిల్మ్ ఛాంబర్ ఈ గొడవపై స్పందించింది. కీలక ప్రకటన రిలీజ్ చేసింది.
(ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి)
'సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు థియేటర్ల వివాదాలపై తెలుగు చిత్రాలకి సంబంధించి మా మూడు సంస్థలు 15 రోజుల క్రితం ఓ మీటింగ్ పెట్టి సంక్రాంతి బరిలో ఉన్న ఐదుగురు ప్రొడ్యూసర్లని పిలిచి గ్రౌండ్ రియాలిటీ వివరించి సహకరించమని కోరాం. సంక్రాంతి బరిలో ప్రతి ఏటా సినిమాల పోటీ ఉంటుంది. అలానే ఈసారి ఐదు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. హనుమాన్, ఈగల్, సైంధవ్, గుంటూరు కారం, నా సామి రంగ. ఛాంబర్ వినతిని మన్నించి సంక్రాంతి బరి నుంచి 'ఈగల్' రిలీజ్ డేట్ ఫిబ్రవరి 9కి మార్చారు'
'సంక్రాంతి అంటే సినిమాల మధ్య మంచి పోటీ వాతావరణం ఉంటుంది. తెలుగు సినిమాకి సంబంధించి మా మూడు సంస్థలు కలిపి ఏ హీరోకి ప్రొడ్యూసర్ కి దర్శకుడు కి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుండి నడిపిస్తున్నాం. కానీ కొన్ని సైట్ల వాళ్లు ఫ్యాన్స్, హీరోలు, ప్రొడ్యూసర్ల మధ్య ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజాన్ని తెలుసుకుని వార్తలని రాయాల్సిందిగా కోరుతున్నాం. ఇకనుంచి సోషల్ మీడియా, ఇతర మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టే రాతలు రాస్తే మాత్రం తగిన చర్యలు తీసుకుంటాం' అని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటనలో పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment