సంక్రాంతి సినిమాల గొడవ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు! | Producer Dil Raju Comments On Sankranthi Release Movies Theatres Issue | Sakshi
Sakshi News home page

Dil Raju: లేటెస్ట్ ప్రెస్ మీట్.. నిర్మాత దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published Mon, Jan 8 2024 5:59 PM | Last Updated on Mon, Jan 8 2024 6:14 PM

Producer Dil Raju Comments On Sankranthi Release Movies Theatres Issue - Sakshi

తెలుగు ప్రజలు ప్రస్తుతం సంక్రాంతి మూడ్‌లో ఉన్నారు. కొత్త బట్టలు కొనాలి, ఈ వీకెండ్ వచ్చే కొత్త సినిమాలకు వెళ్లాలి. ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఇండస్ట్రీలో థియేటర్లలో సమస్య అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది. టాలీవుడ్‌లో ప్రస్తుత పరిస్థితులకు నిర్మాత దిల్‌రాజు ప్రధాన కారణమనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇలాంటి టైంలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

దిల్‌రాజ్ ఏం మాట్లాడారు?
తాజాగా హైదారాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లోని జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. 'ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి. అప్పుడు ఏదో ఓ రకంగా నాపై ప్రతి సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారు. 'హనుమాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి నా గురించి మాట్లాడిన మాటలని కొన్ని వెబ్‌సైట్లు తప్పుగా వక్రీకరించాయి. నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తా' అని చెప్పారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

'వ్యాపార పరంగా వచ్చే విమర్శలని ఆయా వెబ్‌సైట్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈరోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. తమిళ సినిమాను నేనే వాయిదా వేశాను. హను-మాన్ సినిమా విడుదల చేయాలని నేనే చెప్పాను. నైజాంలో హనుమాన్ , గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయి. నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు మాత్రం థియేటర్లు దొరకడం లేదు. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ వైబ్‌సైట్లకు నన్ను వాడుకుంటే తాటతీస్తా' అని దిల్‌రాజు హెచ్చరించారు.

అయితే దిల్‌రాజు ఇలా కామెంట్స్ చేయడం పక్కనబెడితే సోషల్ మీడియాలో మాత్రం ఈయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎందుకంటే 'హనుమాన్' తప్పితే మిగతా మూడు సినిమాలు అంటే 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామి రంగ' చిత్రాల్ని ఈయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనే న్యూస్ బయటకు రావడమే దీనికి కారణం అనిపిస్తోంది. 

(ఇదీ చదవండి: బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement