![Telugu Film Chamber producers sector press meet - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/28/Eluru-Surender-Reddy.jpg.webp?itok=Kq1MXxPN)
‘‘తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి వరాలు కురిపించిందని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. కానీ చిన్న చిత్రాలకు న్యాయం జరిగినట్లు అనిపించడంలేదు’’ అన్నారు ‘తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్’ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి. శుక్రవారం ఆయన మాట్లాడుతూ– ‘‘ఓ ఏడాదిలో వచ్చే 200 సినిమాల్లో పెద్ద సినిమాలు 20 నుంచి 30 వరకు ఉంటాయి. మిగిలినవి చిన్నవే.
కొత్త నటీనటుల్ని, సాంకేతిక నిపుణులను తీసుకువచ్చేది, సామాజిక స్పృహ ఉన్న చిత్రాలని తీసేది చిన్న నిర్మాతలే. 30 వేల మంది కార్మికులకు పని ఇచ్చేది ఈ నిర్మాతలే. థియేటర్స్‌లో మధ్యాహ్నం 2 గంటల షో కచ్చితంగా చిన్న సినిమా ప్రదర్శించాలని, షూటింగ్‌కి ఫ్రీగా లొకేషన్స్ ఇవ్వమని అడిగాం. థియేటర్స్‌లో సినిమా ప్రదర్శనకు డిజిటల్ ప్రొవైడర్స్ అన్యాయంగా వారానికి 12,000 వేలు వసూలు చేస్తున్నారు. మేమడిగిన ఈ మూడే మూడు డిమాండ్లను పక్కన పడేశారు. సంవత్సరంలో 180 చిత్రాలను తీస్తున్న చిన్న నిర్మాతలకి అన్యాయం చేశారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment