అలాంటి వారికి అండగా నిలుద్దాం: అల్లు అర్జున్‌ | Allu Arjun Shares Special Video On Awareness Of Drugs | Sakshi
Sakshi News home page

అలాంటి వారికి అండగా నిలుద్దాం.. అల్లు అర్జున్‌ వీడియో వైరల్‌

Published Thu, Nov 28 2024 6:52 PM | Last Updated on Thu, Nov 28 2024 9:27 PM

Allu Arjun Shares Special  Video On Awareness Of Drugs

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహరించాలని ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా  ఓ స్పెషల్‌ వీడియోని షేర్‌ చేస్తూ.. డ్రగ్స్ బాధితులను ఆదుకోవడానికి, సురక్షితమైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

‘‘మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్‌ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో టోల్‌ ఫ్రీ నంబర్‌: 1908కు ఫోన్‌ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’ అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశాడు.

కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ ‍రెడ్డి కోరిన సంగతి తెలిసిందే.  కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్‌లో రేవంత్‌ మట్లాడుతూ.. ఇకపై ఎవరికైనా సరే టకెట్‌ రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే  అల్లు అర్జున్‌  కూడా  పుష్ప 2  సినిమా రిలీజ్‌కి ‍కొద్ది రోజుల ముందుకు అలా వీడియో చేసి పంపారు.  గతంలో కమల్‌ హాసన్‌, చిరంజీవి, ఎన్టీఆర్‌తో పాటు మరికొంతమంది హీరోలు కూడా ఇలాంటి అవగాహన వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement