రొమాంటిక్ ఎంటర్‌టైనర్ | Romantic entertainer | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

Published Mon, Dec 15 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

 భరత్ భూషణ్, మిలన్, రీతు, చాచా పతుంతిప్ (బ్యాంకాక్) ముఖ్య తారలుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో టి. చలపతి నిర్మించిన చిత్రం ‘బూమ్ బూమ్’. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. టి.ప్రసన్నకుమార్ ఆడియో సీడీని ఆవిష్కరించి తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు. ఈ సందర్భంగా నగేష్ నారదాసి మాట్లాడుతూ - ‘‘యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. కథానుసారం షూటింగ్ బ్యాంకాక్‌లోనే చేశాం’’ అన్నారు. పాటలు బాగా కుదిరాయనీ, సినిమా కూడా బాగా వచ్చిందని చలపతి చెప్పారు. కథ బాగుండటంతో మంచి పాటలివ్వడానికి కుదిరిందని సుభాష్ ఆనంద్ తెలిపారు. చిత్రం విజయం సాధించి, యూనిట్ అందరికీ మంచి పేరొస్తుందనే నమ్మకం ఉందని భరత్ భూషణ్ అన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement