దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికలకు సంబంధించిన విషయాలు ప్రధానాంశాలుగా నిలుస్తున్నాయి. తాజాగా చండీగఢ్ బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ రీతూ సింగ్ ప్రమాదానికి గురయ్యారు. ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, తలకు కుట్లు వేశారు.
వివరాల్లోకి వెళితే స్థానికంగా ఉన్న ఒక కాలనీలోని బీఎస్‌పీ నేతలు, కార్యకర్తలు డాక్టర్ రీతూ సింగ్‌ను నాణేలతో తూకం వేస్తున్నారు. ఇంతలో ఆ తూకం తెగిపోయి, దాని రాడ్డు ఆమె తలకు తగిలింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమయ్యింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు చికిత్స అందించి, తలకు కుట్లు వేసి ఇంటికి పంపించారు.
చండీగఢ్ నుంచి డాక్టర్ రీతూ సింగ్‌ను బీఎస్పీ పోటీకి నిలిపింది. రీతూ.. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. సైకాలజీ సబ్జెక్టులో ఆమెకు విశేష అనుభవం ఉంది. యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో ఆమె దళితుల పక్షాన గొంతెత్తారు. ఈ నేపధ్యంలో ఆమెను డిస్మిస్ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ రీతూ సింగ్ పీహెచ్‌డీ పకోడా వాలీ పేరుతో ఓ స్టాల్ కూడా పెట్టారు. కుల వేధింపుల ఆరోపణలతో 2023, సెప్టెంబర్‌లో ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో నిరసన చేపట్టారు. ఈ సమయంలోనే ఆమె విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గుర్యయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment